India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెన్నైతో మ్యాచ్‌లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. అదే ఛేదనలో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాలి. అప్పుడు CSK కంటే RCB రన్‌రేట్ మెరుగవుతుంది. అదే సమయంలో SRH, LSG తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీపై చెన్నై గెలిస్తే బెంగళూరు ఆశలన్నీ గల్లంతై ఇంటి బాట పట్టనుంది.
AP: పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘పల్నాడు జిల్లాలో ఏకపక్షంగా దాడులు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే మాకు కావాలి. అందుకే మేం ఎంతో సంయమనంతో ఉన్నాం. ప్రభుత్వం సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది. పేదల కోసం జగన్ ఎంతో చేశారు. మహిళల ఆశీర్వాదం వైసీపీకే ఉంది’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టైన కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన బెంగళూరు కోర్టు ష్యూరిటీ కింద రూ.5 లక్షల బాండ్ సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులకు సహకరించాలని తీర్పులో పేర్కొంది.
TG: రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్ శాతం తెలుస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ‘రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. 1400 కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలో ఉన్నారు. మొత్తం 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్నాయి. శాంతిభద్రతల విషయంలో ఇబ్బందులు రాలేదు. ఈరోజు 400 ఫిర్యాదులు వచ్చాయి. 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి’ అని వివరించారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు రేపు వర్ష సూచన ఉన్నట్లు APSDMA ఎండీ కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల్లోని పలుచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.
ఎన్నికలను కవర్ చేస్తోన్న జర్నలిస్టుల భద్రతపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. వారికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతోపాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించాలని గిల్డ్ అన్ని రాజకీయ పార్టీలు, కార్యకర్తలను కోరింది.
AP: పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూలో ఉన్నవారు ఓటు వేయవచ్చు. అయితే, రాష్ట్రంలోని పలు కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు భారీగా ఉండటంతో రాత్రి పది వరకూ పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.
AP: చిన్నచిన్న ఘటనలు మినహా రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ‘పోలింగ్ భారీగా జరిగింది. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. మాచర్ల, పుంగనూరు, పల్నాడు ఘటనలపై చర్యలు తీసుకున్నాం. పల్నాడులో 8 బూత్‌లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. డేటా మొత్తం సేఫ్‌గా ఉంది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు’ అని ఆయన వివరించారు.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, కోల్‌కతా మధ్య జరగనున్న మ్యాచ్ టాస్ మరింత ఆలస్యం కానుంది. స్టేడియాన్ని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులు కొనసాగుతున్నాయి. దీంతో పిచ్‌పై కవర్లు కప్పేశారు. వాతావరణం క్లియర్ అయిన తర్వాతే పిచ్‌పై కవర్లు తొలగించే అవకాశం ఉంది. ఆ తర్వాతే టాస్ పడనుంది.
బిహార్‌లో 106ఏళ్ల రామ్ నాథ్ సింగ్ అనే ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెగుసారాయి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఖమ్హార్‌లో ఉన్న 144వ పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటు వేశారు. ఇదిలా ఉంటే మన హైదరాబాద్‌లోని పాతబస్తీ ఓటర్లు మాత్రం ఓటేసేందుకు ససేమిరా రామంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Sorry, no posts matched your criteria.