India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3ని ఆపేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ఇది కార్మికుల గొంతు కోయడమేనని, తెలుగు జాతికి పెద్ద ద్రోహమని మండిపడ్డారు. చంద్రబాబు హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టుకుపోయినట్లేనన్నారు. ప్రజా సంపదను అమ్మేస్తుంటే YCP ఊరుకోదని, రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసి ఫ్యాక్టరీని రక్షించే దాకా పోరాటం సాగిస్తుందని ట్వీట్ చేశారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సమయంలో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ PM మోదీని ఆహ్వానించారు. వచ్చే నెల 22-24 తేదీల మధ్య రష్యాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఇటు.. భారత NSA అజిత్ దోవల్ పుతిన్‌తో ఈరోజు భేటీ అయ్యారు. భారత్‌లోని రష్యా ఎంబసీ ఆ ఫొటోలను షేర్ చేసింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ రూపొందించిన శాంతి ప్రణాళికల్ని దోవల్ పుతిన్ వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం.
బిహార్ మాజీ CM, RJD చీఫ్ లాలూప్రసాద్ యాదవ్(76) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. రెండేళ్ల కిందటే లాలూ సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. కూతురే ఆయనకు కిడ్నీని డొనేట్ చేశారు. 2014లోనూ ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన లాలూ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు.
దేశంలో ఆగస్టు-2024లో అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సైట్ల జాబితాను ‘సిమిలర్ వెబ్’ విడుదల చేసింది. తొలి స్థానంలో గూగుల్ ఉండగా రెండో స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఆ తర్వాత ప్లేసుల్లో ఎక్స్ హమ్‌స్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉన్నాయి. ఇక గ్లోబల్ వైడ్‌గానూ 83.5 బిలియన్ విజిట్స్‌తో గూగుల్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, x.com, వాట్సాప్ ఉన్నాయి.
AP: విజయవాడలో తన క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంపై విమర్శలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మంగళగిరిలోని తన నివాసాన్నే క్యాంపు ఆఫీసుగా వాడుకోనున్నారు. పాత ఆఫీసును, అందులోని ఫర్నిచర్‌ను వెనక్కు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో విశాలమైన భవనాన్ని కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ముంబైలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా నివాసం వద్ద నటుడు రాజ్ తరుణ్ ఉన్న సమయంలో లావణ్య అక్కడికి వెళ్లి ఆయన్ను అప్పగించాలంటూ హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్వీకి రాజ్‌తరుణ్ ట్విటర్‌లో సారీ చెప్పారు. ‘ముంబైలో మీ ఇంటివద్ద జరిగినదానికి చాలా సిగ్గుపడుతున్నాను మాల్వీ. సారీ. కానీ మీ ఫ్రెండ్స్‌తో కలిసి వినాయక చవితిని బాగా జరుపుకొన్నాం. గణేశుడి దీవెనలు మీకు ఉండాలి’ అని ట్వీట్ చేశారు.
AP: మాజీ సీఎం YS జగన్ రేపు కాకినాడ జిల్లా పిఠాపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్కపేటలోని వరద బాధితులను పరామర్శిస్తారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్‌లో మండిపడ్డారు. ‘మీరు గూండాయిజం, దౌర్జన్యం చేసినా.. మీ కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు బీఆర్ఎస్ సైన్యం భయపడదు. మీ అవినీతి పాలన నుంచి తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాం. మీరు చేసే ప్రతి బెదిరింపు మా నిర్ణయాన్ని మరింత బలంగా మారుస్తుంది. కౌశిక్ రెడ్డి బలంగా నిలబడండి. ప్రజలు, మేము మీ వెంటే ఉన్నాం’ అని పేర్కొన్నారు.
సీజనల్‌గా లభించేవాటిని తింటే ఆరోగ్యం బాగుంటుందంటారు పెద్దలు. మరి వర్షాకాలంలో ఏ కూరగాయలు మంచివి? న్యూట్రీషనిస్ట్ లవ్నీత్ బాత్రా 3 కూరగాయల పేర్లు చెబుతున్నారు. అవి సొరకాయ, కాకరకాయ, మునగ. ఈ మూడింటిలోనూ పుష్కలంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కండరాల మరమ్మతులు, రోగ నిరోధక వ్యవస్థ మెరుగుదల, చర్మ సౌందర్యం, ఎముకల ఆరోగ్యం విషయాల్లో ఈ మూడూ ఉత్తమమని తెలిపారు.
AP: రాష్ట్రంలో వర్షాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Sorry, no posts matched your criteria.