news

News May 22, 2024

కాసేపట్లో మ్యాచ్.. కోహ్లీ భద్రతకు ముప్పు!

image

అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో కాసేపట్లో RCBvsRR మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అయితే కోహ్లీకి ముప్పు ఉండటంతో స్టేడియం వద్ద భద్రతను పెంచారు. నిన్న RCB ప్రాక్టీస్ సెషన్‌ను కూడా రద్దు చేసినట్లు సమాచారం. మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ISIS ఉగ్రవాదులు పట్టుబడటంతో కోహ్లీ భద్రతకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. స్టేడియానికి 5వేల మంది పోలీసులు, వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నారు.

News May 22, 2024

యాభై LIC పాలసీలు తీసుకోవచ్చా?

image

బాలీవుడ్ నటి, BJP ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ తనకు 50 LIC పాలసీలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే సామాన్యులు ఇలా 50 లేదా అంతకన్నా ఎక్కువ పాలసీలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. వాటిని మేనేజ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదని, క్లెయిం చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఎంత మొత్తానికి కవరేజ్ అవసరమో పరిశీలించి అందుకు తగ్గ ప్లాన్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

News May 22, 2024

ఒక గంట నిద్ర కోల్పోతే.. 4 రోజులు ఇబ్బందే!

image

18 ఏళ్లు పైబడిన వారికి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, వివిధ కారణాల వల్ల చాలా మంది 5-6 గంటలే పడుకుంటారు. అయితే, ఒక గంట నిద్రను కోల్పోతే దాని నుంచి కోలుకునేందుకు 4 రోజులు పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోతే తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, శ్రద్ధగా పనిచేయలేకపోవడం, చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు రోజూ ఎన్ని గంటలు నిద్రపోతుంటారు?

News May 22, 2024

ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం: CEO ముకేశ్

image

AP: మాచర్లలో EVM ధ్వంసం కేసులో YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A1గా చేర్చినట్లు CEO ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామన్నారు. ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. నిన్నటి నుంచి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

News May 22, 2024

BJP ఢిల్లీకి నీటి సరఫరా నిలిపివేసింది: ఆతిశీ

image

ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ కొత్త కుట్ర పన్నిందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. యమునా నది నీటిని ఢిల్లీకి రాకుండా అడ్డుకొని, దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని సృష్టించాలని చూస్తోందని అన్నారు. ఢిల్లీ చరిత్రలో యమునా నది నీటి మట్టం 671 అడుగుల కంటే తగ్గడం ఇదే తొలిసారి అని ఆమె అన్నారు.

News May 22, 2024

ఏదైనా మ్యాజిక్ చేస్తేనే RRకి విజయావకాశాలు: గవాస్కర్

image

IPLలో ఇవాళ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో RCB ఆధిపత్యం చూపే అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. క్వాలిఫయర్-1లో KKRలా ఏదైనా మ్యాజిక్ చేస్తేనే రాజస్థాన్‌కు గెలిచే అవకాశాలు ఉంటాయని అన్నారు. RCB వరుస విజయాలతో దూకుడు మీద ఉందని, వరుస ఓటములతో RR పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విశ్లేషించారు. నేటి మ్యాచులో RCB గెలవకపోతే మాత్రం ఆశ్చర్యకరమేనని వ్యాఖ్యానించారు.

News May 22, 2024

BREAKING: పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు

image

AP: YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ చేసి, అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. IPC, RP, PDPP చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. IPC కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్లు, PDPP కింద మరో కేసు, RP చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు కట్టారు.

News May 22, 2024

EVMలో డేటా సేఫ్‌గా ఉంది: సీఈవో ముకేశ్

image

AP: మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన EVMలో డేటా సేఫ్‌గా ఉందని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అక్కడ కొత్త EVMతో పోలింగ్ కొనసాగించామని వివరించారు. పోలింగ్ నాడు మాచర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయని, అందులో కొందరు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు వెబ్‌కాస్టింగ్‌లో గుర్తించామని వెల్లడించారు. ఈ కేసులో ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉందన్నారు.

News May 22, 2024

సన్నవడ్లకు మాత్రమే ₹500 బోనస్ ఇస్తామనడం విడ్డూరం: కిషన్‌రెడ్డి

image

TG: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సన్నవడ్లకు మాత్రమే ₹500 బోనస్ ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 80% మంది దొడ్లు వడ్లనే పండిస్తారని, చాలా తక్కువ మంది సన్నవడ్లు పండిస్తారని పేర్కొన్నారు. దొడ్లు వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, వాటిని కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు.

News May 22, 2024

పరారీలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి?

image

AP: మాచర్ల YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన తన కారు వదిలి పరారైనట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని CEO, DGPని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.