news

News September 16, 2024

వైద్య రంగంపై ప్రభుత్వం ఫోకస్.. రూ.5వేల కోట్లతో ప్రతిపాదనలు!

image

TG: వైద్య, ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న పలు కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹4,944కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని కేంద్రానికి పంపి నిధుల కోసం వరల్డ్ బ్యాంకు సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ట్రామాకేర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు, డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది.

News September 16, 2024

బుమ్రాలాంటి బౌలర్ తరానికొక్కరే ఉంటారు: అశ్విన్

image

టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. అలాంటి బౌలర్ తరానికొక్కరే వస్తారని, వారి గొప్పదనాన్ని అందరూ గుర్తించాలని అభిప్రాయపడ్డారు. ‘భారత్ ఎప్పుడూ బ్యాటర్లకే స్టార్ స్టేటస్ ఇస్తుంటుంది. అది ఎప్పటికీ మారదు. కానీ బౌలర్ అయిన బుమ్రాకు కూడా గౌరవం దక్కుతుండటం ఆనందంగా ఉంది. నా దృష్టిలో ప్రస్తుతం అతడే అత్యంత విలువైన భారత క్రికెటర్’ అని పేర్కొన్నారు.

News September 16, 2024

జీడీపీ కోసం బిగ్‌బాస్కెట్, బ్లింకిట్ డేటా!

image

GDPని లెక్కించేందుకు బేస్‌ఇయర్ కీలకం. 2011-12గా ఉన్న దీనిని 2023/24కు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే వినియోగ సరళిలో మార్పులు, ఎకనామిక్ యాక్టివిటీ వేగం తెలుసుకొనేందుకు బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ వంటి యాప్స్‌లో కొనుగోళ్లను పరిశీలించనుంది. ప్రస్తుతం ఒక కుటుంబానికి అవసరమైన గ్రాసరీస్‌లో 6% వీటి ద్వారానే కొంటున్నారని అంచనా. GST డేటానూ తీసుకుంటే GDP గణాంకాలు పక్కాగా ఉంటాయని కేంద్రం భావిస్తోంది.

News September 16, 2024

మోదీజీ.. RR ట్యాక్స్‌పై చర్యలేవీ?: KTR

image

తెలంగాణలో కాంగ్రెస్ అవినీతిపై చర్యలేవి అంటూ PM మోదీని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో అడిగారు. ‘మీరు RR ట్యాక్స్ గురించి మాట్లాడి 4 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడానికి ఏమైనా కారణం ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ అవినీతి చేస్తుందని మీరు అంటారు. మీ సహచరులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం నోరెత్తరు. వారు మీతో ఏకీభవించరా? లేక మీ విమర్శ ఎన్నికల స్టంటా?’ అని ప్రశ్నించారు.

News September 16, 2024

వరద ప్రభావిత ప్రజలకు జాగ్రత్తలు

image

AP: విజయవాడ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక సూచనలు చేసింది. ‘వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. కాచి, చల్లార్చి, వడపోసిన నీరే తాగాలి. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలి. అత్యవసరమైతే 108కి ఫోన్ చేయండి’ అని సూచించింది.

News September 16, 2024

భారీగా పెరిగిన నూనెల ధరలు.. మీరూ కొన్నారా?

image

వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో ముందు జాగ్రత్తగా 5 లీటర్ల క్యాన్లు, 5-6 ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. సగటున అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటరుపై రూ.15-20 వరకు పెరిగాయి. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి మరింత ధరకు అమ్ముతున్నారు. ధరలు పెరుగుతాయనే భయంతో మీరూ ముందుగానే కొనుగోలు చేశారా?

News September 16, 2024

26న ఓటీటీలోకి ‘సరిపోదా శనివారం’?

image

వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా <<14109733>>కలెక్షన్లు<<>> సాధించి సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, విలన్ పాత్రలో SJ సూర్య మెప్పించారు.

News September 16, 2024

Beautiful: అభిమానులతో ఐశ్వర్యారాయ్ సెల్ఫీ

image

దుబాయ్ వేదికగా జరుగుతున్న SIIMA వేడుకల్లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ మెరిశారు. తన కూతురితో కలిసి హాజరైన ఆమె స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. అక్కడ అభిమానుల కోరిక మేరకు తానే స్వయంగా సెల్ఫీ ఫొటో తీశారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐశ్వర్య సింప్లిసిటీకి ఇది నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు చేయడం తగ్గించినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని పేర్కొంటున్నారు.

News September 16, 2024

విరాట్ నా కెప్టెన్సీలో ఆడినవారే: RJD నేత తేజస్వీ యాదవ్

image

విరాట్ కోహ్లీ ఒకప్పుడు తన కెప్టెన్సీలో ఆడారని RJD నేత, లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్ అన్నారు. టీమ్ఇండియాలోని స్టార్లలో చాలామంది తన బ్యాచ్‌మేట్స్ అని పేర్కొన్నారు. ‘నేనో క్రికెటర్‌ను. దేశవాళీలో విరాట్ నా కెప్టెన్సీలో ఆడారు. దీని గురించి ఎవరైనా మాట్లాడారా? అసలెందుకు మాట్లాడరు? ఒక ప్రొఫెషనల్‌గా నేను చక్కని క్రికెట్ ఆడాను. నా మోకాలి లిగమెంట్స్ ఫ్రాక్చర్ అవ్వడంతో ఆటకు దూరమయ్యాను’ అని చెప్పారు.

News September 16, 2024

అమెరికాలో హింసకు చోటు లేదు: బైడెన్

image

అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు జరగడంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. USలో ఎటువంటి హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘ఘటనపై అధికారులతో మాట్లాడాను. ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ట్రంప్‌ సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊరట కలిగింది. సీక్రెట్ సర్వీస్ చేస్తున్న కృషి అభినందనీయం. ట్రంప్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించాను’ అని పేర్కొన్నారు.