India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘ప్రేమలు’తో తెలుగు యువతకు క్రష్‌గా మారారు మమితా బైజు. ఆమె అసలు పేరు మమిత కాదట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్నతనంలో తనకు నమిత అని పేరు పెట్టగా.. బర్త్ సర్టిఫికెట్‌లో పొరపాటున మమితగా రాశారట. తర్వాత పాఠశాలలో అదే కొనసాగి మమిత అన్న పేరే స్థిరపడిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం పలు తెలుగు సినిమాల్లో ఛాన్సులు వస్తున్నట్లు తెలిపారు. ‘ప్రేమలు’ ఆమెకు 16వ సినిమా కావడం గమనార్హం.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే తమ రెండేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారి క్లోజ్ ఫ్రెండ్ ధ్రువీకరించారు. ‘వారిద్దరూ నెల కిందటే విడిపోయారు. ఇది మాకు షాక్ కలిగించింది. వారు జీవితంలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ జంట చివరగా అనంత్-రాధికా ప్రీవెడ్డింగ్ వేడుకకు హాజరైంది. లైగర్ మూవీతో అనన్య టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
నేపాల్‌లో జరుగుతున్న ‘జువైనల్ జస్టిస్’ సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఉపాధ్యాయుల ప్రవర్తన పిల్లల మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది. అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మా టీచర్ బెత్తంతో కొట్టడంతో నా చేయి కందిపోయింది. కొద్దిరోజులకు గాయ తగ్గినా ఆ సంఘటన ఇప్పటికీ ఏదైనా పని చేస్తున్నప్పుడు గుర్తుకు వస్తుంది’ అని CJI చెప్పారు.
బొడ్డుతాడు కూడా ఊడని పసిగుడ్డును బతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు. హనుమకొండ జిల్లా ఊరుగొండ వద్ద హైవే పక్కన ఈ దారుణం జరిగింది. అక్కడికి నీటి కోసం వచ్చిన ట్యాంకర్ డ్రైవర్, మట్టిలో బిడ్డ కాళ్లు కదలడం చూశారు. వెంటనే సమీపంలో ఉన్న కూలీలతో కలిసి ఆడశిశువును వెలికితీసి పోలీసులకు సమాచారం అందించారు. బిడ్డను ఆస్పత్రికి తరలించామని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
అనంతపురం(D) ఉరవకొండలో చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడుతున్నారు. పయ్యావుల కేశవ్(TDP), విశ్వేశ్వర్ రెడ్డి(YCP) ఐదోసారి పోటీ పడుతున్నారు. ఇక్కడ TDP 6 సార్లు, కాంగ్రెస్ 4, స్వతంత్రులు 2, YCP ఒకసారి గెలిచాయి. కాగా గత 3ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు 1 లేదా 2శాతం ఓట్ షేర్ తేడాతోనే ఒడ్డెక్కారు. మరి ఈసారి ఇక్కడి ప్రజలు ఏకపక్ష తీర్పునిస్తారా? ఉత్కంఠ పోరుకు తెర తీస్తారా? అనేది చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: ఎండలకు తాళలేకపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, కొత్తగూడెం.. ఎల్లుండి భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, RR, MBNR, వనపర్తి, నారాయణపేట, జోగులాంబలో వానలు పడతాయని పేర్కొంది.
AP: మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు విమర్శలు చేశారంటూ జనసేన, టీడీపీ <<13185016>>విడుదల<<>> చేసిన వీడియోపై వైసీపీ మండిపడింది. ‘గౌతం అరాచకాలు భరించలేక పిల్లలతో కలిసి అంబటి కూతురు దూరంగా ఉంటున్నారు. ఆ వ్యక్తిగత విభేదాన్ని కూడా జనసేన నీచ రాజకీయం చేస్తోంది. మొన్న ముద్రగడ కూతురితో వీడియో, ఈరోజు అంబటి అల్లుడితో వీడియో చేయించింది. ఏ స్థాయికి దిగజారిపోయావ్ పవన్ కళ్యాణ్?’ అంటూ ఫైరయ్యింది.
180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్టు విడుదల చేసింది. టాప్-10లో నార్వే, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్, ఎస్టోనియా, పోర్చుగల్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ ఉన్నాయి. చివరి 10 స్థానాల్లో సిరియా, అఫ్గాన్, నార్త్ కొరియా, ఇరాన్, తుర్క్‌మెనిస్థాన్, వియత్నాం, బహ్రెయిన్, చైనా, మయన్మార్ ఉన్నాయి. గత ఏడాది భారత్ 161వ ర్యాంక్‌లో ఉండగా, ఈసారి 159కి చేరింది.
కర్నూలు(D) ఎమ్మిగనూరు ఆసక్తికర రాజకీయాలకు వేదిక. ఇద్దరు నేతల మధ్యే దశాబ్దాలుగా పోరు నడిచింది. 1985 నుంచి వరుసగా 4 సార్లు TDP అభ్యర్థి బి.వి మోహన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి రెండేసి సార్లు కాంగ్రెస్, YCP తరఫున నెగ్గారు. ఈసారి సిట్టింగ్ MLA చెన్నకేశవరెడ్డిని కాదని మాజీ MP బుట్టా రేణుకను YCP బరిలోకి దింపింది. టీడీపీ నుంచి మాజీ MLA బీవీ జయనాగేశ్వరరెడ్డి నిలిచారు. <<-se>>#ELECTIONS2024<<>>
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్(42) మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారి(30) నుంచి ఆమె 8 నెలల కిందటే విడిపోగా, తాజాగా లాస్‌ఏంజెలిస్ కోర్టు డివోర్స్ మంజూరు చేసింది. కాగా బ్రిట్నీ 2004లో చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్‌ను పెళ్లాడి ఏడాదికే విడిపోయారు. తర్వాత కెవిన్ ఫెడెర్‌లైన్‌ను వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.