news

News September 18, 2024

చైనా పౌరుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

image

వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటూ అంతర్జాతీయ క్రైం రాకెట్ న‌డుపుతున్న చైనా పౌరుడికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాక‌రించింది. రెన్ చావోపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ పిటిషన్‌ను ప‌రిగ‌ణించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. నేరపూరిత కుట్ర ఆరోపణలపై రెన్ చావోను నోయిడా పోలీసులు 2022లో అరెస్టు చేశారు. వ్యాపారం చేసే విదేశీయులు భారత చట్టాలకు లోబడి ఉండాలని అలహాబాద్ హైకోర్టు గతంలో అతని బెయిల్ తిరస్కరించింది.

News September 18, 2024

చక్కటి ఆలోచన.. అడవిలో కంటైనర్ స్కూల్

image

TG: దట్టమైన అటవీ ప్రాంతం. భవన నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని బంగారుపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేశారు. రూ.13 లక్షలతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో తయారు చేసి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఇవాళ ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ ఇదే.

News September 18, 2024

సీఎంకు చెక్కు అందజేసిన అనన్య

image

AP: విజయవాడ వరద బాధితుల కోసం తెలుగు హీరోయిన్ కొన్ని రోజుల క్రితం రూ.2.50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చెక్కును అమరావతిలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. అటు తెలంగాణలోని వరద బాధితులకు సైతం ఈ హీరోయిన్ రూ.2.50 లక్షల విరాళం ప్రకటించారు.

News September 18, 2024

జానీ మాస్టర్‌‌పై వేటు

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

News September 18, 2024

పాక్ క్రికెట్‌ను గాడిలో పెట్టే వ్యక్తులు కావాలి: లతీఫ్

image

పాకిస్థాన్ క్రికెట్ అంపశయ్య మీద ఉందని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నారు. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు అత్యవసరమని వ్యాఖ్యానించారు. కెప్టెన్ బాబర్ ఆజం మానసిక ఒత్తిడికి గురై ఆటలో రాణించలేకపోతున్నారని చెప్పారు. ఆయన కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల సొంతగడ్డపై జరిగిన టెస్టులో తొలిసారిగా బంగ్లా చేతిలో పాక్ క్లీన్‌స్వీప్‌కు గురికావడం ఆ జట్టు దుస్థితికి అద్దం పడుతోంది.

News September 18, 2024

IIT బాంబేకు మోతిలాల్ ఓస్వాల్ రూ.130 కోట్ల విరాళం

image

మోతిలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఐఐటీ బాంబేకు రూ. 130 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. దీనిని విద్యా సంస్థ‌లో ఆర్థిక రంగంలో ప‌రిశ్ర‌మ ఆధారిత వినూత్న కార్య‌క్ర‌మాల అమ‌లు, మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌, పరిశోధనల మెరుగుకు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఇది భారతీయ విద్యా సంస్థకు అందిన అతిపెద్ద కార్పొరేట్ విరాళాలలో ఒకటిగా నిలిచింది. దీని ద్వారా మోతిలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఐఐటీ బాంబేలో ఏర్పాటు చేయనున్నారు.

News September 17, 2024

హెజ్బొల్లా పేజ‌ర్లు వాడ‌కం వెనుక కార‌ణాలు?

image

పుష్ప‌లో అల్లు అర్జున్‌ ఉప‌యోగించే పేజ‌ర్ గుర్తుందా? వాటి కంటే అత్యాధునిక‌మైన‌వి వాడుతోంది లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా. సెల్‌ఫోన్లు, ఇంట‌ర్నెట్‌ను ఇజ్రాయెల్ సుల‌భంగా హ్యాక్ చేయ‌గలదని ఇంట‌ర్న‌ల్ క‌మ్యూనికేష‌న్ కోసం పేజ‌ర్ల‌ను వాడుతోంది. ర‌క్ష‌ణ సంబంధిత సాంకేతిక‌త‌ అంశాల్లో ఇజ్రాయెల్ శ‌త్రుదుర్భేద్యంగా ఉంది. అందుకే <<14127059>>వేలాది పేజర్లు ఒకే రోజు పేలడం<<>> వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని హెజ్బొల్లా ఆరోపిస్తోంది.

News September 17, 2024

స్త్రీ ఒక శక్తి అని గుర్తుంచుకోవాలి: నటి ఖుష్బూ

image

మహిళ మౌనాన్ని తేలికగా తీసుకోవద్దని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ అన్నారు. చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె స్పందించారు. ‘స్త్రీ వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా భావించొద్దు. ఆమె ఒక శక్తి అని గుర్తుంచుకోవాలి. మహిళల్ని వేధించేవారు, అసభ్యంగా మాట్లాడేవారు ఆమె నేర్పే పాఠాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఆమె గురించి ఒక్క మాట మాట్లాడాలన్న వణుకుతారు’ అని వ్యాఖ్యానించారు.

News September 17, 2024

రేవంత్ ధర్మం తెలిసినవాడు: రాజాసింగ్

image

TG: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు బాగున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించారు. ‘పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పనితీరు బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం సంతోషకరం. రేవంత్ ధర్మం తెలిసినవాడు’ అని వ్యాఖ్యానించారు.

News September 17, 2024

చైనాకు మద్దతు తెలిపిన పాక్ ఆటగాళ్లు

image

ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో చైనాకు పాక్ ఆటగాళ్లు మ‌ద్ద‌తు తెలిపారు. పాక్‌ ఎవ‌రి చేతిలో సెమీస్‌లో ఓట‌మిపాలైందో వారికే సపోర్ట్ చేయడం గ‌మ‌నార్హం. మ్యాచ్ సంద‌ర్భంగా పాక్ ఆట‌గాళ్లు చైనా జెండాల‌ను చేత‌బ‌ట్టుకొని క‌నిపించారు. ఈ మ్యాచ్‌లో పాక్ ఎవరికి మద్దతు ఇస్తున్నది స్ప‌ష్ట‌ం అవుతోందంటూ కామెంటేట‌ర్ వ్యాఖ్యానించారు. ఆ దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.