India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* అప్పుడే పుట్టిన పిల్లలు: 18 గంటలు
* 4-11 నెలల చిన్నారులు: సుమారు 15 గంటలు
* 3-5 ఏళ్ల పిల్లలు: 13 గంటలు
* 6-12 ఏళ్ల పిల్లలు: 9-12 గంటలు
* 13-18 ఏళ్ల వారు: కనీసం 8 గంటలే
* 18-60 ఏళ్ల వారు: 7-9 గంటలు
* 60 ఏళ్లు పైబడినవారు: 7-8 గంటలు
** లేదంటే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.
పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. CSS రూల్ 2021లో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది.
తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ బులిటెన్ జారీ చేశారు. ఈ ఏడాది జులై 25న మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ అందించారు.
తండ్రి అనిల్ మెహతా <<14074510>>మరణంపై<<>> బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఆయన ఎంతో సౌమ్యుడు. ప్రేమగల భర్త, మంచి గ్రాండ్ ఫాదర్, మా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఘటనతో మా కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, శ్రేయోభిలాషులను కోరుతున్నా. కష్టసమయంలో అండగా నిలిచిన వారందరీకి కృతజ్ఞతలు’ అని ఆమె రాసుకొచ్చారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని వివరించేందుకు షా అపాయింట్‌మెంట్‌ను సీఎంవో కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి వరద సాయం చేయాలని సీఎం కేంద్రమంత్రిని కోరే ఛాన్సుంది. అటు ప్రధానితో భేటీకి కూడా రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
AP: అటవీ సంపదను పరిరక్షించడంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయమని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. ‘APలో 37,421 చ.కి.మీ అమూల్యమైన అటవీ సంపదను రక్షించడంలో మన సిబ్బంది ముందంజలో ఉన్నారు. కొందరు ప్రాణత్యాగం చేశారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. వారికి నివాళులర్పిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2.57 గంటలుగా ఉంది. కాగా ఈ నెల 27న దేశ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో 55 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది.
TG: DSC అభ్యర్థులు తమ టెట్ వివరాలను ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ తర్వాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. DSCలో వచ్చిన మార్పులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల DSC ఫైనల్ కీ విడుదల కాగా, 2-3 రోజుల్లో ఫలితాలూ రానున్నాయి. ఈ క్రమంలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.
TG: ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని TGSRTC MD సజ్జనార్ హెచ్చరించారు. ‘స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి నమ్మకండి. అజ్ఞాత వ్యక్తుల కాల్స్‌కు స్పందించకండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని ఓ ఘటనను ఆయన పంచుకున్నారు.
TG: వైద్య, ఆరోగ్య శాఖలో 4వేల పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. వీటిల్లో 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 2030 మంది స్టాఫ్ నర్సులు, మరికొన్ని ఫార్మాసిస్టు పోస్టులు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు.
Sorry, no posts matched your criteria.