India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో రైతుల కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళా జరగనుంది. 16 పంటల్లో 67 రకాలకు చెందిన 12వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. HYD రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంతోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యయసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో మేళాను అధికారులు నిర్వహిస్తారు.
AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 12న స్కూళ్ల తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. కాగా ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.
ప్రపంచ కప్ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల ఆర్చరీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏపీకి చెందిన జ్యోతి సురేఖ, పర్ణిత్ కౌర్, అదితి స్వామి బృందం సెమీ ఫైనల్లో 233-229 పాయింట్లతో అమెరికాను ఓడించింది. శనివారం ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీ పడుతుంది. కాగా షాంఘైలో గత నెలలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో జ్యోతి సురేఖ బృందం గోల్డ్ మెడల్ సాధించింది.
TG: రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సన్న వడ్లకే బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై మంత్రి స్పందించారు. పేదలు సన్నబియ్యం తినాలని సంకల్పించామన్నారు. అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాకు రూ.500బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్తులో దొడ్డు వడ్లకూ దీన్ని వర్తింపజేస్తామని వివరించారు.
TG: ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు వెళ్లనున్నాయి. అతిథులకు ప్రసిద్ధి చెందిన హస్తకళారూపాలను ఇవ్వాలని అంబానీ కుటుంబం నిర్ణయించింది. దీంతో ఇక్కడి నుంచి జ్యూయలరీ బాక్సులు, ట్రేలు, పర్సులు వంటి వస్తువులకు ఆర్డర్ ఇచ్చారు. వెండి తీగతో ఇక్కడి కళాకారులు వస్తువుల్ని రూపొందిస్తారు. గతేడాది జీ20 సదస్సుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి నుంచే పంపారు.
TG: రేపటి నుంచి జూన్ 3 వరకు జరగనున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 900 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఫస్టియర్, మ.2:30 నుంచి సా.5:30 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
రాష్ట్ర విభజన నుంచి HYDలోనే కొనసాగుతున్న APERC(ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి) ప్రధాన కార్యాలయం APకి తరలిరానుంది. కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో 2 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఇవాళ అధికారులు ప్రారంభోత్సవం చేయనున్నారు. వారంలో కార్యకలాపాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అమరావతిలో కాకుండా కర్నూలులో ఆఫీస్ నెలకొల్పడంపై హైకోర్టులో విచారణ సాగుతోంది.
TG: 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులైలో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 10న తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. జూన్ 4న ఎన్నికల ప్రక్రియ ముగియనుండడంతో పూర్తిస్థాయి బడ్జెట్‌పై కసరత్తు చేస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం జూన్ ఆఖరు లేదా జులై రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
AP: మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల(M) పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రం పీవో, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్నా అడ్డుకోకపోవడం సీసీ ఫుటేజీలో రికార్డయింది. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్వోని EC ఆదేశించింది. కాగా MLA పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లలో 325 మంది చిన్నారులను దత్తత తీసుకోగా, అందులో 186 మంది బాలికలే ఉండటం విశేషం. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల దంపతులు 262 మందిని, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, యూకే తదితర దేశాల కపుల్స్ 63 మందిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 శిశుగృహాల్లో 0-6 ఏళ్లలోపు 110 మంది చిన్నారులున్నారు. వారి దత్తత కోసం 1,018 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.