news

News September 18, 2024

వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త యూనిఫామ్

image

AP: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా చర్యలు తీసుకోనుంది.

News September 18, 2024

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయండి: TFCC

image

జానీ మాస్టర్‌‌పై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) స్పందించింది. సినీ ఇండస్ట్రీలో ఇలా వేధింపులు ఎదుర్కొన్నవారు తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. హైదరాబాద్‌లోని TFCC ఆఫీస్ వద్ద ఉ.6 నుంచి రా.8 వరకు కంప్లైంట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పోస్ట్‌ లేదా ఫోన్‌ 9849972280, మెయిల్‌ ఐడీ complaints@telugufilmchamber.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

News September 18, 2024

YELLOW ALERT: మళ్లీ వర్షాలు

image

TG: వారం రోజులుగా పొడి వాతావరణం ఉన్న రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 18, 2024

పదేళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ మూవీ

image

మాలీవుడ్ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ పదేళ్ల తర్వాత కలిసి నటించనున్నారు. మహేశ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మెజార్టీ షూటింగ్ శ్రీలంకలోనే జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత కేరళ, ఢిల్లీ, లండన్‌లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో దాదాపు 50 సినిమాలు వచ్చాయి. చివరిసారిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో నటించారు.

News September 18, 2024

నేడు జమ్మూకశ్మీర్‌లో తొలి దశ పోలింగ్

image

పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిదశలో ఇవాళ 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 3,276 పోలింగ్ కేంద్రాలను EC సిద్ధం చేసింది. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. INC-NC కలిసి పోటీ చేస్తుండగా, PDP, BJP, JKPM, PC, ఆప్నీ పార్టీలు విడివిడిగా బరిలో ఉన్నాయి.

News September 18, 2024

అమరావతి రైల్వే లైన్ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు?

image

AP: అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 510 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. NTR జిల్లాలో 296, గుంటూరులో 155, ఖమ్మంలో 60 ఎకరాల చొప్పున కావాలని ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపింది. ఈ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు, పాత అలైన్‌మెంట్ ప్రకారం ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

News September 18, 2024

దివాలా దిశగా ‘టప్పర్‌వేర్’

image

ప్లాస్టిక్ బాక్సుల తయారీలో దిగ్గజ సంస్థ టప్పర్‌వేర్ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఈ వారంలోనే దివాలా ప్రకటన చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. కంపెనీ షేర్లు తాజాగా 57 శాతం పడిపోయాయి. 2019లో 40 డాలర్లకుపైగా ఉన్న షేర్ విలువ ప్రస్తుతం 0.51 డాలర్లకు పడిపోయింది. $700 మిలియన్లకుపైగా ఉన్న అప్పులను చెల్లించడం సాధ్యం కావట్లేదు. దీంతో రుణదాతలతో చర్చించి దివాలా ప్రకటించడానికి సన్నాహాలు చేసుకుంటోంది.

News September 18, 2024

SECగా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్

image

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కమిషనర్‌గా రిటైర్డ్‌ IAS రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత IAS ఎంజీ గోపాల్‌ను నియమించింది. ఇద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. రాణి కుముదిని 1988 IAS బ్యాచ్ కాగా గోపాల్ 1983 IAS బ్యాచ్. వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా పనిచేశారు.

News September 18, 2024

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది. పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది. అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను సీఎం వెల్లడించనున్నారు.

News September 18, 2024

మద్యం వ్యాపారం ప్రైవేటుకే అప్పగింత

image

AP: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. గీత కార్మికుల కోసం 396 దుకాణాలను కేటాయిస్తారు. ఏ రాష్త్ర వ్యక్తయినా దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా లైసెన్సులు ఇస్తారు. ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించి, ఈ నెల 22, 23 తేదీల్లో కొత్త పాలసీపై ఉత్తర్వులిస్తారు. OCT4, 5 నాటికి కొత్త విధానం అమల్లోకి రానుంది.