India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ కొత్త CM ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. CM అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో AAP లెజిస్లేటివ్ మీటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల్లోపు అభ్యర్థి పేరును ప్రకటిస్తారని తెలిసింది. సా.4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కేజ్రీవాల్ కలిసి రాజీనామా చేస్తారు. బాధ్యతలను కొత్తవారికి అప్పగిస్తారు. సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటారన్నది పెద్ద మ్యాటరేం కాదని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ పదవి నుంచి జానీని తొలగించడంతో పాటు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. జానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ లేడీ డాన్సర్ ఆరోపించడంతో ఇప్పటికే జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
TG: ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డూ ఈసారి వేలంపాటలో రూ.30,01,000 పలికింది. బాలాపూర్ గణనాథుడి చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. గతేడాది రూ.27లక్షలు పలికింది. ఇక తొలిసారి 1994లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను రూ.450కు దక్కించుకున్నారు. 2000 ఏడాదిలో రూ.66వేలు, 2010లో రూ.5,35,000 పలికింది. కరోనా కారణంగా 2020లో వేలం నిర్వహించలేదు. పూర్తి వివరాలు పైన ఫొటోలో చూడొచ్చు.
TG: HYDలో HYDRA చేపడుతున్న కూల్చివేతలపై మాజీ సీఎం, BRS అధినేత KCR తొలిసారి స్పందించినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం.. నగరంలో ఆక్రమణలకు కూల్చివేతలే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. MSమక్తా వంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి వాటిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందే లక్షల ఎన్‌క్రోచ్‌మెంట్లు ఉన్నాయని, కూల్చివేతలకు బదులుగా కొత్త వాటికి అనుమతులు ఆపడంపై దృష్టిపెట్టాలన్నారు.
AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మందుల కిట్లను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘గత ప్రభుత్వంలో ఉన్నట్లు ఇప్పుడు మందుల మీద ఎక్కడా జగన్ రెడ్డి బొమ్మ లేదు’ అని పేర్కొంది.
CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.
TG: ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. దాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి తానేమీ ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ప్రజాపాలన వేడుకల సందర్భంగా ఎద్దేవా చేశారు.
బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. US ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. కొనుగోళ్లలో దూకుడు ప్రదర్శించడం లేదు. సెన్సెక్స్ 82,915 (-78), నిఫ్టీ 25,366 (-16) వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 25:25గా ఉంది. HDFC బ్యాంకు, ఎయిర్‌టెల్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. బ్రిటానియా, దివిస్ ల్యాబ్, LTIM, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్.
TG: కొత్త రేషన్ కార్డుల <<14116390>>దరఖాస్తులకు<<>> వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలి. 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులు. అయితే AP, TN, KA, గుజరాత్‌లో ఆదాయ పరిమితులు పరిశీలించామని, రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించాలనుకుంటున్న రాహుల్ గాంధీకి జిన్నా తరహా మైండ్‌సెట్ ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ USలో విమర్శించారు. ‘భారత్‌లో రాహుల్ సిక్కుల గురించి మాట్లాడరు. ఎవరి హయాంలో, ఎందుకు వారిపై ఊచకోత జరిగిందో ఆయన అంతర్మథనం చేసుకోవాలి. కోరుకున్నది దక్కాలి లేదా నాశనమవ్వాలన్న జిన్నా వైఖరే ఆయనకుంది. ఓ పద్ధతి ప్రకారం ఆయన సిక్కులపై కుటిల యత్నానికి పాల్పడుతున్నారు’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.