news

News May 8, 2024

మేం మాత్రం యాదాద్రిని కట్టలేదా..?: కేటీఆర్

image

అయోధ్య ఆలయాన్ని ప్రధాని మోదీ రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘మాట్లాడితే అయోధ్య రామాలయం కట్టామంటూ మోదీ ప్రస్తావిస్తుంటారు. కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించలేదా? కానీ ఆ విషయాన్ని మేం రాజకీయంగా వాడుకోలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే లీటరు పెట్రోల్ రూ.400 దాటేయడం ఖాయం’ అని మండిపడ్డారు.

News May 8, 2024

IFS తుది ఫలితాలు విడుదల

image

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ తుది ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 147 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. గత ఏడాది నవంబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించగా.. ఇటీవల వ్యక్తిగత ఇంటర్వ్యూలు ముగిశాయి. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News May 8, 2024

మాజీ ఎమ్మెల్యే కూతురిపై ఐదేళ్లుగా అత్యాచారం

image

మాజీ MLA కూతురిపై ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన UPలో వెలుగు చూసింది. మొరాదాబాద్(D)కు చెందిన బాధితురాలి తండ్రి గతంలో 2సార్లు MLAగా ఉన్నారు. అతని పార్టీకే చెందిన నిందితుడు ఆసిఫ్ బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె అశ్లీల ఫొటోలు తీసి.. వాటితో ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. రూ.6కోట్ల వరకు వసూలు చేశాడు. ఇటీవల డబ్బు కోసం యాసిడ్ దాడికి పాల్పడటంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది.

News May 8, 2024

ఆ నిర్ణయంతోనే ఓడిపోయాం: సంగక్కర

image

RR కెప్టెన్ సంజూ <<13203845>>శాంసన్<<>> ఔటైన తీరుపై ఆ ఫ్రాంచైజీ డైరెక్టర్ సంగక్కర స్పందించారు. సంజూ వికెట్ కోల్పోవడం తమ జట్టు ఓడిపోవడానికి కారణమని చెప్పారు. మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు అంపైర్ నిర్ణయం నిరాశకు గురిచేసిందన్నారు. ఆ వికెట్ చేజారకుంటే మ్యాచ్ తప్పకుండా గెలిచేవాళ్లమన్నారు. మరోవైపు ఢిల్లీ ప్లేయర్లు అద్భుతంగా ఆడారని తెలిపారు. నాణ్యమైన బౌలింగ్‌తో చివరి వరకూ పోరాడి విజయం సాధించారని పేర్కొన్నారు.

News May 8, 2024

ఎయిర్ ఇండియాను మూసేయాలి: ఆజాద్

image

ఎయిర్ ఇండియా సేవలపై డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులామ్ నబీ ఆజాద్ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సిన ఆయన ఎయిర్ ఇండియా ఫ్లైటు రద్దు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘3-4 గంటల నిరీక్షణ తర్వాత నేను ఇండిగో విమానంలో బయలుదేరాల్సి వచ్చింది. ఒకవేళ విమానం క్యాన్సిల్ అయితే ముందుగా సమాచారం ఇవ్వాలి కదా. ఎయిర్ ఇండియాని మూసేయాలి. ఆ సంస్థ విధానమే సరిగ్గా ఉండదు’ అని మండిపడ్డారు.

News May 8, 2024

విహార యాత్రలకు నేతల ప్లాన్!

image

విమర్శలు.. ప్రతి విమర్శలతో 2 నెలలుగా ప్రచారాన్ని హోరెత్తించిన నేతలు టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 13న ఎన్నికల పోలింగ్ ముగియనుండగా ఫలితాలు వెలువడేందుకు 21 రోజుల సమయం ఉంది. దీంతో ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు అమెరికా, లండన్, వియత్నాం వంటి దేశాల్లో సేద తీరేందుకు ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు సైతం బుక్ చేసుకున్నారట.

News May 8, 2024

తమిళనాడు సీఎంకు ప్రధాని మోదీ సవాల్

image

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తమిళనాడు గౌరవం కోసం కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవాలని స్టాలిన్‌ను ఛాలెంజ్ చేశారు. కాగా అంతకుముందు శామ్ పిట్రోడా దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

News May 8, 2024

పూంఛ్ దాడి.. వెలుగులోకి ముష్కరుల చిత్రాలు

image

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌లో IAF కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఒకరు పాక్ సైన్యానికి చెందిన మాజీ కమాండో ఇలియాస్ కాగా అబు హమ్జా అనే మరో వ్యక్తి లష్కరే తోయిబా కమాండర్‌గా ఉన్నాడు. వీరితో పాటు హదూన్ అనే మరో ముష్కరుడూ పరారీలో ఉన్నాడు. జైషే మహమ్మద్‌కు చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) తరఫున వీరు దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

News May 8, 2024

అయ్యో.. తమకు తాము ఓటేసుకోలేరు!

image

TG: ఈసారి MP ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు తమ ఓటు తమకు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. వారికి వేరే పార్లమెంట్ స్థానం పరిధిలో ఓటు ఉండటమే ఇందుకు కారణం. HYD ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్‌(MIM)కు రాజేంద్రనగర్‌లో, మాధవీలత(BJP)కి మల్కాజిగిరిలో, సమీర్‌(కాంగ్రెస్)కు జూబ్లీహిల్స్‌లో ఓటు ఉంది. చేవెళ్ల అభ్యర్థి జ్ఞానేశ్వర్(BRS)కు కుత్బుల్లాపూర్‌లో, మల్కాజిగిరి అభ్యర్థి సునీత(కాంగ్రెస్)కు తాండూరులో ఓటు ఉంది.

News May 8, 2024

ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయొచ్చు!

image

ఒక్కోసారి ఏదో కారణంతో ఓటరు జాబితాలో మన పేరు మిస్ కావొచ్చు. అలా మిస్ అయినా ఓటేయడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది. మిస్ అయిన వారి పేర్లతో ఏఎస్డీ అనే జాబితా ఉంటుంది. మీరు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు మీ పేరు లేకపోతే ఆ జాబితాలో వెతకాలి. అందులో మీ పేరు, గుర్తింపు కార్డు ఆధారంగా ఫారం 17ఏలో నమోదు చేసి సంతకం, వేలిముద్ర తీసుకుంటారు. మీ డిక్లరేషన్, ఫొటో, వీడియో తీసుకున్న అనంతరం మీరు ఓటేయొచ్చు.