news

News September 8, 2024

చైనాలో సంస్థ ప్రారంభించిన అదానీ గ్రూప్

image

చైనాలో సప్లై చెయిన్ సొల్యూషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సేవల కోసం అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ(సబ్సిడరీ)ను ప్రారంభించింది. అదానీ ఎనర్జీ రిసోర్సెస్(షాంఘై) కో(AERCL)ను ఈ నెల 2న స్టార్ట్ చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అదనపు వివరాలను మాత్రం పేర్కొనలేదు. కాగా కొన్ని రోజుల క్రితమే కెన్యాలో అదానీ గ్రూపు ఓ సబ్సిడరీని ప్రారంభించింది. ఆ దేశంలో 7 ఎయిర్‌పోర్టుల్ని సంస్థ మేనేజ్ చేస్తోంది.

News September 8, 2024

DJ విషయంలో గొడవ.. ముగ్గురు మృతి

image

గణేశ్ మండపం వద్ద DJ విషయంలో యువకుల మధ్య ఏర్పడిన వాగ్వాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా నందిని PS పరిధిలో వినాయకచవితి ముందు రోజు మండపం వద్ద DJకు డాన్స్ చేస్తుండగా కొందరు యువకుల మధ్య వాగ్వాదం జరగ్గా, స్థానికుల జోక్యంతో ముగిసింది. తర్వాతి రోజు మండపం వద్ద ఇరువర్గాలు కర్రలు, మారణాయుధాలతో దాడి చేసుకోగా, ఓ వర్గానికి చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

News September 8, 2024

రిపేర్ల ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది: చంద్రబాబు

image

AP: విజయవాడ వరద బాధితులకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు రిపేర్లు చేపించేలా చర్యలు తీసుకుంటామని CM చంద్రబాబు తెలిపారు. అందుకయ్యే ఖర్చుని అవసరమైతే ప్రభుత్వమే సబ్సిడీ లేదా పూర్తిగా భరిస్తుందని తెలిపారు. ‘ఫస్ట్ ఫ్లోర్‌ వరకు ఉన్నవాళ్లు సర్వం కోల్పోయారు. బాధితులను ఏ రకంగా ఆదుకోవాలో ఆలోచిస్తున్నాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం’ అని CBN చెప్పారు.

News September 8, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికను..

image

ఇన్‌స్టాలో పరిచయమైన బాలికను ఓ యువకుడు 20 రోజులుగా గదిలో బంధించిన ఘటన HYDలో వెలుగుచూసింది. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో యువకుడితో పరిచయమైంది. అతడి ట్రాప్‌లో పడ్డ ఆమె నగరానికి వచ్చింది. బాలికను అతడు నారాయణగూడలోని హోటల్‌ గదిలో 20 రోజులు బంధించాడు. చివరికి ఎలాగోలా ఆమె పేరెంట్స్‌కి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో షీ టీమ్స్ రక్షించాయి. యువకుడిపై క్రిమినల్ కేసు నమోదైంది.

News September 8, 2024

నా అనర్హతపై ఆనందించడం దేశద్రోహమే: వినేశ్

image

ఒలింపిక్స్‌లో తన అనర్హత వేటుపై ఆనందిస్తున్నవారిని దేశద్రోహులుగా పరిగణించి విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత, రెజ్లర్ వినేశ్ ఫొగట్ డిమాండ్ చేశారు. ‘నేను గెలవలేదని హ్యాపీ అవుతున్నారంటే అది దేశద్రోహమే. వారు దేశాన్ని, జాతిని అగౌరవపరిచినట్లే’ అని పేర్కొన్నారు. దేవుడు శిక్షించడం వల్లే వినేశ్ ఒలింపిక్స్‌లో ఓడారంటూ WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News September 8, 2024

హసీనాను వెనక్కి తీసుకొస్తాం: బంగ్లా

image

భారత్‌లో తలదాచుకున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కి రప్పిస్తామని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తైజుల్ ఇస్లామ్ పేర్కొన్నారు. అందుకోసం అవసరమైన చర్యల్ని తీసుకుంటామని మీడియాతో అన్నారు. ‘ఆమె అప్పగింత విషయంలో భారత్‌తో ఉన్న ఒప్పందాలను అనుసరిస్తాం. జులై, ఆగస్టులో విద్యార్థుల నిరసనల సమయంలో సామూహిక హత్యలు చేయించినట్లు హసీనాపై ఆరోపణలున్నాయి’ అని తెలిపారు.

News September 8, 2024

భారత క్రికెట్ శక్తిమంతమవ్వడానికి కారణమదే: ద్రవిడ్

image

భారత క్రికెట్ నేడు అత్యంత శక్తిమంతమైన స్థాయికి చేరుకుందని మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఓ కార్యక్రమంలో కొనియాడారు. దేశం నలుమూలల నుంచీ నైపుణ్యం వెలుగులోకి రావడమే అందుకు ప్రధాన కారణమన్నారు. ‘మా సమయంలో క్రికెటర్లు ప్రధాన నగరాల నుంచి మాత్రమే ఉండేవారు. మారుమూల ప్రాంతాల్లో మంచి ఆటగాళ్లు ఉన్నా వారికి పైకొచ్చే మార్గం ఉండేది కాదు. ప్రస్తుతం మన దేశవాళీ క్రికెట్ అత్యంత బలంగా ఉంది’ అని పేర్కొన్నారు.

News September 8, 2024

బంగ్లాతో తొలి టెస్ట్.. టీమ్ ఇండియా ఇదే..

image

బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్ట్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌కు టీమ్‌లో చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టారు.
జట్టు: రోహిత్(C), జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా, యశ్ దయాల్.
** ఈనెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్ట్ జరగనుంది.

News September 8, 2024

నిర్విరామంగా సహాయక చర్యలు: సీఎం చంద్రబాబు

image

AP: భారీ వర్ష సూచన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. పిఠాపురం ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో కృష్ణానదికి వరద వచ్చింది. బుడమేరు కబ్జాల వల్ల లక్షల మంది ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి’ అని తెలిపారు.

News September 8, 2024

వాటర్ ట్యాంక్ ఎక్కిన వినాయకుడు!

image

TG: చాలాచోట్ల రూ.లక్షలు ఖర్చుపెట్టి వినాయక మండపాల సెట్లు వేశారు. కానీ ఈ సెట్ మాత్రం భిన్నం. వనపర్తి జిల్లా రేవల్లిలో కొందరు యువకులు వాటర్ ట్యాంక్ కింద గణపయ్యను ప్రతిష్ఠించారు. 20 ఏళ్ల కిందట ట్యాంక్ ఉన్న ప్లేస్‌లో వినాయకుడిని పెట్టేందుకు యత్నించగా వరదతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత అక్కడ ట్యాంక్ నిర్మించడంతో అప్పటి నుంచి ఇలా దాని కిందే గణనాథుడి మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఐడియా అదిరింది కదూ!