India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాను డిప్రెషన్ నుంచి బయటపడటానికి భర్త రామ్ చరణ్ సాయం చేసినట్లు ఉపాసన చెప్పారు. డెలివరీ తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణమన్నారు. చాలా మందిలాగే డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని.. ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్‌లా వ్యవహరించారని పేర్కొన్నారు. క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET-2024) దరఖాస్తుల స్వీకరణ నేడు ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో అప్లై చేసుకునేందుకు జులై 26 వరకు గడువు ఉంది. ఆగస్టు 20 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానుండగా, అదే నెల 28, 29, 30, 31 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. సీబీటీ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: http://telanganaset.org/
AP: జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎంత మంది వచ్చినా జూన్ 4న వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతం కంటే పోలింగ్ శాతం పెరిగితే.. దాన్ని పాజిటివ్ ఓటింగ్‌గా పరిగణించాలని చెప్పారు. మహిళలంతా జగన్‌కే ఓటు వేశారని.. బంపర్ మెజారిటీతో మరోసారి సీఎం కాబోతున్నారని పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్టుల్లోని పటిష్ఠ భద్రతను దాటుకుని మరీ విమానాల్లో తోటి ప్రయాణికుల వస్తువులను ఓ దొంగ చోరీ చేయడం చర్చనీయాంశమైంది. రాజేశ్ కపూర్ అనే ఈ దొంగ 2023లో 100 రోజుల్లో 200 విమానాల్లో చోరీలు చేశాడు. కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే సీనియర్లు, మహిళలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తాడట. అలా ఇప్పటివరకు రూ.లక్షలు విలువైన వస్తువులు దోచేశాడు. గతంలో రైళ్లలో చోరీలు చేసిన రాజేశ్ పోలీసులకు పట్టుబడ్డాక రూట్ మార్చాడు.
వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఆర్సీబీకి వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్ చేరేందుకు కీలకంగా ఉన్న చివరి మ్యాచు జరిగే శనివారం రోజున వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కర్ణాటకలో ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే RCB ప్లేఆఫ్ ఆశలు గల్లంతే. మరోవైపు CSK ఆశలు ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి.
నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం’ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నరగా వార్తల్లో నిలుస్తోన్న ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌గా నిలువనుందట. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాను రూ.835 కోట్లతో తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం ఫస్ట్ పార్ట్‌కే ఇంత ఖర్చు చేయనున్నారట.
ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళా రెజ్లర్ల సంఖ్య పెరుగుతోంది. 2012లో ఒక్కరు మాత్రమే ఒలింపిక్స్‌లో పోటీపడగా, ఆ తర్వాత 2016లో ముగ్గురు, 2020లో నలుగురు క్వాలిఫై అయ్యారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు ఐదుగురు ఎంపికయ్యారు. దీంతో దేశంలో మహిళల రెజ్లింగ్ పురోగతి సాధిస్తోందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మెడల్(2016-బ్రాంజ్) మాత్రమే గెలిచిన మహిళా రెజ్లర్లు ఈసారి ఎన్ని మెడల్స్ గెలుస్తారో చూడాలి.
వాట్సాప్‌లో ‘ఆటోప్లే యానిమేటెడ్ ఇమేజెస్’ పేరుతో ఓ ఫీచర్ రానుంది. ఎమోజీ, స్టికర్స్, అవతార్స్‌కు సంబంధించి యానిమేషన్స్‌ను ఈ ఫీచర్‌తో కంట్రోల్ చేయవచ్చు. డిజేబుల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. మన ప్రాధాన్యతకు తగ్గట్లుగా యాప్‌లో చాట్ సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటును తీసుకురానున్నారు. GIFs విషయంలో మాత్రం ఇది పనిచేయదు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
కుటుంబమంతా కలిసి చూసే విలువలతో కూడిన కంటెంట్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానుందట. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను చూపించడమే లక్ష్యంగా ఇందులోని కంటెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్‌ను ఇందులో కవర్ చేస్తారట. ఏడాది లేదా రెండేళ్లు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ ధరలు నిర్ణయిస్తారని సమాచారం.
AP: కూటమి భారీ విజయంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని గ్రహించే నిన్న వైసీపీ దాడులకు తెగబడిందని ఆరోపించారు. కసి, కోపం, బాధతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని తెలిపారు. విజయవాడ పార్లమెంటులో అన్ని అసెంబ్లీ స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని చిన్ని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.