India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రావణ సంహారం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరుగుతుంది. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి. బ్లాక్ మనీ పెరిగిపోయింది. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు. కానీ అదేమీ జరగదు’ అని స్పష్టం చేశారు.
AP: ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40వేల కోట్లు దోచేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని ఆరోపించారు. ‘రాష్ట్రం డ్రగ్స్‌కు రాజధాని అయిపోయింది. ఇక్కడ 30వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక్కసారీ స్పందించలేదు. రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది’ అని ఆరోపించారు.
నటుడు మాధవన్ పలు ఆసక్తికర విషయాలను ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ‘‘నేను మెరిట్ స్టూడెంట్ కాదు. 8వ తరగతిలో గణితంలో ఫెయిల్ అయ్యాను. కానీ, నేను టాటా స్టీల్స్‌లో జాబ్ కొట్టి, పెళ్లి చేసుకొని మా నాన్న ఉన్న ఇంట్లోనే ఉండాలని మా పేరెంట్స్ కోరిక. ఓ ఇంజినీరింగ్ కాలేజీ నా అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసినప్పుడు ‘నేను నీకేం తక్కువ చేశాను’ అని మా నాన్న నాతో కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు.
AP: రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారని పేర్కొన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
AP: చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న సభా వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
ఏపీ ఈఏపీసెట్ తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌పై సందిగ్ధం నెలకొంది. త్వరలోనే కొత్త తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అటు ప్రస్తుతం EAPCET దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా.. ఏప్రిల్ 15 వరకు చేసుకోవచ్చు.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు అందరినీ ఆకర్షించింది. ఆ సంస్థ అత్యధికంగా ₹1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ కొనుగోలు చేసిన బాండ్ల మొత్తంలో ₹509 కోట్లు తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలోని DMK పార్టీ ఖాతాలోకి చేరడం విశేషం. ఈ విషయాన్ని EC తాజాగా వెల్లడించింది. ఒక పార్టీకి ఇంతపెద్ద మొత్తంలో బాండ్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను EC తాజాగా మరోసారి వెల్లడించింది. ఏయే పార్టీకి ఎన్ని కోట్ల విలువైన బాండ్లు వచ్చాయో వివరించింది. BJP-రూ.6,986cr, టీఎంసీ-రూ.1,397cr, కాంగ్రెస్-రూ.1,344cr, బీఆర్ఎస్-రూ.1,322cr, బీజేడీ-రూ.944.5cr, డీఎంకే-రూ.656.5cr, వైసీసీ-రూ.442.8cr, టీడీపీకి రూ.181.35 కోట్ల మొత్తంలో బాండ్ల ద్వారా సమకూరిందని పేర్కొంది. 2019-20లో బీజేపీ అత్యధికంగా రూ.2,555 కోట్ల విలువైన బాండ్లను పొందింది.
TG: కాంగ్రెస్‌లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశానన్న CM రేవంత్ వ్యాఖ్యలతో BRS శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఇవాళ చేవెళ్ల MP రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజుల్లో మరో నలుగురు BRS MLAలు కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. ఇటీవల CMను MLAలు ప్రకాశ్ గౌడ్, యాదయ్య, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్, తెల్లం వెంకట్రావు తదితరులు కలిసిన విషయం తెలిసిందే.
AP: టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి సభ కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి చంద్రబాబు Xలో స్వాగతం పలికారు. ‘మోదీ జీ.. మా రాష్ట్ర ప్రజలు మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. మనం కలిసికట్టుగా సంక్షేమం, అభివృద్ధి, సమర్థవంతమైన పాలనలో కొత్త మైలురాళ్లను నెలకొల్పుదాం’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.