news

News September 17, 2024

ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ

image

రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ సీఎం ఎవరో తేలిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ లెజిస్లేటివ్ మీటింగ్‌‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ అందజేస్తానని వెల్లడించారు.

News September 17, 2024

ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్

image

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ నిత్యం దేశ సేవలో తరిస్తూ మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా. ఆయన దార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలి’ అని బాబు ఆకాంక్షించారు. ‘మన దేశాన్ని పురోగతి, శ్రేయస్సు వైపు నడిపించేలా ఆయనకు మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా’ అని రేవంత్ పేర్కొన్నారు.

News September 17, 2024

బలిదానాలతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం: కిషన్‌రెడ్డి

image

TG: ఎంతోమంది బలిదానాలు, త్యాగాలతోనే తెలంగాణ నిజాం నియంతృత్వం నుంచి స్వాతంత్ర్యం పొందిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కిషన్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. రజాకార్ల మెడలు వంచడంలో దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్‌ది సాహసోపేత పాత్ర అని కొనియాడారు. ఈరోజు ప్రధాని మోదీ జన్మదినం కావడం విశేషమని అన్నారు.

News September 17, 2024

ఢిల్లీ కొత్త సీఎం ఎవరంటే.. మధ్యాహ్నం 12 వరకు ఆగాల్సిందే..

image

ఢిల్లీ కొత్త CM ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. CM అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో AAP లెజిస్లేటివ్ మీటింగ్‌ మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల్లోపు అభ్యర్థి పేరును ప్రకటిస్తారని తెలిసింది. సా.4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కేజ్రీవాల్ కలిసి రాజీనామా చేస్తారు. బాధ్యతలను కొత్తవారికి అప్పగిస్తారు. సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటారన్నది పెద్ద మ్యాటరేం కాదని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

News September 17, 2024

జానీ మాస్టర్‌కు మరో షాక్!

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ పదవి నుంచి జానీని తొలగించడంతో పాటు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. జానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ లేడీ డాన్సర్ ఆరోపించడంతో ఇప్పటికే జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ వేలం.. ఏ ఏడాది ఎంత?

image

TG: ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డూ ఈసారి వేలంపాటలో రూ.30,01,000 పలికింది. బాలాపూర్ గణనాథుడి చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. గతేడాది రూ.27లక్షలు పలికింది. ఇక తొలిసారి 1994లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను రూ.450కు దక్కించుకున్నారు. 2000 ఏడాదిలో రూ.66వేలు, 2010లో రూ.5,35,000 పలికింది. కరోనా కారణంగా 2020లో వేలం నిర్వహించలేదు. పూర్తి వివరాలు పైన ఫొటోలో చూడొచ్చు.

News September 17, 2024

కూల్చివేతలే పరిష్కారం కాదన్న KCR!

image

TG: HYDలో HYDRA చేపడుతున్న కూల్చివేతలపై మాజీ సీఎం, BRS అధినేత KCR తొలిసారి స్పందించినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం.. నగరంలో ఆక్రమణలకు కూల్చివేతలే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. MSమక్తా వంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి వాటిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందే లక్షల ఎన్‌క్రోచ్‌మెంట్లు ఉన్నాయని, కూల్చివేతలకు బదులుగా కొత్త వాటికి అనుమతులు ఆపడంపై దృష్టిపెట్టాలన్నారు.

News September 17, 2024

గతంలోలాగా మందులపై సీఎం బొమ్మ లేదు: TDP

image

AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మందుల కిట్లను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘గత ప్రభుత్వంలో ఉన్నట్లు ఇప్పుడు మందుల మీద ఎక్కడా జగన్ రెడ్డి బొమ్మ లేదు’ అని పేర్కొంది.

News September 17, 2024

చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలి: ఎంపీ విజయసాయి

image

CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.

News September 17, 2024

నేనేమీ ఫామ్‌హౌస్ సీఎంను కాదు: రేవంత్

image

TG: ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. దాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి తానేమీ ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ప్రజాపాలన వేడుకల సందర్భంగా ఎద్దేవా చేశారు.