India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్ర నూతన DGPగా RTC MD ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమలరావు సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అంజనా సిన్హా, సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ సైతం డీజీపీ రేస్‌లో ఉన్నారు. ఈ ముగ్గురూ కాకుంటే హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఐపీఎల్‌లో ఇవాళ ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు జరగనుంది. ఈ సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ ప్రస్తుతం 300 స్కోరుపై కన్నేసింది. హెడ్, అభిషేక్, క్లాసెన్, నితీశ్ భీకర ఫామ్‌లో ఉండటం SRHకు కలిసొచ్చే అంశం. మరోవైపు వరుస ఓటములతో ముంబై డీలా పడింది. 11 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈజిప్టులోని కైరోలో ఈ కీలక చర్చలు జరిగాయి. చర్చల అనంతరం హమాస్ నేతలు నేరుగా ఖతార్ వెళ్లిపోయారు. మరోవైపు గాజా నుంచి ఐడీఎఫ్ బలగాల ఉపసంహరణ, యుద్ధం ముగింపు వంటి హమాస్ డిమాండ్లను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఈ నెల 7న మరోసారి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. చర్చలు విఫలం కావడంతో గాజాలోని రఫాపై భారీ దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ఎల్లుండి పీలేరులో జరిగే బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్ షోలో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కానీ ఏ జట్టూ ఇంకా అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోలేదు. ప్రస్తుతం కొన్ని జట్లకే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్రిక్ ట్రాకర్ వెబ్‌సైట్ ప్రకారం రాజస్థాన్‌కు 99%, కోల్‌కతాకు 99%, హైదరాబాద్‌కు 60%, చెన్నైకి 51%, లక్నోకు 45%, ఢిల్లీకి 19%, పంజాబ్‌కు 15%, బెంగళూరుకు 10%, గుజరాత్‌కు 1.9%, ముంబైకి 0.1% అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AP: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ కళ్యాణ్ తరఫున సాయిధరమ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి సాయిధరమ్ తేజ్ వాహనంపైకి రాయి విసిరాడు. ఆ రాయి జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్‌కు తగిలి తీవ్ర గాయమైంది. YCP MLA అభ్యర్థి వంగా గీత ఈ దాడి చేయించిందని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన భార్య మూగవాడైన 6ఏళ్ల కొడుకును మొసళ్లు ఉండే నదిలో విసిరేసింది. రవికుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పుట్టు మూగ. ఎందుకు అలా జన్మనిచ్చావంటూ భార్యతో భర్త మూర్ఖంగా గొడవపడేవాడు. ఇటీవల మరోసారి ఇలా గొడవ జరగగా, ఆమె కొడుకును నదిలో విసిరేసింది. దీంతో పిల్లాడు మరణించాడు. పోలీసులు భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేశారు.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా భారీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (12), హైదరాబాద్ (12), లక్నో (12), ఢిల్లీ (10), బెంగళూరు (8), పంజాబ్ (8), గుజరాత్ (8), ముంబై (6) ఉన్నాయి.
AP: కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని.. మెజార్టీ కోసమే అందరూ కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. YCP అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఏడాదికి 4లక్షల చొప్పున ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలు స్థాపిస్తామని పేర్కొన్నారు.
1861: స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం
1932: సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం
1953: బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ జననం
1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించారు
2006: రచయిత, నిర్మాత తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి మరణం
2021: మ్యూజిక్ డైరెక్టర్ జీ ఆనంద్ మరణం
Sorry, no posts matched your criteria.