news

News March 18, 2024

మోదీకి నా మాటలు నచ్చవు: రాహుల్

image

ప్రధాని మోదీకి తన మాటలు నచ్చవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తన మాటల్లోని సత్యమేంటో తెలిసి కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ మోదీ హస్తాల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. మోదీ అధర్మానికి, అవినీతికి, అసత్యానికి శక్తి రూపమని విమర్శించారు. తాను వ్యతిరేకించినప్పుడల్లా మోదీ కలత చెందుతారని పేర్కొన్నారు.

News March 18, 2024

క్రాంగెస్‌లో చేరడానికి గొర్రెల్లో ఒకడిని కాదు: RSP

image

TG: తాను కేసీఆర్‌తో కలిసి పని చేయడంపై CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై RS ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ ప్రజలకు ఏ పార్టీలో చేరాలనే విషయంలో స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ‘మీరు గేట్లు తెరిస్తే చాలామంది పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల మందలా వస్తున్నారు. ఆ గొర్రెల మందలో నేను లేను. ప్రవీణ్ కుమార్ నిజమైన, నిస్వార్థ, నిఖార్సైన వ్యక్తి’ అని RSP అన్నారు.

News March 18, 2024

హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోండి: EC

image

రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. 85ఏళ్లు నిండిన వారు హోమ్ ఓటింగ్ కోసం ఏప్రిల్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరో మూడు రోజుల్లో హోమ్ ఓటింగ్ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 90వేల పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు.

News March 18, 2024

ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డ్ అయ్యాడు: అశ్విన్

image

ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో 26 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ అశ్విన్ ఓ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సిరీస్‌ తొలి టెస్టులో ENG కెప్టెన్ స్టోక్స్ వికెట్ తీయడం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. ఎల్బీ చేద్దామనే ఉద్దేశంతో బంతి వేస్తే బౌల్డ్ అయ్యాడని తెలిపారు. బజ్‌బాల్ దూకుడు ప్రదర్శించడంలో ఇంగ్లండ్ విఫలమైందని చెప్పారు. వారు ఇంకాస్త నాణ్యమైన క్రికెట్ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

News March 18, 2024

2,049 ప్రభుత్వ ఉద్యోగాలు.. APPLY చేసుకోండి

image

SSCలో 2,049 ఉద్యోగాల అప్లికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. విద్యార్హత: పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ. ప్రోగ్రామ్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. మే 6 నుంచి 8 వరకు పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. సైట్: https://ssc.gov.in/

News March 18, 2024

టికెట్ దొరకడం కష్టమే

image

CSK, RCB మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చెన్నై వేదికగా ఈ నెల 22న జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం టికెట్లు అన్నీ బుకింగ్ అయిపోయాయి. ముందస్తు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్ స్లాట్‌ను బుక్ చేసుకున్నారు. తాజాగా పేటీఎం ఇన్‌సైడర్‌లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా ప్రస్తుతం ‘YOU ARE NOW IN THE QUEUE’ అని చూపిస్తోంది. టికెట్ల ధ‌రలు రూ.1,700 నుంచి రూ.7,500 వరకు ఉన్నాయి.

News March 18, 2024

పెట్రో ధరలు మన దగ్గరే ఎక్కువ!

image

తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.87గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.60గా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక రెండో స్థానంలో కేరళ(పెట్రోల్ రూ.107.54, డీజిల్ రూ.96.41), మూడో స్థానంలో తెలంగాణ(పెట్రోల్ రూ.107.39, డీజిల్ రూ.95.63) ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ విషయంలో కేంద్రం ఊరటనిస్తున్నా.. రాష్ట్రాల వ్యాట్ బాదుడు కారణంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.

News March 18, 2024

పెళ్లిలో డాన్స్ చేస్తూ.. గుండెపోటుతో మృతి

image

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా కొలనూరులో ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ చేస్తూ రావుల విజయ్ కుమార్(33) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతడిని వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది.

News March 18, 2024

టెస్లా కారు డిజైన్‌పై విమర్శలు!

image

టెస్లా కార్లకు ఉన్న క్రేజే వేరు. అయితే ఇటీవల ఏంజెలా చావో అనే బిలియనీర్ మహిళ మృతితో ఈ కారు డిజైనింగ్, భద్రత చర్చనీయాంశమయ్యాయి. డ్రైవ్ మోడ్ బదులు రివర్స్ గేర్ వేయడంతో కారు సమీపంలో ఉన్న చెరువులో పడగా అందులోంచి బయటకు రాలేక ఆమె చనిపోయారు. గేర్ షిఫ్టింగ్‌ డిజైన్‌లో లోపాలే ఈ ఘటనకు కారణమని పలువురు టెస్లా యూజర్లు విమర్శిస్తున్నారు. గతంలోనూ ఈ డిజైన్‌పై ఫిర్యాదులు నమోదు కావడం గమనార్హం.

News March 18, 2024

GREAT: 7 ఏళ్లలో ఎంత మార్పు!

image

WPL-2024 పర్పుల్ క్యాప్ విజేత RCB, స్టార్ బౌలర్ శ్రేయాంక పాటిల్‌కు సంబంధించిన ఓల్డ్ ఫొటో వైరలవుతోంది. 2017లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో ఆమె సెల్ఫీ దిగారు. ఆ ఫొటోతో పాటు తాజాగా ఆమె ట్రోఫీతో దిగిన ఫొటోను ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. ‘సక్సెస్ అంటే ఇదే.. RCB ఫ్యాన్‌ నుంచి 7 ఏళ్లలో గ్రౌండ్‌లో ట్రోఫీని ముద్దాడే స్థాయికి చేరుకున్నారు’ అని కొనియాడుతున్నారు. ఆమె 8 మ్యాచుల్లో 13 వికెట్లు తీశారు.