news

News March 23, 2024

జైల్లో కార్యాలయం ఏర్పాటుకు అనుమతి తీసుకుంటాం: పంజాబ్ సీఎం

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలిస్తారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. జైల్లో కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పారు. ‘జైలుకు వెళ్లినంత మాత్రాన నేరస్థుడు కాదని చట్టం చెబుతోంది. కాబట్టి సర్కారును నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని సుప్రీం, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’ అని తెలిపారు.

News March 23, 2024

కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా యంగ్ హీరోయిన్?

image

హీరోయిన్ నేహా శర్మ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఛాన్సుంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బిహార్‌లోని భగల్‌పూర్ సీటు కాంగ్రెస్‌కు వస్తే తాను లేదా తన కూతురు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆమె తండ్రి అజయ్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఆయన భగల్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాము పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సంప్రదిస్తున్నట్లు ఆయన మీడియాతో చెప్పారు.

News March 23, 2024

BREAKING: సీఎంకు మరో షాక్

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. సీఎం అరెస్టు, కస్టడీపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. కాగా, ఈడీ మార్చి 28 వరకు కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి, వెంటనే ఆయనను విడుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

News March 23, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు GOOD NEWS

image

TS: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండో విడత ట్రైనింగ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుందని TSSP ప్రకటించింది. తొలి దశలో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభం కాగా, సరిపడా వసతులు లేకపోవడంతో మిగతా వారి ట్రైనింగ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు వసతులు కల్పించామని, 4250 మంది కానిస్టేబుళ్లకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని TSSP తెలిపింది.

News March 23, 2024

త్వరలో భారత్‌లోకి వెయిట్‌లాస్ ఇంజెక్షన్స్!

image

బేరియాట్రిక్ సర్జరీతో పనిలేకుండా ఊబకాయులు బరువు తగ్గేందుకు భారత్‌లో త్వరలో ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యూఎస్‌లో ఆమోదం పొందిన సెమాగ్లుటైడ్, వెగోవీ ఇంజెక్షన్స్ సహా 7 రకాల కొత్త ఔషధాలు క్లినికల్ ట్రయల్స్‌కు రిజిస్టర్ చేసుకున్నాయి. సెమాగ్లుటైడ్, మౌంజారో డయాబెటిక్ కోసం.. వెగోవీ, జెప్‌బౌండ్ వెయిట్‌లాస్ కోసం అందుబాటులోకి రానున్నాయి. వీటితో దాదాపు 20% వరకు బరువు తగ్గొచ్చట.

News March 23, 2024

కేంద్రంపై సుప్రీంకోర్టుకు వెళతాం: కర్ణాటక CM

image

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నామని కర్ణాటక సీఎం సిద్ద రామయ్య వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల కోసం ఇప్పటికే చాలాకాలం ఎదురుచూశామని ఆయన అన్నారు. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు కేంద్రం నిధులు విడుదల చేయాలని, కానీ కేంద్రం చట్టాన్ని అతిక్రమిస్తోందని అన్నారు. ఇది ఎన్నికల అంశం కాబోదని ఆయన పేర్కొన్నారు.

News March 23, 2024

ఢిల్లీపై పంజాబ్ విజయం

image

కొత్త హోం గ్రౌండ్‌లో పంజాబ్ తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేసింది. చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 175 రన్స్ టార్గెట్‌తో ఛేదనకు దిగిన పంజాబ్‌ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.. సామ్ కరన్ (63) హాఫ్ సెంచరీతో రాణించారు. పంజాబ్ తన హోం గ్రౌండ్‌ను మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఇటీవల మార్చుకుంది.

News March 23, 2024

రామ్ చరణ్ బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్

image

హీరో రామ్ చరణ్ మార్చి 27న తన బర్త్ డే జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి ఆయన ఫ్యాన్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. చరణ్ కోసం సిద్ధం చేసిన కామన్ డిస్ప్లే పిక్చర్ (CDP)ని టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలతో విడుదల చేయించారు. ‘నా ప్రియమైన వ్యక్తి CDPని విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక వేడుకలు ప్రారంభిద్దాం’ అని నటుడు రానా ట్వీట్ చేశారు.

News March 23, 2024

కేజ్రీవాల్ CMగా కొనసాగడం చెత్త రాజకీయం: ఠాకూర్

image

లిక్కర్ స్కాం కేసులో ఈడీ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ పదవిలో కొనసాగడం సరికాదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వీటిని చెత్త రాజకీయాలు అని ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉంటే ఆయన స్థానంలో సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఆప్ లీడర్లు పోటీ పడుతున్నారని, కానీ.. ఈ రేసులోకి కేజ్రీవాల్ భార్య కూడా చేరారని బీజేపీ మంత్రి అన్నారు.

News March 23, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, SIBలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని 8 గంటలపాటు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.