news

News March 20, 2024

ఏప్రిల్ 1 నుంచి టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్

image

AP: టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ రోజు నుంచి ఎనిమిది రోజులపాటు నిరంతరాయంగా మూల్యాంకనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన రెండో భాష పరీక్షకు 97.05% మంది హాజరయ్యారు. ఈ నెల 30వ తేదీతో టెన్త్ పరీక్షలు ముగియనున్నాయి.

News March 20, 2024

పవన్‌కు వంగా గీత కౌంటర్

image

AP: తనను జనసేనలోకి ఆహ్వానించిన పవన్‌కళ్యాణ్‌కు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. ‘నేను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? 2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె మాట్లాడారు.

News March 20, 2024

IPL-2024లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌

image

IPL-2024లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను తీసుకొస్తున్నారు. దీనివల్ల థర్డ్ అంపైర్‌కు నిర్ణయాలు తీసుకోవడం ఈజీ కానుంది. 8 హైస్పీడ్ కెమెరాలు తీసే వీడియోలను హాక్ ఐ ఆపరేటర్ల ద్వారా థర్డ్ అంపైర్ చూస్తారు. గతంలో కంటే ఎక్కువ దృశ్యాలను వివిధ కోణాల్లో చూసే అవకాశం ఉంటుంది. కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సాయపడనుంది. అంపైర్లకు ఇటీవలే దీనిపై శిక్షణనిచ్చారు. ఈ విధానాన్ని ఇప్పటికే ‘ద హండ్రెడ్’ టోర్నీలో వాడారు.

News March 20, 2024

‘పుష్ప-2’లో రష్మిక లుక్ లీక్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ షూటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక లుక్ లీకైంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఈ ఫొటోను ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయడమే లక్ష్యంగా షూటింగ్ జరుగుతోంది.

News March 20, 2024

WW-2: 80 ఏళ్ల తర్వాత గుర్తించారు!

image

రెండవ ప్రపంచ యుద్ధంలో మిస్ అయిన సైనికుడు చనిపోయినట్లు 80 ఏళ్ల తర్వాత గుర్తించారు. 1944లో జర్మనీతో జరిగిన పోరాటం తర్వాత US సైనికుడు రీవ్స్ కనిపించలేదు. అయితే 1948లో హార్ట్‌జెన్ ఫారెస్ట్‌లో కొన్ని అవశేషాలను గుర్తించగా.. వాటిని బెల్జియంలోని సైనిక శ్మశాన వాటికలో ఖననం చేశారు. తాజాగా DNA టెస్ట్‌లో ఆ అవశేషాలు రీవ్స్‌వేనని నిర్ధారించారు. ఇంకా 72 వేల మందికి పైగా US సైనికులు ‘మిస్సింగ్’గానే ఉన్నారు.

News March 20, 2024

హసరంగ కోసం శ్రీలంక మాస్టర్ ప్లాన్..?

image

అంపైర్లతో దురుసు ప్రవర్తన కారణంగా శ్రీలంక స్పిన్నర్ హసరంగపై ఐసీసీ రెండు మ్యాచుల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాతో వన్డే సిరీస్‌ అనంతరం అతడు ఆడే 2 టెస్టులు లేదా 4 వన్డేలు/టీ20 మ్యాచులపై నిషేధం అమలవ్వాల్సి ఉంది. బంగ్లాతో టెస్టుల తర్వాత శ్రీలంక ఆడేది టీ20 వరల్డ్ కప్‌లోనే. దీంతో ఆ సమయంలో బ్యాన్ అవకుండా.. శ్రీలంక బోర్డు తెలివిగా టెస్టులకు అతడిని ఎంపిక చేసిందన్న వాదన నెట్టింట వినిపిస్తోంది.

News March 20, 2024

రేషన్‌కార్డులు ఇవ్వాలని ఆదేశం

image

ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికులకు రేషన్‌కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో.. 2 నెలల్లో కార్డులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలిచ్చింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్దేశించిన కోటాతో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.

News March 20, 2024

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

image

లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈనెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈనెల 28న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈనెల 30తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏప్రిల్ 19న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది.

News March 20, 2024

పెరగనున్న ఈ-స్కూటర్ల ధరలు!

image

ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు 10% వరకు పెరగనున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్-2024లో కేంద్రం మార్పులు చేయడం, ఫేమ్-2 స్కీమ్ గడువు ఈనెలాఖరుతో ముగియనుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ స్కీమ్ కింద బైక్‌లపై ₹5,000 నుంచి ₹10వేల వరకు సబ్సిడీ లభిస్తోంది. ఇప్పుడు దీని గడువు ముగియనున్న నేపథ్యంలో బైక్ తయారీ సంస్థలు ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది

News March 20, 2024

లోక్ సభ ఎలక్షన్స్: భువనగిరి నుంచి సీపీఎం పోటీ?

image

TG: లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని సీపీఎం యోచిస్తోంది. మల్లు లక్ష్మి, నంద్యాల నర్సింహారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలలో ఒకరిని బరిలో నిలపనున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికతో పాటు రాష్ట్రంలోని మిగతా స్థానాల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపై పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.