India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట ‘రాహుల్ గాంధీ తండ్రి’ విగ్రహం పెడతారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా? ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా? ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్ఛమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా?’ అని Xలో పోస్ట్ చేశారు.
పదేళ్లకు ఒకసారి చేపట్టాల్సిన జనాభా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2020లోనే జనగణన చేపట్టాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. ఇదే సమయంలో కులగణనకు అవకాశం ఉంటుందా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జనగణనలో భాగంగా టెలిఫోన్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సైకిల్, బైక్, కారు, గ్యాస్ కనెక్షన్, సొంత ఇల్లు ఉన్నాయా? అనే వివరాలను తెలుసుకోనున్నారు. 2011లో చివరిగా జనాభా లెక్కలు తీశారు.
పేరుకు తగ్గట్టే ‘క్విక్ కామర్స్’ వేగంగా వృద్ధి చెందుతోంది. 2024 జూన్ నాటికి ఇ-కామర్స్ మార్కెట్ 20% పెరిగితే అందులో గ్రాసరీ సేల్స్ 38% ఎగిశాయి. ఇందుకు క్విక్ కామర్సే కారణం. కరోనాతో ఈ యాప్‌ల క్రేజ్ పెరిగింది. FMCG కంపెనీల ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సేల్స్ ఛానల్ ఇదే. ఆన్‌లైన్ గ్రాసరీ సేల్స్‌లో 40% వీటి ద్వారానే జరుగుతోంది. 2021-23లో 230% వృద్ధి చెందిన ఈ రంగం ఈFYలో 85%పెరిగి $6 బిలియన్లను తాకుతుందని అంచనా.
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల కేసులో మెయిన్ సస్పెక్ట్‌ను FBI అరెస్టు చేసింది. అతడి పేరు రియాన్ వెస్లీ రౌత్ (57) అని, గతంలో నిర్మాణ కూలీగా పనిచేసేవాడని, మిలిటరీ బ్యాగ్రౌండేమీ లేదని తెలిసింది. ఆయుధాలు వాడాలని, యుద్ధాల్లో పాల్గొనాలన్న ఉబలాటం ఉందని అతడి సోషల్ మీడియా అకౌంట్లను బట్టి విశ్లేషిస్తున్నారు. 2002లో గ్రీన్స్‌బొరోలోని ఓ భవంతిలోకి ఆటోమేటిక్ గన్ తీసుకెళ్లి బారికేడ్లు వేసుకున్న కేసు అతడిపై ఉంది.
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారిస్తున్నారు. లాయర్ సమక్షంలో నిన్న, ఇవాళ దాదాపు 30 ప్రశ్నలు అడగగా, కొన్ని ప్రశ్నలకు ఆయన తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. రెండో రోజు కస్టడీలో భాగంగా నేడు ఉ.8 నుంచి ఉ.9:30 వరకు విచారణ జరిగింది. ఉ.10:30 తర్వాత ఆయనను పోలీసులు మళ్లీ విచారించనున్నారు.
TG: ఓ మహిళ ఫిర్యాదుతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం PSలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆయన దగ్గరే అసిస్టెంట్‌గా పనిచేస్తున్న MPకి చెందిన మహిళ ఔట్ డోర్ షూటింగ్స్‌లో మాస్టర్ తనను వేధించాడని, అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఫిర్యాదులో పేర్కొంది. అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై జానీ మాస్టర్ ఇంకా స్పందించలేదు.
ఓలా స్కూటర్‌పై బెంగళూరుకు చెందిన నిషా అనే యువతి చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ స్కూటర్ ఓ డబ్బా అంటూ ఆమె మండిపడ్డారు. సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాసిన ఓ ప్లకార్డును బైక్‌కు కట్టి ఫొటో తీశారు. ‘దయచేసి ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ కొనొద్దు. ఓ స్మార్ట్ ఫోన్ అటాచ్ చేసిన డబ్బా అది. 10 నెలల్లో 3సార్లు రిపేర్లు వచ్చాయి. సిగ్గుండాలి ఓలాకి’ అని దానిపై రాశారు.
US మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రముఖుల భద్రతపై చర్చ జరుగుతోంది. ఆ దేశ చరిత్రలో ఏకంగా నలుగురు అధ్యక్షులు- అబ్రహాం లింకన్(1865), జేమ్స్ గార్ఫీల్డ్(1881), విలియం మెకిన్లే(1901), జాన్ ఎఫ్ కెన్నెడీ(1963) హత్యకు గురయ్యారు. మరో నలుగురు రూజ్‌వెల్ట్(1912), గెరాల్డ్ ఫోర్డ్ (1975), రొనాల్డ్ రీగన్(1981), ట్రంప్(2024)(అధ్యక్ష అభ్యర్థి) హత్యాయత్నం నుంచి బయటపడ్డారు.
TG: ప్రమాదాలు జరిగినప్పుడు 108 అంబులెన్సులు 8 నిమిషాల్లోనే బాధితుల వద్దకు చేరుకునేలా ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంబులెన్సుల సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం. అలాగే హైవేలపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు దగ్గర్లో అంబులెన్సులను మోహరించాలని యోచిస్తోంది. అంబులెన్సు లేట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.
బెంచ్‌మార్క్ సూచీలు రికార్డు గరిష్ఠాల్లో మొదలయ్యాయి. మంగళవారం మీటింగులో US ఫెడ్ వడ్డీరేట్ల కోతను ఆరంభిస్తుందన్న సంకేతాలు మార్కెట్లను నడిపిస్తున్నాయి. ఎర్లీ ట్రేడ్‌లో నిఫ్టీ 62పాయింట్ల లాభంతో 25,418 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 219 పాయింట్లు పెరిగి 83,112 వద్ద చలిస్తోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 41:9గా ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, NTPC, హిందాల్కో, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్.
Sorry, no posts matched your criteria.