India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారతీయ ఐటీ కంపెనీలు H1B వీసా మీద ఇక్కడి ఉద్యోగులను US పంపడం ఒకప్పటి ట్రెండ్. అయితే గతకొన్నేళ్లుగా ఈ ట్రెండ్ నెమ్మదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. టాప్ 7 కంపెనీల్లో హెచ్1బీ వర్క్ వీసాను వినియోగించుకోవడం 8ఏళ్లలో 56% తగ్గింది. వీసా ఆమోదంలో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో స్థానికులను నియమించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయట. టెక్నాలజీ అందుబాటులో ఉండటం కూడా మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.
AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసులు విఫలమవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘తిరుపతిలో పులివర్తి నానిపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేశారు. మాచర్ల, తాడిపత్రిలోనూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈసీ, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఒక్కరోజు అన్నం తినకుంటే బతకలేమేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇథియోపియాకు చెందిన అంబావ్(26) అనే మహిళ 16ఏళ్లుగా తిండి, నీళ్లు లేకుండా జీవిస్తోంది. తనకు ఆకలి, దాహం లేకపోవడంతో కొన్నేళ్లుగా మరుగుదొడ్డికి వెళ్లే అవసరం కూడా రాలేదని ఆమె అంటున్నారు. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఆమెపై వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించినా ఎలాంటి లోపాలు బయటపడలేదు. అంబావ్ జీవిత రహస్యంపై డాక్టర్ల వద్దా వివరణ లేకపోవడం విశేషం.
పోలింగ్ ముగిశాక ఓట్లు EVMలలో నిక్షిప్తమవుతాయి. ఆ EVMలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. ఆ రూమ్‌లకు మూడంచెల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించరు. ద్వితీయ భద్రతా వలయాన్ని దాటేవారంతా తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలి. ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థులు/వారి ప్రతినిధులు, RO, పరిశీలకుడి సమక్షంలో వీడియో తీస్తూ స్ట్రాంగ్‌రూం తెరవాల్సి ఉంటుంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజలు, అభిషేకం నిర్వహించారు. వారి వెంట యూపీ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా ఉన్నారు. కాగా ఇవాళ ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ హాజరైన విషయం తెలిసిందే.
AP: వైసీపీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలను లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నా’ అంటూ సీఎం జగన్ పోస్ట్ పెట్టారు.
T20WC ఎంపికపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ టోర్నీకి హార్దిక్‌ను ఎంపిక చేయడం రోహిత్, సెలక్టర్ అగార్కర్‌కు ఇష్టం లేదని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఐపీఎల్లో అతడి పేలవ ప్రదర్శనే ఇందుకు కారణమని తెలిపింది. అయితే పొట్టి ప్రపంచకప్ తర్వాత T20లకు రోహిత్ వీడ్కోలు పలికే అవకాశం ఉండటం, కెప్టెన్‌గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేకపోవడంతో WCకు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు CBI కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పు వెలువరించారు.
AP: పక్కా ప్రణాళికతోనే తన తండ్రిపై దాడి చేశారని పులివర్తి నాని కుమారుడు వినీల్ ఆరోపించారు. మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు వస్తే బీర్ బాటిల్స్, గొడ్డళ్లతో దాడి చేశారన్నారు. డ్రైవర్ లేకపోతే తన తండ్రి ప్రాణాలతో ఉండేవారు కాదన్నారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని, పోలీసులూ సహకరించారని ఆరోపించారు. 15 రోజుల్లో ఆయనకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
మే 18.. అంటే విరాట్ కోహ్లీకి పూనకాలే. కొన్నేళ్లుగా ఆ తేదీన జరిగిన మ్యాచ్‌ల్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటంతో బెంగళూరుకు ఓటమి అన్నదే లేదు. మే 18న పలు సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 56*, 27, 113, 100 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అదే తేదీన ఈ శనివారం చెన్నైతో డూ ఆర్ డై మ్యాచ్ జరగనుండటంతో కోహ్లీ చెలరేగి జట్టును ప్లే ఆఫ్స్‌కు చేరుస్తారంటూ అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.