India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇటు టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,942 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమాకు అరుదైన ఘనత లభించింది. లాస్ ఏంజెల్స్‌లోని బియాండ్ ఫెస్ట్‌లో ఈ మూవీ ప్రదర్శించనున్నారు. ఈనెల 26న సాయంత్రం 6.30 గంటలకు ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్‌లో షో వేయనున్నారు. ఈ విషయాన్ని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రీమియర్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు తెలిపాయి. హాలీవుడ్ సెలబ్రిటీలూ ‘దేవర’ చూడనున్నట్లు సమాచారం.
<<14090235>>బెయిల్‌పై<<>> బయటకొస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు పెట్టిన కండీషన్లే ఇక్కడా వర్తిస్తాయని చెప్పడమే ఇందుకు కారణం. దీంతో ఆయన సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌కు వెళ్లలేరు. ఈ కండీషన్లపై అభ్యంతరం ఉన్నా జుడీషియల్ డిసిప్లిన్, ట్రయల్ కోర్టు తీర్పును గౌరవిస్తూ వాటిపై వ్యతిరేక ఆదేశాలు ఇవ్వడం లేదని జస్టిస్ భూయాన్ అన్నారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో పార్టీ నూతన సారథిపై చర్చ నడుస్తోంది. 1964లో పార్టీ ఏర్పాటైన తర్వాత పదవిలో ఉండగా ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే తొలిసారి. కాగా త్వరలోనే పార్టీ అగ్రనేతలు సమావేశమై తదుపరి కార్యదర్శి ఎంపికపై చర్చిస్తారని తెలుస్తోంది. బెంగాల్ CPM కార్యదర్శి మహమ్మద్ సలీం, కేరళ CPM కార్యదర్శి ఎంవీ గోవింద్, త్రిపుర మాజీ CM మాణిక్ సర్కార్ పేర్లు రేసులో ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో సీబీఐ నమోదు చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సమీప భవిష్యత్తులో ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను అంగీకరించలేదు. కేజ్రీవాల్ బెయిల్‌కు అర్హుడని పేర్కొంది. కేసుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని <<14090397>>షరతులే<<>> ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది.
కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న <<14089394>>ఘటనపై <<>> ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం. ఈలోగా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరాం. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండండి’ అని భరోసా ఇచ్చారు.
నోయిడాలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా 5 రోజుల్లో ఒక్క రోజూ ఆట సాగలేదు. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయిన మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది. ఇలా జరగడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి అని క్రీడా వర్గాలు తెలిపాయి. చివరిగా 1998లో న్యూజిలాండ్, భారత్ మ్యాచ్ ఒక్క బాల్ పడకుండానే రద్దయింది.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తే సహించేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎలాంటి ఆందోళనలకు అవకాశం లేదని, గొడవలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతలపై రాజీపడొద్దని సీపీలకు సూచించారు.
TG: రెచ్చగొట్టడం వల్లే కౌశిక్‌రెడ్డి వంటి చిల్లర వ్యక్తితో తాను గొడవకు దిగాల్సి వచ్చిందని శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ చెప్పారు. ‘కౌశిక్ ఎంతో మందిని మోసం చేసిన చీటర్. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణ పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలను అతడు రెచ్చగొట్టడంపై BRS నాయకత్వం ఏం సమాధానం ఇస్తుంది? మాజీ సీఎం KCR దీనిపై స్పందించాలి’ అని డిమాండ్ చేశారు.
TG:సిరిసిల్ల(D) తంగళ్లపల్లి గురుకుల స్కూలు విద్యార్థినుల కష్టాలు కలచివేస్తున్నాయి. 5ఏళ్లుగా అక్కడే తిష్ట వేసిన PET జోత్స్న మానసికంగా, శారీరకంగా తమను వేధిస్తోందని, నెలసరిలోనూ ప్రేయర్‌కు రావాలంటోందని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రార్థన టైంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారంటూ బాత్‌రూం తలుపులు పగులగొట్టి ఫోన్‌లో వీడియో తీసి కర్రతో కొట్టడం భరించలేక రోడ్డెక్కారు. విషయం తెలిసి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.