India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డైరెక్టర్ శంకర్-సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ శివాజీ మరోసారి థియేటర్లలో అలరించనుంది. ఈ నెల 20న 4K వెర్షన్‌లో మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో టికెట్ ధర రూ.99 మాత్రమే ఉంటుందని తెలిపారు. 2007లో విడుదలైన ఈ చిత్రంలో సుమన్, శ్రియా, వివేక్, రఘువరన్ కీలక పాత్రల్లో నటించారు. 2012లో ఈ మూవీని 3D డాల్బీ అట్మాస్‌లో రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
AP: వరద నష్టం ఎన్యూమరేషన్ ప్రక్రియలో జాప్యం జరగడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం అంచనాలకే ఇంత ఆలస్యమైతే బాధితులకు పరిహారం ఎప్పటికి ఇవ్వగలమని అధికారులను నిలదీశారు. రేపటిలోగా ఎన్యూమరేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. ఇది పూర్తయితేనే కేంద్రానికి వివరాలు పంపగలమనే విషయాన్ని గుర్తుపెట్టుకుని పనిచేయాలని సూచించారు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఏఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన అరెకపూడి గాంధీపై కేసు నమోదు చేయాలంటూ కౌశిక్ సహా బీఆర్ఎస్ నేతలంతా సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే పోలీసులతో కౌశిక్ గొడవకు దిగారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
ఎగ్స్ తినే మహిళల్లో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటోందని న్యూట్రియెంట్స్ జర్నల్లో పబ్లిషైన ఓ రీసెర్చ్ పేర్కొంది. వారంలో 5 లేదా అంతకు ఎక్కువ గుడ్లు తినేవారిలో కాగ్నిటివ్ డిక్లైన్ అర పాయింట్ తగ్గినట్టు తెలిపింది. వృద్ధ మహిళల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సైంటిస్టులు అంటున్నారు. గుడ్డులోని ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, జియాక్సంథైన్, లూటిన్ వంటి కెరోటిన్స్ బ్రెయిన్ హెల్త్‌కు మేలు చేస్తాయన్నారు.
‘స్త్రీ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కొనసాగిస్తోంది. గత నెల 15న విడుదలై, నేటికీ స్టార్ హీరోల సినిమాలతో సమానంగా రన్ అవుతోంది. నిన్న రూ.3.04 కోట్లు కలెక్ట్ చేయడంతో ఆ సినిమా భారత్‌లో వసూలు చేసిన మొత్తం రూ.561.28 కోట్లకు చేరింది. ఈ వీకెండ్‌కి ఈ అంకె మరింత పెరగొచ్చని అంచనా. స్త్రీ మూవీకి సీక్వెల్‌గా శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో ‘స్త్రీ 2’ తెరకెక్కింది.
AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3ని ఆపేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ఇది కార్మికుల గొంతు కోయడమేనని, తెలుగు జాతికి పెద్ద ద్రోహమని మండిపడ్డారు. చంద్రబాబు హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టుకుపోయినట్లేనన్నారు. ప్రజా సంపదను అమ్మేస్తుంటే YCP ఊరుకోదని, రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసి ఫ్యాక్టరీని రక్షించే దాకా పోరాటం సాగిస్తుందని ట్వీట్ చేశారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సమయంలో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ PM మోదీని ఆహ్వానించారు. వచ్చే నెల 22-24 తేదీల మధ్య రష్యాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఇటు.. భారత NSA అజిత్ దోవల్ పుతిన్‌తో ఈరోజు భేటీ అయ్యారు. భారత్‌లోని రష్యా ఎంబసీ ఆ ఫొటోలను షేర్ చేసింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ రూపొందించిన శాంతి ప్రణాళికల్ని దోవల్ పుతిన్ వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం.
బిహార్ మాజీ CM, RJD చీఫ్ లాలూప్రసాద్ యాదవ్(76) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. రెండేళ్ల కిందటే లాలూ సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. కూతురే ఆయనకు కిడ్నీని డొనేట్ చేశారు. 2014లోనూ ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన లాలూ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు.
దేశంలో ఆగస్టు-2024లో అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సైట్ల జాబితాను ‘సిమిలర్ వెబ్’ విడుదల చేసింది. తొలి స్థానంలో గూగుల్ ఉండగా రెండో స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఆ తర్వాత ప్లేసుల్లో ఎక్స్ హమ్‌స్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉన్నాయి. ఇక గ్లోబల్ వైడ్‌గానూ 83.5 బిలియన్ విజిట్స్‌తో గూగుల్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, x.com, వాట్సాప్ ఉన్నాయి.
AP: విజయవాడలో తన క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంపై విమర్శలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మంగళగిరిలోని తన నివాసాన్నే క్యాంపు ఆఫీసుగా వాడుకోనున్నారు. పాత ఆఫీసును, అందులోని ఫర్నిచర్‌ను వెనక్కు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో విశాలమైన భవనాన్ని కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.