India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు సీబీఐ కోర్టు సమయం నిర్ధారించింది. ప్రతిరోజు సా.6 నుంచి సా.7 గంటల వరకు కలిసేందుకు అవకాశం కల్పించింది. ఇవాళ ఆమెను భర్త అనిల్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు, న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆమెను ఈనెల 23 వరకు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిన్న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
TSRTC ఛైర్మన్ సజ్జనార్‌ను మరో పదవి వరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్టేకింగ్స్(ASRTU) స్టాండింగ్ కమిటీ నూతన ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ASRTU 54వ జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సజ్జనార్ ఆ పదవిలో ఏడాదిపాటు కొనసాగనున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా TSRTC చీఫ్ మెకానిక్ ఇంజినీర్ రఘునాథరావు ఎన్నికయ్యారు.
IPL ఒక సర్కస్‌లా ఎంటర్‌టైన్ చేస్తుందని ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అన్నారు. ‘8ఏళ్ల తర్వాత మళ్లీ IPLలో ఆడటం ఒక కొత్త సవాలు. ఈ టోర్నీ ప్రపంచంలోనే బెస్ట్ T20 లీగ్. ఈసారి కొత్త జట్టుతో ఆడనుండటం ఉత్సాహాన్నిస్తోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2014, 2015 సీజన్లలో RCBకి ఆడిన స్టార్క్.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. KKR అతడిని రూ.24.5కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనుండగా, 18 ఏళ్లు నిండినవారు ఏప్రిల్ 15 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. ఓటర్ లిస్టులో పేరు లేని వారు, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఫామ్-6ను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించవచ్చని తెలిపింది. ఓటర్ హెల్ప్ యాప్ లేదా https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు.
AP: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మంగళగిరిలో తమ పార్టీ కచ్చితంగా పోటీలో ఉంటుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
TG: రాష్ట్రంలో మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తూ ఈ పదవులిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వారికీ అవకాశం కల్పించారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం నియమించిన ఛైర్మన్లను తొలగించిన సంగతి తెలిసిందే.
TS: రేవంత్ రెడ్డి సీఎం అవుతారని పదేళ్ల కిందటే తాను చెప్పినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘టీడీపీలో ఉన్నప్పుడు నేను, రేవంత్ మంచి స్నేహితులం. గతంలో రేవంత్‌పై తొడగొట్టడం, తిట్టడం వంటివి రాజకీయపరంగా చేసినవే. వ్యక్తిగతంగా నాకు రేవంత్‌తో ఎలాంటి గొడవలు లేవు. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా. వేరే పార్టీల్లో చేరే ప్రసక్తే లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 21 వరకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది.
AP: ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరంలో బడులు తెరిచే తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 1-10 తరగతుల్లోని 42లక్షల మంది విద్యార్థులకు బైలింగువల్ పుస్తకాలను అందించనుంది. 1-5, 7వ తరగతి పుస్తకాల ముద్రణ బిడ్‌ను యూపీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించుకుంది. మిగతా తరగతుల ముద్రణను స్థానిక MSMEలకు ప్రభుత్వం అప్పగించనుంది. ఆసక్తిగల కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది.
AP: రాష్ట్రంలో ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 1,48,881 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించనున్నారు.
Sorry, no posts matched your criteria.