news

News May 6, 2024

నాకు అమితాబ్ అంత క్రేజ్ ఉంది: కంగనా

image

బాలీవుడ్ నటి, BJP ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ తన క్రేజ్‌ను సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పోల్చుకున్నారు. ‘కంగనా రాజస్థాన్, మణిపుర్, బెంగాల్, ఢిల్లీ.. ఇలా ఎటు వెళ్లినా ఆదరణ లభిస్తుండటం చూసి దేశమే ఆశ్చర్యపోతోంది. ఈ ప్రేమ చూస్తుంటే అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ స్థాయి దక్కించుకున్న నటిని నేనే అని ధీమాగా చెప్పగలను’ అని పేర్కొన్నారు. కాగా ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

News May 6, 2024

సచిన్ ఇంటి నిర్మాణంతో పెద్ద శబ్దాలు: పక్కింటి వ్యక్తి

image

ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ పక్కింటి వ్యక్తి ట్వీట్ చేశారు. ‘ఇంటి నిర్మాణ పనులతో వచ్చే శబ్దాలు ఇబ్బందిగా ఉన్నాయి. రాత్రి 9 అయినా ఆగడం లేదు. సమయాన్ని ఫాలో అవ్వమని కార్మికులకు చెప్పండి’ అంటూ దిలీప్ అనే వ్యక్తి పోస్ట్ చేసి సచిన్‌కు ట్యాగ్ చేశారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సచిన్ ఇంట్లో ‘ఈడీ రైడ్స్ అవుతున్నాయేమో’ అంటూ ఒకరు కామెంట్ చేశారు.

News May 6, 2024

రేపు ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల

image

AP EAPCET హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఈనెల 16, 17 తేదీల్లో జరగనుండగా, ఇంజినీరింగ్ పరీక్షలు ఈనెల 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/

News May 6, 2024

10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్!

image

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతోంది ‘కుబేర’. ప్రస్తుతం ముంబైలోని అతి పెద్ద డంపింగ్‌ యార్డ్‌లో షూట్ చేస్తున్నారు. సన్నివేశాలు సహజంగా వచ్చేందుకు గాను హీరో ధనుష్ మాస్క్ ధరించకుండా ఏకధాటిగా 10 గంటల పాటు దుర్గంధాన్ని భరిస్తూ షూట్‌లో పాల్గొన్నారట. దీంతో ధనుష్‌ నిబద్ధత పట్ల ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కుబేర’లో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

News May 6, 2024

మరికొద్ది రోజుల్లో కొడుకు పుట్టినరోజు.. ఇంతలోనే..

image

జమ్మూకశ్మీర్ పూంఛ్‌లో IAF వాహనంపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో కార్పొరల్ విక్కీ పహాడే (33) మృతిచెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ‘జూన్ 7న తన ఐదేళ్ల కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు విక్కీ ప్లాన్ చేస్తున్నారు. ఇంతలోనే ఈ విషాదం జరిగింది. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది’ అని కుటుంబసభ్యులు వాపోయారు. కాగా చివరగా రెండు వారాల క్రితం విక్కీ తన సోదరి పెళ్లికి హాజరయ్యారు.

News May 6, 2024

ICSE 10th, ISC 12th ఫలితాలు విడుదల

image

ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి <>ఫలితాలు<<>> విడుదలయ్యాయి. ఐసీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో 2,695 స్కూళ్లకు 2,223 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 99.65%, బాలురు 99.31% ఉత్తీర్ణత సాధించారు. ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాల్లో 1,366 స్కూళ్లకు గాను 904 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. బాలికలు 98.92%, బాలురు 97.53% ఉత్తీర్ణత సాధించారు.

News May 6, 2024

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించగా.. ఆ రెండు పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్ కింద తిహార్ జైలులో ఉన్నారు.

News May 6, 2024

పవన్ నా కుటుంబాన్ని రోడ్డుకు లాగాడు: ముద్రగడ

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్‌ తన కుటుంబాన్ని రోడ్డుకు లాగాడని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ‘నేను చిరంజీవి, పవన్‌ గురించి ఏరోజూ మాట్లాడలేదు. నా కుటుంబంలో పవన్ చిచ్చు పెట్టాడు. నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీ కుటుంబంలో డ్రగ్స్‌తో పట్టుబడిన అమ్మాయిని, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, మీరు వదిలేసిన ఇద్దరు భార్యల్ని ఎందుకు పరిచయం చేయట్లేదు? నాపై ప్రేమ నటించొద్దు’ అని పేర్కొన్నారు.

News May 6, 2024

భారత్‌లో అవకాశాలు అపారం: వారెన్ బఫెట్

image

భారత మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి అపార అవకాశాలున్నాయని అమెరికా వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ పేర్కొన్నారు. తమ సంస్థ బెర్క్‌షైర్ హాత్‌వే త్వరలోనే ఆ అవకాశాలను దక్కించుకోనుందని తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. సంస్థ వార్షిక సమావేశంలో బఫెట్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇక యాపిల్‌లో తమ వాటాలను తగ్గించుకోవడం వెనుక ఎటువంటి దీర్ఘకాలిక వ్యూహం లేదని స్పష్టం చేశారు.

News May 6, 2024

LT యాక్ట్‌కి మాజీ ఐఏఎస్ బలయ్యారు: టీడీపీ

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు <<13191140>>తాను<<>> ప్రత్యక్ష బాధితుడినని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ చేసిన ట్వీట్‌పై టీడీపీ స్పందించింది. ‘36 ఏళ్ల పాటు ఐఏఎస్‌గా సేవలందించిన ఉన్నతాధికారి కూడా జగన్ తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌కి బలయ్యారు. ఇక ఈ భూ దొంగల ముఠా చేతిలో సామాన్యుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, మన ఊహకి కూడా అందదు. చివరకు మీరు కష్టపడి సంపాదించిన మీ సొంత ఇల్లు కూడా మీది కాదు’ అని ట్వీట్ చేసింది.