news

News May 14, 2024

భారీ విజయం మాదే: కేశినేని చిన్ని

image

AP: కూటమి భారీ విజయంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని గ్రహించే నిన్న వైసీపీ దాడులకు తెగబడిందని ఆరోపించారు. కసి, కోపం, బాధతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని తెలిపారు. విజయవాడ పార్లమెంటులో అన్ని అసెంబ్లీ స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని చిన్ని పేర్కొన్నారు.

News May 14, 2024

కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు: మోదీ

image

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోదని చెప్పారు. యూపీ ప్రజలు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరని అన్నారు. వారి జీవితాలను మార్చిన ప్రత్యామ్నాయ మోడల్‌ను ఎంచుకుంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలిచేందుకు తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

News May 14, 2024

హాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన టబు!

image

బాలీవుడ్ సీనియర్ నటి టబు హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశారు. ప్రముఖ మూవీ సిరీస్ ‘డ్యూన్’ పార్ట్-3లో ఆమె నటించనున్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం సినిమాలో టబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో వచ్చిన రెండు పార్టులు సూపర్ హిట్‌గా నిలిచాయి.

News May 14, 2024

డోంట్ వర్రీ..T20 WCలో రోహిత్ అద్భుతంగా ఆడతాడు: గంగూలీ

image

IPLలో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శనతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న వేళ BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ‘భారత జట్టు అత్యుత్తమమైనది. ప్రపంచకప్‌లో రోహిత్ అద్భుతంగా ఆడతాడు. బిగ్ టౌర్నమెంట్స్‌లో రోహిత్ తన బెస్ట్ ఇస్తాడు. కాబట్టి ఫ్యాన్స్ అతని ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని గంగూలీ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది.

News May 14, 2024

రేపు ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్

image

రామ్ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. రేపు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 85 సెకండ్ల నిడివితో ఈ టీజర్ ఉంటుందని తెలిపారు. పార్ట్-1 కంటే రెండు రెట్లు ఎక్కువగా ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

News May 14, 2024

కాలువలకు మరమ్మతులు చేపట్టాలి: పవన్ కళ్యాణ్

image

ఏపీలో కాలువల నిర్వహణ పనులపై గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఎన్నికలు ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించి, మరమ్మతుల పనులను వేసవి ముగిసేలోగా పూర్తిచేయాలి’ అని పేర్కొన్నారు.

News May 14, 2024

CBNపై FIR కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

image

టీడీపీ అధినేత చంద్రబాబు జైలు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ 2010లో నమోదైన కేసును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది. బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో 2010లో బాబును MH పోలీసులు అరెస్ట్ చేసి ధర్మాబాద్‌ జైలులో ఉంచారు. అక్కడి నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో సిబ్బందిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ కేసులో CBN, ఆనంద్ బాబుపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

News May 14, 2024

సీఎం విదేశీ పర్యటనపై నేడు తీర్పు

image

AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News May 14, 2024

గాజాలో యూఎన్ భారత సిబ్బంది మృతి!

image

ఇజ్రాయెల్ దాడిలో ఐక్యరాజ్యసమితి రక్షణ, భద్రతా విభాగంలో పనిచేస్తున్న భారత సిబ్బంది మరణించారు. గాజాలోని రఫాలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరగడంతో మరణించినట్లు పీటీఐ పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎన్ అంతర్జాతీయ సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి. రఫాలో తలదాచుకున్న పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

News May 14, 2024

ఐపీఎల్: SRH, RCB ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే?

image

☛ SRH 12 మ్యాచుల్లో 7 నెగ్గింది. మిగతా 2 మ్యాచుల్లో(GT, PBKS) గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. NRR(+0.406) కూడా బాగుంది. ఒకటి గెలిచినా ముందుకు వెళ్లే ఛాన్సుంది. రెండింట్లో ఓడితే ఇతర మ్యాచుల ఫలితాలపై ఆధారపడాలి.
☛ RCB 13 మ్యాచుల్లో 6 నెగ్గింది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే SRH, LSG, DCలో రెండు జట్లు నిష్క్రమించాలి. CSKతో మ్యాచులో RCB 18 రన్స్ తేడాతో గెలవాలి. లేదా టార్గెట్‌ను 18.1ఓవర్లలో ఛేదించాలి.