news

News May 14, 2024

22 నెలల చిన్నారికి ₹17.5 కోట్ల ఇంజెక్షన్‌

image

రాజస్థాన్‌కు చెందిన హృదయాంశ్‌శర్మ(22 నెలలు) కోసం క్రికెటర్ నుంచి కూరగాయలమ్మే వ్యక్తి వరకూ కదిలి వచ్చారు. వెన్నెముక సమస్య ఉన్న చిన్నారి సాధారణ జీవితం గడపాలంటే ₹17.5 కోట్ల జోల్జె‌న్‌స్మా ఇంజెక్షన్‌ అవసరమైంది. చిన్నారి తండ్రి SI కావడంతో పోలీస్ విభాగం క్రౌడ్ ఫండింగ్ ప్రకటించింది. దీపక్ చాహర్, సోనూసూద్‌, NGOలు, సామాన్యులు సైతం విరాళాలిచ్చారు. ఎట్టకేలకు తాజాగా చిన్నారికి ఇంజెక్షన్ అందింది.

News May 14, 2024

తెలంగాణలో 3% పోలింగ్‌ పెరిగింది: వికాస్‌రాజ్‌

image

TG: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. సోమవారం ఉ.7-సా.6గంటల వరకు పోలింగ్ జరగ్గా.. మొత్తం 65.67% పోలింగ్‌ నమోదైందన్నారు. అత్యధికంగా భువనగిరిలో 76.78%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48% పోలింగ్ నమోదైనట్లు వివరించారు. 2019 LS ఎన్నికలతో పోలిస్తే 3% పోలింగ్‌ పెరిగిందని, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.

News May 14, 2024

పొట్టిగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా?: అబ్దు

image

పొట్టిగా ఉంటే పెళ్లి చేసుకోవడానికి అర్హులు కారా? అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, తజికిస్థాన్ సింగర్ అబ్దు రోజిక్ ప్రశ్నించారు. తన ఎంగేజ్మెంట్‌ గురించి వస్తోన్న ట్రోల్స్‌పై ఇన్‌స్టా వేదికగా ఆయన స్పందించారు. ఇతరుల విషయాల్లో అసహ్యంగా ప్రవర్తించవద్దని సూచించారు. నెగటివ్ కామెంట్స్ వల్ల తమ మానసిక స్థితి దెబ్బతింటుందన్నారు. 3.8అడుగుల ఎత్తుండే అబ్దు(20) ఇటీవల తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

News May 14, 2024

రేపు ఏపీలో పిడుగులతో వర్షాలు.. మండే ఎండలు

image

AP: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 12, మన్యంలో 10, అల్లూరి జిల్లాలోని 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అలాగే నెల్లూరు, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

News May 14, 2024

ఢిల్లీతో మ్యాచ్.. LSG టార్గెట్ 209 రన్స్

image

LSGతో మ్యాచ్‌లో DC 20 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. అభిషేక్ పోరెల్ 58, షై హోప్ 38, పంత్ 33 పరుగులతో రాణించారు. చివర్లో స్టబ్స్ 25 బంతుల్లో 57* పరుగులతో అదరగొట్టారు. నవీన్ ఉల్ హక్ 2, రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

News May 14, 2024

అస్ట్రాజెనెకా టీకాతో వైకల్యం.. కంపెనీపై దావా

image

అస్ట్రాజెనెకా కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న తాను శాశ్వత వైకల్యం బారిన పడ్డానంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించారు. 2020లో టీకా తీసుకున్న తర్వాత తీవ్రమైన నరాల సంబంధిత సమస్యలు వచ్చాయని బాధితురాలు బ్రియాన్ డ్రెస్సెన్(42) వెల్లడించారు. దుష్ప్రభావాలు కనిపిస్తే మెడికల్ ఖర్చులు చెల్లిస్తామని కంపెనీ చెప్పిందని, తర్వాత పట్టించుకోలేదని పేర్కొంది. అస్ట్రాజెనెకాపై USలో ఇదే తొలి కేసు అని తెలుస్తోంది.

News May 14, 2024

ఐదో దశ ఎన్నికలు ఎప్పుడంటే?

image

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్‌తో ఎన్నికలు ముగుస్తాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

News May 14, 2024

నాకు 15రోజులు ఇన్సులిన్ ఇవ్వలేదు: కేజ్రీవాల్

image

తిహార్ జైలులో ఉన్నప్పుడు తనకు 15రోజులు ఇన్సులిన్ ఇవ్వలేదని ఢిల్లీ CM కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో అన్ని రకాల ఔషధాలు తాను ఉచితం చేశానని గుర్తు చేశారు. తానొక షుగర్ పేషెంట్‌నని, డైలీ 52యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటానని వెల్లడించారు. కాగా.. లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. హరియాణాలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

News May 14, 2024

ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం

image

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్‌లో ధాన్యం లోడ్ చేస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

News May 14, 2024

తెలంగాణలో 65.66శాతం పోలింగ్?

image

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 65.66శాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే తుది పోలింగ్ శాతంపై రేపు ఈసీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో ఓవరాల్‌గా 81.3శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. దీన్ని సీఈవో అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.