India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న, HYD మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు.
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రెబల్‌గా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తనవైపే ఉన్నారని అన్నారు. విజయం సాధించి అధికార పార్టీతో కలిసి పని చేస్తానని తెలిపారు. తన వెనుక వైసీపీ ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కాగా ఈ సీటును మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే టీడీపీ అధిష్ఠానం కేటాయించింది.
హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొంది. 23న హైదరాబాద్-ధనపూర్, 25న సంత్రాగచి-సికింద్రాబాద్, 26న ధనపూర్-హైదరాబాద్, 24న సంత్రాగచి-చెన్నై సెంట్రల్, 27న పట్నా-కోయంబత్తూర్ మధ్య రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 59,236 మంది భక్తులు దర్శించుకోగా 25,446 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది.
AP: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పోర్టులో పట్టుబడ్డ డ్రైఈస్ట్ నుంచి శాంపిల్స్ సేకరించిన CBI డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించింది. ఇందులో ప్రాథమికంగా OPM, కొకైన్, హెరాయిన్ ఉన్నట్లు గుర్తించింది. దీంతో మరింత లోతుగా విచారణ చేస్తోంది. సంధ్యా ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య మెయిల్‌లను పరిశీలిస్తోంది. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అవినీతిపై పోరాటంతో ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి మకిలికి బలవుతోంది. ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ తరహాలోనే కేజ్రీవాల్ కూడా ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చేలా కనిపించడం లేదు. దీంతో బయట పార్టీని నడిపించడానికి నేతలు కరవయ్యారు. అతిశీ, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ పేర్లు వినిపిస్తున్నా.. వారికి పాలనా అనుభవం అంతంతే. రాజకీయంగానూ BJPకి ఎదురొడ్డి నిలబడటం కత్తి మీద సామే.
AP: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎండలు విపరీతంగా ఉన్నందున కూలీలు అనారోగ్యానికి గురికాకుండా ఉదయం 5.30 నుంచి 10.30 వరకే పనులను నిర్వహించాలని సూచించారు. జూన్ నెలాఖరు వరకు కరవు మండలాల్లో తాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచినీటి పథకాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాంతార: చాప్టర్-1లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, లుక్ టెస్టులో ఆమె పాల్గొన్నారని తెలుస్తోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో నటనతో ఆమె మెప్పించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ షూటింగ్ వేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
TG: హోళీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఎల్లుండి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. రహదారులపై గుంపులుగా తిరిగినా కేసులు నమోదు చేయనున్నారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని పోలీసులు హెచ్చరించారు.
రష్యాలోని ఓ షాపింగ్ మాల్‌లో ఉగ్రవాదుల నరమేధంతో 62 మంది పౌరులు <<12907109>>మరణించడం<<>> సంచలనంగా మారింది. మాస్కోలో 2002 తర్వాత ఇదే అతిపెద్ద దాడి. 1999లో ఓ భవనంపై టెర్రరిస్టులు దాడి చేయడంతో ఒకే రోజు 118 మంది మరణించారు. రెండు వారాలపాటు సాగిన కాల్పుల్లో మొత్తం 293 మంది చనిపోయారు. 2002లో ఓ థియేటర్‌లో దాడి జరగగా 130 మంది దుర్మరణం పాలయ్యారు. 2003లో 15, 2004లో 41, 2010లో 40, 2011లో 37 మంది చనిపోయారు.
Sorry, no posts matched your criteria.