news

News May 20, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 86,721 మంది భక్తులు దర్శించుకోగా.. 39,559 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News May 20, 2024

బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్

image

టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ‘RX100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆరోపించారు. ‘2019లో రక్షణ అనే సినిమాలో నటించా. నా రీసెంట్ సక్సెస్ చూసి ఇప్పుడు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రాకపోతే బ్యాన్ చేస్తామంటున్నారు. ఈ మూవీలో నా పేరు, పాత్ర ఉంటే చట్టపరచర్యలు తప్పవు’అని Xలో ఆమె పోస్ట్ చేశారు.

News May 20, 2024

నేడు ఈసెట్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ ఈసెట్ ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే.

News May 20, 2024

2027 నాటికి AIపై వ్యయం రూ.41,500 కోట్లు!

image

ఇండియాలో AIపై ఖర్చు పెట్టే మొత్తం మూడేళ్లలో 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. 2023లో ₹14,000 కోట్లు వెచ్చించగా, 2027నాటికి ఈ ఖర్చు ₹41,500 కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు, కస్టమర్ సర్వీస్, డిజిటల్ అసిస్టెన్స్‌పై ప్రధానంగా వ్యయం చేస్తున్నారని పేర్కొంది. అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద AI మార్కెట్‌గా మనదేశం ఉందని, 20% డేటా ఉత్పత్తి అవుతోందని తెలిపింది.

News May 20, 2024

NDAలో 404 ఉద్యోగాలు

image

నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీలో 404 ఉద్యోగాల భర్తీకి UPSC రెండో విడత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. NDAలో 370(ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120), NAలో 34 పోస్టులున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులై, 2-1-2006- 1-1-2009 మధ్య జన్మించిన వారు అర్హులు. జూన్ 4 చివరి తేదీ. రాతపరీక్ష సెప్టెంబర్‌లో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలున్నాయి.
వెబ్‌సైట్: <>upsconline.nic.in<<>>

News May 20, 2024

ఈక్విటీ మార్కెట్లో రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు

image

ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఈ ఏడాది మే 16 నాటికి మ్యూచువల్ ఫండ్లు ఈక్విటీల్లోకి రూ.1.3 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేశాయి. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకునే మదుపర్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.25వేల కోట్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. మరోవైపు NSE నమోదిత కంపెనీల్లో MFల వాటా జీవితకాల గరిష్ఠం 8.92 శాతానికి చేరింది.

News May 20, 2024

రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సై.. సస్పెన్షన్

image

AP: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన SI తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజాబాబుకు ప్రకాశం(D) కురిచేడులో ఓటు ఉంది. SIతో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. SIకి ఆన్‌లైన్‌లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో SIకి నగదు పంపినట్లు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

News May 20, 2024

ముగ్గురు ఐపీఎస్‌లపై క్రమశిక్షణ చర్యలు

image

AP: ఎన్నికల హింసకు బాధ్యుల్ని చేస్తూ EC సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు SPలు అమిత్, బిందు మాధవ్, బదిలీ వేటు గురైన తిరుపతి SP కృష్ణకాంత్‌పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశించింది. లేదంటే తమవద్ద ఉన్న ఆధారాలను బట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు CS జవహర్ ఉత్తర్వులిచ్చారు.

News May 20, 2024

నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. పొడిగింపు ఉంటుందా?

image

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఆమెకు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ జరగనుంది.

News May 20, 2024

సీఎం ఆదేశించినా అమలు కావడం లేదు

image

TG:తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలవ్వడంలేదు. తడిసిన ధాన్యం కొనేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండగా.. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి, మొలకలు వస్తున్నా.. అధికారుల్లో చలనం లేదు. మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. CM ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.