India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సురక్షితంగా, తక్కువ ధరతో గమ్యస్థానాన్ని చేరేందుకు ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, ఏ ట్రైన్ ద్వారా గతేడాది రైల్వేశాఖకు అధిక లాభాలొచ్చాయో తెలుసా? హజ్రత్ నిజాముద్దీన్ – KSR బెంగళూరు మధ్య నడిచే బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ (22692) 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. 5,09,510 మంది ఈ రైలులో ప్రయాణించగా రూ.1,76,06,66,339 వచ్చాయి.
TG: లైంగిక వేధింపుల <<14112127>>కేసులో<<>> కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదు చేసిన FIRలో బాధితురాలు సంచలన విషయాలు వెల్లడించారు. ‘2017లో ఢీ షోలో జానీ మాస్టర్‌తో పరిచయమైంది. 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా నియమించుకున్నారు. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు నాపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. మతం మార్చుకొని అతడిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు’ అని తెలిపారు.
షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద ప్రకటన చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థకు ముగింపు పలకాలన్న రాహుల్ గాంధీ నాలుకను కోసి తెచ్చినవారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఒకవైపు రిజర్వేషన్లు పెంచాలని చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దీంతో ఆయన నిజం రూపం ఏంటో బయటపడిందన్నారు. అయితే సంజయ్ వ్యాఖ్యలకు మహారాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలు గడించాయి. US ఫెడ్ రేట్ల కోత అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడిన సానుకూల సంకేతాలతో దక్కిన ఆరంభ లాభాలు చివరిదాకా నిలవలేదు. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 82,988 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 25,383 వద్ద నిలిచాయి. సెన్సెక్స్ 83,185 వద్ద, నిఫ్టీ 25,445 వద్ద బలమైన రెసిస్టెన్స్‌ను ఎదుర్కొని రివర్సల్ తీసుకున్నాయి.
ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దునిత్ వెల్లలాగే నిలిచారు. ఆగస్టులో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనకు ఈ అవార్డు లభించింది. మరోవైపు శ్రీలంకకే చెందిన మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐసీసీ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచారు. కాగా గత నెలలో వెల్లలాగే టీ20ల్లో దుమ్ములేపారు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 106 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తన స్నేహితులతో కలిసి అమెరికన్ ఫుట్‌బాల్ గేమ్‌కు హాజరయ్యారు. ఆయన సన్నిహితుల్లో ఒకరైన హితేశ్ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మహీతో పాటు ఫెడ్‌ఎక్స్ సీఈఓ రాజ్ సుబ్రమణియం కనిపిస్తున్నారు. కాగా.. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్-2025లో ధోనీ ఆడతారా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
AP: అమరావతిలో నిర్మాణాల కోసం డిసెంబర్ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ‘రాజధానిలో 360 కి.మీ మేర రోడ్లు నిర్మిస్తాం. గతంలో నిర్మించిన భవనాలు దెబ్బతినలేదని IIT నిపుణులు నివేదికిచ్చారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌తో పాటు పంపింగ్ స్టేషన్లు డిజైన్ చేశాం. మొత్తం ఆరు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ పూర్తయితే అమరావతిలో వరద సమస్య ఉండదు’ అని తెలిపారు.
రెస్టారెంట్ల మెనూలు, ప్రమోషనల్ మెటీరియల్స్‌లో ఏఐతో సృష్టించిన చిత్రాలు వాడకుండా జొమాటో నిషేధం విధించింది. డిజిటల్ మార్కెట్ ప్లేస్‌లో ఈ నిర్ణయం తీసుకున్న మొదటి కంపెనీగా నిలిచింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ పాటించకుంటే యాప్‌లో రెస్టారెంట్ పేర్లను తొలగిస్తామని హెచ్చరించింది. జొమాటోకు 276000 రెస్టారెంట్ పాట్నర్స్ ఉండగా అందులో 10% కొంత, 2% పూర్తిగా AI ఫుడ్ ఇమేజెస్‌నే వాడుతున్నాయి.
జపాన్‌కు చెందిన టోమికో ఇటూకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డులకెక్కారు. ఆమె నేటితో 116 ఏళ్ల 116 రోజులు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను కలిసి సర్టిఫికెట్‌ను అందజేసింది. టోమికో తన వందో ఏట కూడా వాకింగ్ స్టిక్ సహాయం లేకుండానే ఆషియా పుణ్యక్షేత్రం మెట్లను ఎక్కారు. 117 ఏళ్ల మరియా బ్రన్యాస్ మోరేరా చనిపోయిన తర్వాత టోమికో అత్యంత వృద్ధురాలిగా నిలిచారు.
PM మోదీ నేతృత్వంలో NDA మూడోసారి అధికారం చేపట్టి మంగళవారం నాటికి 100 రోజులు పూర్తికానున్నాయి. గత 3 నెలల్లో రైలు, రోడ్డు, పోర్ట్, విమానయాన రంగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. 25K గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి సాయంగా రూ.49 వేల కోట్ల నిధుల పంపిణీకి, మరో ₹50K కోట్ల పెట్టుబడితో రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే ప్రాజెక్టులను ఆమోదించినట్టు తెలిపింది.
Sorry, no posts matched your criteria.