news

News May 22, 2024

యూట్యూబ్‌లో సాంకేతిక సమస్య!

image

యూట్యూబ్‌లో వ్యూయర్ షిప్ ఒక్కసారిగా పడిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. లైవ్ వీడియోలకు వేలల్లో ఉండాల్సిన సంఖ్య కేవలం సింగిల్, డబుల్ డిజిట్లలోనే దర్శనమిస్తోందని పేర్కొంటున్నారు. యూట్యూబ్‌కు ఏమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారత్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నట్లు మరికొందరు చెబుతున్నారు.

News May 22, 2024

ఢిల్లీ హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

image

ఢిల్లీలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌‌‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. నార్త్ బ్లాక్‌లో ఉన్న హోంశాఖ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు దుండగులు ఈమెయిల్ చేశారు. దీంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. కంట్రోల్ రూమ్ వద్దకు 2 ఫైర్ ఇంజిన్లను రప్పించారు. కొద్దిరోజులుగా బాంబు బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ ఢిల్లీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల స్కూళ్లు, ఆసుపత్రులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

News May 22, 2024

ప్రభుత్వ కార్యక్రమానికి సోనియాను పిలుస్తారా?: కిషన్ రెడ్డి

image

TG: సోనియా గాంధీ వల్ల తెలంగాణ రాలేదని, అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఏ ప్రాతిపదికన ఆమెను పిలుస్తారని ప్రశ్నించారు. వందల మందిని బలి తీసుకున్న సోనియాను పిలవడమేంటని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

News May 22, 2024

కోల్‌‘కథ’ మార్చేశాడుగా!

image

గత రెండేళ్లలో చెత్త ప్రదర్శనతో నిరాశపర్చిన కోల్‌కతా.. గౌతీ రాకతో ఈసారి ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. బౌలర్ నరైన్‌ను ఓపెనర్‌గా దించి గంభీర్ సక్సెస్ అయ్యారు. ఇతర ఆటగాళ్ల ప్రదర్శన కూడా ఆ జట్టుకు కలిసొచ్చింది. విలువైన సూచనలతో లీగ్ దశలో జట్టును టేబుల్ టాపర్‌గా నిలపడంలో ఆయనదే కీలకపాత్ర. సారథిగా 2012, 14లో KKRకు కప్పు అందించిన గౌతీ.. ఈ సారి మెంటర్‌గా మరో కప్పు సాధించేందుకు అడుగు దూరంలో నిలిచారు.

News May 22, 2024

పుణే కేసు.. నిందితుని కుటుంబానికి మాఫియాతో లింక్స్!

image

పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుని కుటుంబానికి గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి తాత సురేంద్ర అగర్వాల్ ఓ షూటౌట్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోదరుడు RK అగర్వాల్‌తో ఆస్తి తగాదా తేల్చుకునేందుకు సురేంద్ర చోటా రాజన్ గ్యాంగ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై తిరుగుతున్నారు.

News May 22, 2024

ఎలిమినేటర్‌ పోరుకు వర్షం ముప్పు లేదు: వాతావరణ శాఖ

image

కాసేపట్లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న RR, RCB జట్ల ఎలిమినేటర్‌ పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అధిక తేమ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో మంచు కీలక పాత్ర పోషిస్తుందని వివరించింది. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. ఐపీఎల్లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 30 సార్లు తలపడగా ఆర్సీబీ 15, రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో నెగ్గాయి.

News May 22, 2024

పర్సెంటేజీ ఇస్తేనే సినిమాల ప్రదర్శన: ఫిల్మ్ ఎగ్జిబిటర్లు

image

నిర్మాతలు మల్టీప్లెక్స్‌లకు ఇచ్చినట్లు తమకూ పర్సెంటేజీ ఇస్తేనే చిత్రాలను ప్రదర్శిస్తామని ఫిల్మ్ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు జూలై 1వరకు గడువు విధించారు. అటు ఇకపై అద్దె ప్రాతిపదికన ప్రదర్శనలు ఉండవని తేల్చిచెప్పారు. ముందస్తు ఒప్పందంతో కల్కి, పుష్ప2, గేమ్ ఛేంజర్, భారతీయుడు-2 మూవీలకు మినహాయింపు ఉంటుందన్నారు. మరోవైపు ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలూ ప్రదర్శించబోమన్నారు.

News May 22, 2024

పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లు మాకు తెలియదు: SP

image

TG: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌పై తమకు సమాచారం లేదని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఆయన కోసం గాలిస్తున్నామని, అదుపులోకి తీసుకున్నట్లు తమకే తెలియదన్నారు. కాగా పిన్నెల్లిని సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

News May 22, 2024

కోహ్లీ అగ్రెసివ్ ఇన్నింగ్స్ చూస్తామా?

image

RCBvsRR మధ్య నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈక్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తారనే దానిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ టోర్నీలో అగ్రెసివ్ ఇన్నింగ్స్‌లతో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ఎలాగైనా కప్ కొట్టాలనే కసిలో ఉన్నారు. కోహ్లీ.. 2020లో SRHతో ఎలిమినేటర్ మ్యాచులో 6(7), 2021 ఎలిమినేటర్‌లో KKRపై 39(33), 2022 ఎలిమినేటర్‌లో LSGపై 25(22) & క్వాలిఫయర్-2లో RRపై 7(8) రన్స్ చేశారు.

News May 22, 2024

TSRTC పేరు TGSRTCగా మార్పు

image

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(TSRTC) పేరును TGSRTCగా మార్చినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈమేరకు ట్విటర్ ఖాతాను కూడా @TGSRTCHQగా మార్చామన్నారు. ఇక విద్యుత్ సంస్థలైన TS జెన్‌కో సైతం TG జెన్‌కోగా, TS ట్రాన్స్‌కో నుంచి TG ట్రాన్స్‌కోగా మారాయి.