news

News May 21, 2024

FLASH: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

image

AP: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో HYDలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఈయన 1983, 85, 89, 94, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబుతో ఈయనకు మంచి అనుబంధం ఉంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్ల కిందట వైసీపీలో చేరారు.

News May 21, 2024

IAS-IPS విడాకులు.. కట్ చేస్తే.. కరెంట్ కట్

image

తమిళనాడు మాజీ DGP రాజేశ్ దాస్- మాజీ భార్య బీలా ఇంటిపోరు రచ్చకెక్కింది. దాస్ ఉంటున్న బంగ్లా కరెంట్ కనెక్షన్‌ను బీలా తొలగింపజేశారు. విడాకులకు ముందు జాయింట్ లోన్‌తో బంగ్లా కొన్నా, కరెంట్ కనెక్షన్ తన పేరిట ఉందని ఆమె తెలిపారు. అందుకే తొలగింపజేశానన్నారు. కానీ తనను వేధించేందుకు బీలా విద్యుత్ శాఖ సెక్రటరీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని దాస్ వాపోయారు. మరి ఈ ఇంటి కరెంటు పంచాయితీ ఎటు చేరేనో?

News May 21, 2024

VIRAL: రోడ్డు పక్కన దాబాలో అల్లు అర్జున్ భోజనం!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సింప్లిసిటీ చాటుకున్నారు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో భోజనం చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవల నంద్యాల వెళ్లి తిరిగొచ్చే సమయంలో దాబాలో ఫుడ్ టేస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

News May 21, 2024

RAJIV GANDHI DEATH: 1991 మే 21న ఏం జరిగింది?

image

మాజీ PM రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. 1991 మే 21న TNలోని శ్రీపెరంబుదూర్‌లో ఆయనను LTTE సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. వెంటనే చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ బెలూన్‌లా పైకి లేచింది. రెప్పపాటులో రాజీవ్ శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరి పోయింది. ఈ ఘటనలో రాజీవ్ అక్కడికక్కడే మరణించారు.

News May 21, 2024

సీఎం రేసులో ఉత్తమ్.. రూ.100 కోట్లను ఢిల్లీకి పంపారు: మహేశ్వర్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా యూ-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మొన్న రూ.500 కోట్లు చేతులు మారాయని, అందులో రూ.100 కోట్లను ఉత్తమ్ ఢిల్లీకి పంపారని చెప్పారు. సీఎం రేసులో తాను ఉన్నానని చెప్పడానికే ఆయన డబ్బులు తరలించారన్నారు.

News May 21, 2024

వృషణాలు, పిండాల్లో మైక్రోప్లాస్టిక్.. సంతానోత్పత్తిపై ప్రభావం

image

పురుషుడి వృషణాల్లో 12 రకాల మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్లు న్యూ మెక్సికో వర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగుల తయారీలో వాడే పాలీ ఇథిలీన్, పాలీవినైల్ క్లోరైడ్ లాంటివి ఇందులో ఉన్నాయన్నారు. వీటివల్ల సంతానోత్పత్తిపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఒక గ్రాము కణజాలంలో 329.44MG మైక్రోప్లాస్టిక్ ఉందట. గర్భిణుల పిండాల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించినట్లు తెలిపారు.

News May 21, 2024

రాష్ట్రంలోని అన్ని సీట్లనూ క్లీన్‌స్వీప్ చేసిన పార్టీ ఉందా?

image

AP CM జగన్ వైనాట్ 175 అంటూ ప్రచారం హోరెత్తించారు. అయితే అలా ఒక రాష్ట్రంలోని అన్ని సీట్లను ఒకే పార్టీ గెలిచిన సందర్భం ఉందా? అంటే అవుననే చెప్పాలి. సిక్కింలో 2సార్లు ఇలా జరిగింది. 1989లో NB భండారీ నేతృత్వంలోని సిక్కిం సంగ్రామ్ పరిషద్ 32 సీట్లనూ గెలుచుకుంది. అలాగే 2009లోనూ పవన్ చామ్లింగ్ సారథ్యంలోని సిక్కిం డెమొక్రటిక్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇలాంటి సందర్భాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి.

News May 21, 2024

‘కన్నప్ప’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ : మంచు విష్ణు

image

‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను ప్రతిష్ఠాత్మక కేన్స్‌లో ప్రదర్శించినట్లు హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్‌లు, స్థానిక భారతీయులు, ప్రతి ఒక్కరూ ఇష్టపడ్డారు. దీనిని చూసి నేను ఎంతో సంతోషించా. టీజర్ జూన్ 13న రిలీజ్ కానుంది. మే 30న HYDలోని ప్రముఖ థియేటర్లో తెలుగు వెర్షన్ టీజర్ ప్రదర్శిస్తాం. ఎంపిక చేసిన వారికే ఈ అవకాశం’ అని తెలిపారు.

News May 21, 2024

కోచ్‌గా ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యత ధోనీదే!

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను BCCI ధోనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. 2008లో CSK కోచ్‌గా ఫ్లెమింగ్ చేరినప్పటి నుంచి ధోనీకి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. పైగా ఆయన శిక్షణలో CSK 5 IPL టైటిళ్లు సాధించింది. ఈ రీజన్‌తోనే స్టీఫెన్‌ను ఒప్పించే బాధ్యతను BCCI ధోనీపై పెట్టినట్లు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. గంభీర్, పాంటింగ్ కూడా కోచ్ పదవిపై ఆసక్తిగా ఉన్నారట.

News May 21, 2024

అంబేడ్కర్ లేకుంటే నెహ్రూ రిజర్వేషన్లు ఇచ్చేవారు కాదు: మోదీ

image

SC, ST, OBCల రిజర్వేషన్లు లాక్కుని ‘ఓట్ జిహాదీ’లకు అప్పగించేలా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని PM మోదీ ఆరోపించారు. బిహార్‌లోని ఈస్ట్ చంపారన్‌లో మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ లేకపోతే నెహ్రూ SC, STలకు రిజర్వేషన్లు కల్పించేవారు కాదు. INC నేతలకు రామ మందిరం దర్శించే టైమ్ ఉండదు. కానీ నిందితుల ఇళ్లకు వెళ్లి ఫుడ్ వండుకుని తింటారు’ అని ఫైరయ్యారు. లాలూ ఇంటిలో రాహుల్ నాన్ వెజ్ వండిన విషయం తెలిసిందే.