India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇన్‌కం ట్యాక్స్ చట్టాన్ని సింప్లిఫై చేయడంపై ఫైనాన్స్ మినిస్ట్రీ దృష్టి సారించింది. బడ్జెట్‌కు ముందే, 2025 జనవరిలోపు ఫాస్ట్‌ట్రాక్ రివ్యూ చేపట్టాలని చీఫ్ కమిషనర్ వీకే గుప్తా కమిటీని కోరినట్టు NDTV తెలిపింది. కాలం చెల్లిన క్లాజులు, సెక్షన్లు, సబ్ సెక్షన్లు 120 వరకు తొలగిస్తారని సమాచారం. టెలికం, సెజ్, క్యాపిటల్ గెయిన్స్ డిడక్షన్లూ ఇందులో ఉంటాయి. అవసరమైతే లా మినిస్ట్రీ సాయం తీసుకుంటారని తెలిసింది.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారితే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా ప్రజాధనం ఆదా అవడంతో పాటు ప్రభుత్వాలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది.
తనను తమిళనాడు DyCMగా నియమిస్తున్నారన్న వార్తలు అవాస్తవాలేనని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ‘మీరిది సీఎంను అడగండి. దీనిపై నిర్ణయం తీసుకొనే పూర్తి హక్కులు ఆయనకే ఉన్నాయి’ అని మీడియాకు చెప్పారు. మరికొన్ని గంటల్లో DyCMగా తనను నియమిస్తున్నారన్న వార్తలపై ఆయన ఇలా స్పందించారు. అమెరికా పర్యటనకు ముందే ఎంకే స్టాలిన్ తన కుమారుడికి ఆ పదవి అప్పగిస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. సీనియర్ల వల్లే ఆలస్యమవుతోందని వినికిడి.
బాలీవుడ్ నటీనటులు రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించగా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించిన హారర్ కామెడీ ‘స్త్రీ-2’ రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా రూ.586 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేయడంతో ‘స్త్రీ-2’ ప్రస్తుతం అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచినట్లు తెలిపాయి.
AP: వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు. బుడమేరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
TG: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీకి శ్రీకారం చుట్టి గొప్ప ఆర్థిక విధానాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులు మారినా విధానాలు అలాగే కొనసాగుతాయని చెప్పారు. 1995-2004 మధ్య చంద్రబాబు ఐటీ విప్లవాన్ని తీసుకొస్తే, వైఎస్ఆర్ దానిని కొనసాగించారన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. సంస్కరణల వల్లే ఐటీ, ఫార్మా రంగాల్లో నం.1గా ఉన్నామన్నారు.
నందమూరి బాలకృష్ణ కొత్త లుక్‌లో కనిపించారు. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘NBK109’ సినిమా షూటింగ్ స్పాట్‌కు ‘పైలం పిలగా’ చిత్రయూనిట్ వెళ్లింది. ఈనెల 20వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ కోసం ట్రైలర్‌ను బాలయ్యకు చూపించారు. ఈ సందర్భంగా పంచెకట్టులో హ్యాండ్సమ్‌గా బాలయ్య కనిపించారు. బాలయ్య రోజురోజుకూ యూత్‌గా మారుతున్నారని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ డిసెంబర్ 6న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో డిసెంబర్‌లో చిన్న సినిమాలు విడుదల తేదీలను ప్రకటించడంలో వెనకడుగేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ‘పుష్ప-2’ పోస్ట్‌పోన్ అయితే అప్పుడు రిలీజ్ చేస్తారని సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా సంక్రాంతి లేకపోతే మార్చిలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని సినీవర్గాలు తెలిపాయి.
గాంధీ ఆస్పత్రిలో ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది బాలింతలు చనిపోవడంపై కేటీఆర్ ఫైరయ్యారు. ‘ఇది ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీలో ఇంత విషాదం ఎవరి పాపం? ఒక్క ఆస్పత్రిలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఇంకెలా ఉందో. పాలన గాలికి వదిలి విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుంది’ అని మండిపడ్డారు.
TG: సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్థాన్‌లో ఉండేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణను పాకిస్థాన్‌లో కలపాలని నిజాం అనుకున్నాడని, పటేల్ అసలైన తెలంగాణకు విముక్తి కల్పించారని తెలిపారు. MIMకు భయపడి BRS, కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదని ఫైరయ్యారు. MIM పార్టీ రజాకార్ల దళం నుంచి పుట్టిందని సంజయ్ వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.