India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 71 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. మహిళల్లో నటి హేమతో పాటు పలువురు మోడల్స్, టెకీలు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారందరినీ పీఎస్‌కు తరలించిన పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించగా.. మిగతావారి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయనున్నారు.
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ చేసిన పోస్ట్ నెట్టింట ట్రోల్స్ బారిన పడింది. షేవింగ్ చేసుకుంటున్నట్లుగా ఉన్న 2014లోని ఫొటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో మరోసారి షేర్ చేశారు. దీంతో సోనమ్‌కు ఏమైంది ఇలాంటి పోస్ట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె అందానికి రహస్యం ఇదేనా అని కొందరు ట్రోల్ చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో ఐదో విడత పోలింగ్ ముగిసింది. 8 రాష్ట్రాల్లో మొత్తం 49 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో మహారాష్ట్రలోని పలు స్థానాల్లో పోలింగ్ జరగడంతో సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు అధిక సంఖ్యలో ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. కాగా జూన్ 4న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ఐపీఎల్లో వర్షంతో మూడు లీగ్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. మరి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే? దీనికి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సీజన్‌లో Q1, Q2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకూ రిజర్వ్ డే ఉంది. అలాగే మ్యాచ్‌ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. లీగ్ మ్యాచ్‌లకు అయితే ఇది 60 నిమిషాలే. రిజర్వ్ డే రోజూ మ్యాచ్ జరగకపోతే ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ముందుకెళ్తుంది.
కుల రాజకీయాలకు కేరాఫ్‌గా పేరున్న బిహార్‌లో ఓ మహిళా ఓటర్ అభ్యర్థన వైరల్ అవుతోంది. కులాంతర వివాహాలు సర్వసాధారణమైన ఈ రోజుల్లోనూ కులాలను బట్టి ఓట్లేయడమేంటని ఆమె ప్రశ్నించారు. ‘మనం డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ల కులాన్ని పట్టించుకోం. కిరాణం, కూరగాయల మార్కెట్లోనూ కులాలను పట్టించుకోం. లాయర్ అవసరమైనా కులం గురించి ఆరా తీయం. అలాంటి మనం ఎన్నికల విషయంలో కులాన్ని ఎందుకు పట్టించుకోవాలి?’ అని ప్రశ్నించారామె.
తమిళనాడులోని రామనాథపురానికి చెందిన E.సంతోశ్ మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ బైక్ దొంగిలించి నేరుగా అల్వార్‌పేటలోని సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు. అయితే.. సీఎం నివాసం వద్ద అతడిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టిక్కర్ చూసి ఆరా తీయగా బైక్ దొంగిలించినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రాష్ట్ర యువత మద్యం బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరేందుకే తాను CM ఇంటికి వెళ్లానని సంతోశ్ తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌లో బీజేపీ అభ్యర్థికి ఓ యువకుడు 8 సార్లు ఓటేసిన <<13277703>>వీడియో<<>> వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్కార్ అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయంగా మెప్పు పొందారని కొనియాడారు. ఈ మేరకు జనసేన తరఫున ప్రకటన విడుదల చేశారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న యంగ్ టైగర్ మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
చెన్నైతో మ్యాచ్‌లో RCBని గెలిపించిన యశ్ దయాల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే గతేడాదిని గుర్తు చేసుకున్న అతడి తండ్రి చంద్రపాల్ భావోద్వేగానికి గురయ్యారు. ‘వేలంలో RCB యశ్‌ను కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. అతడికి ₹5కోట్లు వృథా అన్నారు. ఆ విమర్శలు మమ్మల్ని బాధపెట్టాయి. ఇప్పుడు యశ్ ప్రదర్శన చూసి చాలా మంది ప్రశంసిస్తున్నారు. అభినందనలు తెలుపుతూ అనేక కాల్స్ వస్తున్నాయి’ అని తెలిపారు.
AP: ఎన్నికల రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందజేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిలాల్లో మొత్తం 33 చోట్ల అల్లర్లు జరిగినట్లు అందులో పేర్కొంది.
1370 మందిపై FIR నమోదు చేయగా.. 124 మందిని అరెస్ట్ చేశామని, 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీ.. కాసేపట్లో సీఈవో, సీఈసీకి పంపనున్నారు.
Sorry, no posts matched your criteria.