India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మాయమాటలతో 2014లో ప్రజలను మోసం చేసిన కూటమి.. ఇప్పుడు మళ్లీ వస్తోందని సీఎం జగన్ విమర్శించారు. పెదకూరపాడు సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన ప్రభుత్వం మాది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణం, అమ్మ ఒడి, రైతు భరోసా, వాహన మిత్ర, చేదోడు లాంటి ఎన్నో పథకాలను అమలు చేశాం’ అని చెప్పారు.
TG: పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేసే అలవాటు తనకు లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తప్పకుండా రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానన్నారు. తెలంగాణ రావడానికి కేసీఆరే కారణమని, ఆయనకు రేవంత్ రుణపడి ఉండాలని పేర్కొన్నారు.
TG: ఢిల్లీ లిక్కర్ కేసు విచారణకు తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపర్చాలని ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో తనను హాజరుపర్చవద్దని కోరారు. ఆమె దరఖాస్తుపై సమాధానం చెప్పాలని ఈడీ, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవిత జుడీషియల్ కస్టడీ ఈనెల 7వ తేదీతో ముగియనుంది.
బజాజ్ కంపెనీ సరికొత్త పల్సర్ బైక్‌తో ముందుకొచ్చింది. 400cc ఇంజిన్, 40Hp పవర్‌తో NS400Z అనే కొత్త బైకును మార్కెట్లోకి లాంచ్ చేసింది. 6 గేర్ బాక్స్, డ్యూయల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, LED హెడ్ ల్యాంప్, బ్లూటూత్, టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ స్పీడ్ 154km/h అని బజాజ్ పేర్కొంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.1.85 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది.
ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 20 తర్వాత వెల్లడిస్తామని CBSE వెల్లడించింది. రిజల్ట్స్‌పై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. కాగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు టెన్త్, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
ఈ ఏడాది తొలి 3 నెలల్లో భారత్‌లో 2.2 కోట్ల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గత ఏడాది ఇదే కాలానితో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. వాట్సాప్ నెలవారీ నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత చట్టాలను అతిక్రమించిన ఖాతాలు, గ్రీవెన్స్ కమిటీ సూచించినవి, వినియోగదారులు ఫిర్యాదు చేసినవి వీటిలో ఉన్నాయని తెలిపింది. తమ మార్గదర్శకాలకు, దేశ చట్టాలకు లోబడి ఉండని ఖాతాలను ఇలాగే తొలగిస్తామని స్పష్టం చేసింది.
అమేథీలో పోటీ చేసి గెలిచే ధైర్యం లేకనే గాంధీల కుటుంబం అక్కడ బరిలో దిగలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ‘ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరఫున గాంధీ కుటుంబం నుంచి ఒక్కరూ ముందుకు రాలేదు. అంటే ఎన్నికలు జరగకముందే వారు తమ ఓటమిని అంగీకరించారు’ అని స్పష్టం చేశారు. చివరిగా రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథీ సీటును కాంగ్రెస్ ఈరోజు కేఎల్ శర్మకు కేటాయించిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో మే 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది, తెలంగాణలోని 17 స్థానాలకు 525 మంది బరిలో ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.
బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే, నిర్మాత కేఎల్ నారాయణకు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం ఆయన నిలబడ్డారట. ఈ విషయాన్ని నిర్మాత తాజాగా వెల్లడించారు. ‘నేను అడక్కపోయినా వాళ్లే నా బ్యానర్‌లో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందుకు నేను కృతజ్ఞుడిని. బడ్జెట్ ఇంత అనేమీ అనుకోలేదు కానీ ఎంతైనా ఖర్చు పెడతా’ అని తెలిపారు.
క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తన బర్త్ డేను ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నెల 1న ఆమె పుట్టిన రోజు కాగా తాజాగా సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కోహ్లీతో పాటు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క ఫొటోకు పోజులివ్వడం ఇదే తొలిసారి.
Sorry, no posts matched your criteria.