India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL-2024లో MI ఓడిన తీరు స్టోరీ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తుందని కామెంటేటర్ హర్షా భోగ్లే అన్నారు. ‘చాలా మంది ముంబై ప్లే ఆఫ్స్‌కి వెళ్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీనిని మనం టీమ్‌ఇండియా కోణంలో చూస్తే కోచ్ ద్రవిడ్ వెంటనే చేయాల్సిన పని ఒకటి ఉంది. జట్టులో కీలక ప్లేయర్లయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య సఖ్యత తీసుకురావాలి. ముఖ్యంగా వారిని త్వరగా ఫామ్ అందుకునేలా చేయాలి’ అని ట్వీట్ చేశారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది. 425 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 3.17 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి 45 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 12 మంది పోటీ చేస్తున్నారు. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే న్యూక్లియర్ బాంబ్ తయారీకి వెనుకాడబోమని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ఇరాన్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది.
TG: సీఎం రేవంత్ ఇండియా అని రాసి ఉన్న టీషర్ట్ వేసుకుని ఫుట్‌బాల్ ఆడటంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ప్రశ్నించారు. ‘ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కు కనీసం రేవంత్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కాదు. అలాంటప్పుడు ఇండియా అనే పేరున్న టీషర్ట్ ఎందుకు వేసుకున్నారు. ప్రచార గడువు ముగిసిన ఈ సమయంలో విపక్ష కూటమి INDIAకు ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.
వరుసగా 4 విజయాలతో జోరు మీదున్న RCB ఇవాళ బెంగళూరు వేదికగా DCని ఢీకొంటోంది. మ్యాచ్ రద్దయినా లేదా ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవుతాయి. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉండటం ఆ జట్టుకు ప్రతికూలాంశంగా మారింది. మ్యాచ్ రద్దయితే ఢిల్లీకి ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు మిగిలే ఉంటాయి. ఏదేమైనా పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో ఉండే అవకాశాల్ని మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచులో గెలవడం ఇరుజట్లకూ కీలకం కానుంది.
ఎన్నికల కదనరంగంలో కరెన్సీ కట్టలు కాలుదువ్వుతున్నాయి. సంచుల కొద్దీ డబ్బు పట్టుబడుతుండగా.. నియోజకవర్గాల్లో యథేచ్ఛగా డబ్బు పంపిణీ సాగుతోంది. చాలా ప్రాంతాల్లో అభ్యర్థులు డబ్బుని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. మద్యం, ఓటర్లకు డబ్బు, ప్రచార ఖర్చులు వెరసి.. ఒక్కో సెగ్మెంట్‌కి రూ.70 కోట్ల- రూ.100 కోట్ల వరకు అవుతోందట. AP ఎన్నికలకు పెడుతున్న ఖర్చు దేశ చరిత్రలోనే ఎక్కడా లేదనే వాదన వినిపిస్తోంది.
మదర్స్ డే అనగానే సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెడుతుంటారు. మీ కోసం, కుటుంబం కోసం ఎంతో చేసే తల్లులను ఒక్కరోజు మాత్రమే తలుచుకుంటే సరిపోదు. దూరంగా ఉంటే తిన్నావా అని, బయటికెళ్తుంటే జాగ్రత్త అని అమ్మ చెప్తే కొందరు విసిగించుకుంటారు. అందులోనూ ప్రేమే ఉందని అర్థం చేసుకోవాలి. ఆమె లేకపోతే ఈ జన్మ లేదని గుర్తించాలి. అందుకే దగ్గరుంటే నేరుగా, దూరంగా ఉంటే ఫోన్‌లో అమ్మతో రోజూ కాసేపు ప్రేమగా మాట్లాడండి.
హీరో రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. అలాగే మే 15న టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
IOS యూజర్లకు వాట్సాప్ ‘స్క్రీన్ షాట్ బ్లాకింగ్-ప్రొఫైల్ ఫొటో’ పేరిట కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని వల్ల యూజర్ల ప్రొఫైల్ ఫొటోలను ఇతరులు స్క్రీన్ షాట్ తీసేందుకు వీలుండదు. దీంతో వారి పిక్చర్స్ మిస్ యూజ్ కాకుండా ఉంటాయి. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత ఏర్పడుతుందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.
Sorry, no posts matched your criteria.