news

News March 19, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: మార్చి 19, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:09
సూర్యోదయం: ఉదయం గం.6:21
జొహర్: మధ్యాహ్నం గం.12:24
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:27
ఇష: రాత్రి గం.07.39
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 19, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 19, మంగళవారం,
ఫాల్గుణము
శుద్ధ దశమి: రాత్రి 12:22 గంటలకు
పునర్వసు: రాత్రి 10:10 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:39-09:27 గంటల వరకు,
రాత్రి 11:02-11:50 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 07:10-08:54 గంటల వరకు

News March 19, 2024

హీరో యశ్ సరసన 43 ఏళ్ల హీరోయిన్?

image

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ నుంచి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించినట్లు టాక్. 43 ఏళ్ల కరీనా ఈ మూవీతో సౌత్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మూవీని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.

News March 19, 2024

TODAY HEADLINES

image

* బీజేపీకి అధికారమిస్తే TGను మరింత అభివృద్ధి చేస్తాం: మోదీ
* TG: గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
* దళిత బంధుతో ఎదురుదెబ్బ: కేసీఆర్
* BRSలో చేరిన ప్రవీణ్ కుమార్
* AP: అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది: జగన్
* జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డారు: CBN
* ‘ప్రజాగళం’ పూర్తిగా విఫలం: సజ్జల
* లిక్కర్ స్కామ్‌లో 15 మంది అరెస్టు: ఈడీ

News March 18, 2024

ALERT: మీలో ఈ లక్షణాలున్నాయా?

image

గ్లాకోమా.. కంటి జబ్బుల్లో అత్యంత ప్రమాదకరమని, కంటిచూపును క్షీణింపజేస్తూ చివరికి శాశ్వత అంధత్వాన్ని తీసుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు. గ్లాకోమా సంకేతాలు, లక్షణాలు ఉంటే వెంటనే తొలి దశలోనే చికిత్స చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. తీవ్రమైన తలనొప్పి, కళ్లు తరచూ ఎరుపు రంగులోకి మారడం, తరచూ కళ్లద్దాలు మార్చాల్సి రావడం, కంటి నొప్పి వంటివి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని కోరింది.

News March 18, 2024

పాకిస్థాన్‌లోనూ ప్రధాని మోదీ పేరుతో మెసేజ్‌లు

image

ఇండియాలో ప్రధాని మోదీ పేరుతో వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ మెసేజ్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లోనూ చాలామందికి ఈ మెసేజ్ వస్తున్నాయట. పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉంటున్న వారి ఫోన్లకు సైతం ఈ మెసేజ్ వచ్చినట్లు వారు చెబుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న పాకిస్థాన్ జర్నలిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ మెసేజ్ మీకు వచ్చిందా?

News March 18, 2024

దర్శక ధీరుడికి 83 ఏళ్ల ఫ్యాన్ స్పెషల్ గిఫ్ట్

image

RRR సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళికి జపాన్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా జపాన్‌లో ఓ వృద్ధురాలు రాజమౌళి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్‌లో తెలియజేశారు. ‘రాజమౌళి గారు.. జపాన్‌కు స్వాగతం. నాకు 83 ఏళ్లు. నేను RRRతో డాన్స్ చేయాలని ప్రతిరోజు అనుకుంటున్నా’ అని బహుమతిపై ఆ ఫ్యాన్ పేర్కొన్నారు. తమకు ఇష్టమైన వారు ఆయురారోగ్యాలతో ఉండాలని జపాన్‌లో ఈ బహుమతులు ఇస్తుంటారు.

News March 18, 2024

స్లీపర్ క్లాస్‌లో ఇదీ పరిస్థితి!

image

గత కొన్ని నెలలుగా భారతీయ రైల్వేలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనరల్ బోగీలను తగ్గించడంతో స్లీపర్ బోగీల్లో విపరీతమైన రద్దీ ఉంటోందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనివల్ల స్లీపర్ బుక్ చేసుకుని, లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నిలబడేందుకూ ప్లేస్ ఉండట్లేదని, 3ACలోనూ అదే పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. వందేభారత్ లాంటి ప్రీమియర్ రైళ్లతో పాటు సామాన్యుల రైళ్లనూ పట్టించుకోవాలని కోరుతున్నారు.

News March 18, 2024

ఛార్జింగ్ కేబుల్‌‌కు టేప్ అంటించి వాడుతున్నారా?

image

చాలామంది ఛార్జింగ్ కేబుల్ పాడై, వైర్లు బయటికి వచ్చినా టేపు అంటించి వాడుతుంటారు. అలా చేయడం ప్రమాదమని UKలోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లో తేలింది. తాత్కాలికంగా రిపేర్ చేసిన ఛార్జర్లు వాడితే ఫోన్ పేలిపోవడంతో పాటు మనకు షాక్ కొట్టే ప్రమాదం ఉందట. ఇలాంటి ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. నకిలీ/తక్కువ నాణ్యత ఉన్న ఛార్జర్లు కూడా వాడటం మంచిది కాదని తెలిపింది.