India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 29 పతకాలతో సత్తా చాటింది. టోక్యో కంటే ఈసారి 10 మెడల్స్ ఎక్కువ రావడం గమనార్హం. ఈ సారి 7 బంగారు, 9 వెండి, 13 కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. 25 పతకాలు లక్ష్యంగా పెట్టుకుంటే 4 ఎక్కువగా సాధించి భారత పారా అథ్లెట్లు అద్భుతం చేశారు. దీంతో దేశం గర్వించేలా చేసిన వీరికి ఘనంగా స్వాగతం పలకాలని పలువురు కోరుతున్నారు.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరంలో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు కుండపోత వర్షాలు కురుస్తున్న విశాఖ, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
AP: విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. వర్షం కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో పలు ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు-వైజాగ్ మధ్య నడవాల్సిన 2 విమానాలతో పాటు మరో 5 ఫ్లైట్స్ రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంచి టాక్ తెచ్చుకున్న ‘35-చిన్న కథ కాదు’ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని, మున్ముందు మరింత వసూలు చేయొచ్చని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తాజాగా అంచనా వేశారు. తెలుగులో సక్సెస్ కావడంతో తమిళ, మలయాళ భాషల్లోనూ మూవీని నిర్మాతలు రిలీజ్ చేయనున్నారని ఆయన వెల్లడించారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలకూ ఘన విజయం అందిస్తామని టాలీవుడ్ ప్రేక్షకులు మరోసారి నిరూపించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
AP: గణేశ్ మండపాల్లో మైక్‌సెట్‌కు రూ.100, విగ్రహం హైట్‌ను బట్టి రూ.350-700 చలానా చెల్లించాలని ఇటీవల చెప్పిన హోంమంత్రి అనిత ఇవాళ <<14051538>>మరోరకంగా<<>> స్పందించారు. ఆ జీవోను జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని, తాము రూపాయి కూడా వసూలు చేయట్లేదని చెప్పారు. అయితే పలువురు భక్తులు తాము మండపాలకు కట్టిన చలాన్ల రసీదు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
మీరు మండపాలకు చలానా కట్టారా? కామెంట్ చేయండి.
వినాయకుడి విగ్రహమంటే గజ ముఖంతోనే చూస్తుంటాం. తమిళనాడులోని తిలాతర్పణపురి ఆదివినాయకర్ ఆలయంలో మాత్రం మానవముఖంతో ఉన్న గణనాథుడు దర్శనమిస్తాడు. అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారుచేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజాననుడిగా మారాడు. అమ్మవారు తొలిగా చేసిన బుజ్జి గణపయ్య రూపమే ఇక్కడ పూజలందుకుంటోంది. ఇక్కడ పిండప్రదానం పితృదేవతలకు ముక్తిదాయకమని ప్రతీతి.
పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత ఇంగ్లండ్‌కు చెందిన సెరీన్ ప్రైస్‌కు సరిగ్గా సరిపోతుంది. వయసు ఆరేళ్లే అయినా మొరాకోలోని 13,600 అడుగుల ఎత్తైన మౌంట్ టౌబ్‌కల్ పర్వతాన్ని అధిరోహించింది. ఈక్రమంలో అత్యంత పిన్నవయసులో ఈ పర్వతం ఎక్కిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది. తన ప్రాణాలు రక్షించిన ఓ ఆస్పత్రికి నిధులు సమీకరించేందుకు ఆమె ఈ సాహసం చేసింది. యూరప్‌లోని మాంట్ బ్లాంక్‌ను ఆమె త్వరలో అధిరోహించనుండటం విశేషం.
TG: హైడ్రా <<14051102>>కూల్చివేతలపై<<>> నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయబోమన్నారు. కొత్త నిర్మాణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని కూలుస్తున్నట్లు తెలిపారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న యజమానులకు భారీ ఊరట కలిగింది.
AP: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో. జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. దీంతో GVMC అప్రమత్తమైంది. 184 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, సాయం కోసం 180042500009 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.
NSA అజిత్ దోవల్ ఈ వారం రష్యాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమస్య పరిష్కారానికై శాంతి ప్రయత్నాలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో PM మోదీ ఫోన్ సంభాషణ సందర్భంగా, తన ఉక్రెయిన్ పర్యటన అనంతరం దోవల్ రష్యాలో పర్యటించి శాంతి ప్రయత్నాలపై చర్చిస్తారని మోదీ పేర్కొన్నట్టు తెలిసింది. బ్రిక్స్-NSA సమావేశంలో కూడా దోవల్ పాల్గొంటారని సమాచారం.
Sorry, no posts matched your criteria.