news

News May 21, 2024

బ్రెడ్, బటర్, చీజ్ ఎక్కువైతే ప్రమాదం: ICMR

image

ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాల్లో బ్రెడ్, బటర్, చీజ్ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ కిందే పరిగణించాలని చెప్పింది. అందులో అధికంగా ఉప్పు, షుగర్, కొవ్వు ఉంటాయని పేర్కొంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, అనేక ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయని హెచ్చరించింది. అందుకే వాటిని ఎక్కువగా తీసుకోవద్దని సూచించింది.

News May 21, 2024

పీకల్లోతు కష్టాల్లో SRH

image

KKRతో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో SRH బ్యాటర్లు తడబడుతున్నారు. ఓపెనర్లు హెడ్(0), అభిషేక్(3)తో పాటు నితీశ్(9), షాబాజ్(0) ఘోరంగా విఫలమయ్యారు. 5 ఓవర్లకే 39 రన్స్ చేసిన హైదరాబాద్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో SRH భారీ స్కోర్ చేస్తుందనే అంచనాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అభిమానుల ఆశలన్నీ క్లాసెన్‌పైనే ఉన్నాయి.

News May 21, 2024

మరో లగ్జరీ కారును కొనుగోలు చేసిన నాగచైతన్య

image

నటుడు నాగచైతన్య తాజాగా పోర్షే 911 జీటీ3ఆర్ఎస్‌ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ.3.5 కోట్లని సమాచారం. కారు పక్కన చైతూ ఉన్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అత్యంత ఖరీదైన పలు లగ్జరీ కార్లు ఆయన సొంతం. వాటిలో రూ.4 కోట్లకు పైబడిన లంబోర్గినీ, ఫెరారీ, ల్యాండ్ రోవర్ తదితర సంస్థల కార్లున్నాయి. కాగా.. చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘తండేల్’లో నటిస్తున్నారు.

News May 21, 2024

ఈ స్టార్లు పౌరసత్వం లేకనే ఓటేయలేకపోయారు!

image

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌‌‌లో బాలీవుడ్ స్టార్లు ఓటేశారు. అయితే, కొందరు స్టార్లు ఓటేయలేదనే విమర్శలొస్తున్నాయి. అందులో భారత పౌరసత్వం లేక ఓటేయని వారున్నారు. అలియా భట్‌ &కత్రినా కైఫ్‌కి బ్రిటిష్ సిటిజన్‌షిప్‌ ఉండగా, ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా & ఇలియానా పోర్చుగీస్ పౌరులుగా ఉన్నారు. ఫెర్నాండేజ్ శ్రీలంక, నోరా ఫతేహీకి కెనడా పౌరసత్వం ఉంది. ఇటీవలే అక్షయ్ కుమార్ భారత పౌరసత్వం తిరిగి పొందడంతో ఆయన ఓటేశారు.

News May 21, 2024

రాష్ట్ర వ్యాప్తంగా 301 సమస్యాత్మక ప్రాంతాలు: డీజీపీ హరీశ్ కుమార్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. గత మూడు రోజులుగా జరిపిన సోదాల్లో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 1104 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 482 లీటర్ల ID లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్- డ్యూటీ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల కోసం నిర్వహించే కార్డన్ సెర్చ్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.

News May 21, 2024

ఆ లోపు కొత్త పాలసీలు సిద్ధం చేయండి: రేవంత్

image

TG: ఎలక్షన్ కోడ్ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. TSIICపై సీఎం సమీక్ష నిర్వహించారు. MSME, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, EV పాలసీలకు సవరణ చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. పలు రంగాలకు సంబంధించి 6 కొత్త పాలసీలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని CM సూచించారు.

News May 21, 2024

ఇరాన్ అధ్యక్షుడి మరణంలో కుట్ర కోణం?

image

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పలు కుట్రకోణాలపై నెట్టింట విస్తృత చర్చ నడుస్తోంది. ఉపగ్రహం నుంచి అత్యాధునిక లేజర్ బీమ్ సహాయంతో హెలికాప్టర్‌ను కూల్చేసి ఉండొచ్చన్నది వాటిలో ఆసక్తికరమైన అంశం. ఇప్పటికే పలు దేశాలకు ఈ ఆయుధం ఉంది. దేశ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ తన తదనంతరం తన కొడుకుని తీసుకొచ్చేందుకు అతడి పోటీదారుగా ఉన్న రైసీని తప్పించి ఉంటారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

News May 21, 2024

ఈనెల 29 నుంచే అనంత్& రాధిక వివాహ వేడుక

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ & రాధిక మర్చంట్‌ల వివాహానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈనెల 29 నుంచి జూన్ 1వరకు జరిగే వివాహ వేడుకలో ప్రపంచంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లో మొబైల్ ఫోన్స్‌ వాడకం నిషేధించినట్లు తెలుస్తోంది. ఇటలీలో వివాహ వేడుక మొదలై స్విట్జర్లాండ్‌లో ముగియనుంది. ప్రీవెడ్డింగ్ వేడుకను రూ.వెయ్యి కోట్లతో అంగరంగ వైభవంగా చేసిన విషయం తెలిసిందే.

News May 21, 2024

SRH ఫస్ట్ బ్యాటింగ్

image

అహ్మదాబాద్‌లో జరుగుతున్న క్వాలిఫయర్1లో SRH టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
KKR: గుర్బాజ్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (C), రింకు, రస్సెల్, రమణదీప్ సింగ్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా.
SRH: హెడ్, అభిషేక్ శర్మ, త్రిపాఠి, నితీశ్, క్లాసెన్, సమద్, షాబాజ్, భువనేశ్వర్, కమిన్స్(C), విజయ్‌కాంత్, నటరాజన్.
>> SRH ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News May 21, 2024

జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు

image

ఇరాన్‌లో జూన్ 28న అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నూతన అధ్యక్షుడి ఎన్నికకు ప్రభుత్వం నిర్ణయించిందని స్థానిక మీడియా తెలిపింది. కాగా ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు దేశంలోని ముగ్గురు అగ్రశ్రేణి అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.