news

News March 23, 2024

ప్చ్.. భువీ కెరీర్‌లో అరుదైన రికార్డు మాయం

image

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ పేరిట ఓ అరుదైన రికార్డు ఉండేది. టీ20 క్రికెట్లో ఒక్క నోబాల్ కూడా వేయని పేస్ బౌలర్‌గా ఉన్న రికార్డు తాజాగా చెరిగిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున IPLలో ఆడుతున్న భువీ ఒక నోబాల్ వేశారు. కోల్‌కతాతో మ్యాచ్‌లో లైన్ దాటి(ఓవర్ స్టెప్) బౌలింగ్ వేయడంతో అంపైర్ నోబాల్ ప్రకటించారు. టీ20ల్లో భువనేశ్వర్‌కు ఇదే తొలి నోబాల్. ఈ మ్యాచ్‌లో 4ఓవర్లలో 51రన్స్ ఇచ్చారు.

News March 23, 2024

కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ఎందుకు స్పందించింది?

image

CM కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించడం, దానిపై భారత్ ప్రతిస్పందించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ముంగిట ఈ అరెస్ట్‌ను ఎలా చూస్తారు? అని జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి సెబాస్టియన్ ఫిస్చర్‌ను ఇక్కడి మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి స్పందనగా.. ‘అందరిలాగే కేజ్రీవాల్‌ కేసులో కూడా నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. న్యాయపరమైన సహాయ సహకారాలు అన్నీ అందాలి’ అని సెబాస్టియన్ అన్నారు.

News March 23, 2024

పోనీటెయిల్ లుక్‌తో ధోని.. ఫొటో చూశారా?

image

టీమ్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ పోనీటెయిల్ లుక్‌తో దర్శనమిచ్చారు. CSK క్యాంపులో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పొడవాటి జుట్టును పెంచిన తలా.. ఇటీవల కొత్త హెయిర్ స్టైల్‌లతో ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. కాగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచులో గెలిచిన CSK.. తన తర్వాతి మ్యాచును ఈనెల 26న గుజరాత్‌తో ఆడనుంది.

News March 23, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన అంశాలు

image

TG: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ప్రణీత్, అతని టీమ్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2kms దూరం నుంచే ట్యాపింగ్ చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఇద్దరూ ప్రణీత్‌తో కలిసి ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలున్నాయని వెల్లడించారు.

News March 23, 2024

రష్యాలో ఉగ్రదాడి.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్

image

రష్యాలో మారణహోమానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. మాస్కోలో జరిగిన ఉగ్రవాద ఘటన నేపథ్యంలో మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించాలని పిలుపునిచ్చారు. ఇది అనాగరిక ఉగ్రవాద చర్య అని, 11 మందిని అరెస్టు చేశామని చెప్పారు. ముష్కరులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని తనకు సమాచారం అందినట్లు పుతిన్ పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు 133 మంది మరణించారు.

News March 23, 2024

21 చోట్ల ‘మేమంతా సిద్ధం’ సభలు

image

AP: మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 4 ప్రాంతీయ ‘సిద్ధం’ సభలను నిర్వహించిన వైసీపీ.. రాష్ట్రంలోని 21 చోట్ల భారీ బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సభలకు ‘మేమంతా సిద్ధం’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది. ఈ నెల 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల, 29న ఎమ్మిగనూర్‌లో సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

News March 23, 2024

నీటి వాడకంపై బిగ్ వార్నింగ్

image

TS: హైదరాబాద్ మహానగరంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పలుచోట్ల నీటికొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో HMWS&SB నగరవాసులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. డ్రింకింగ్ వాటర్‌ను తాగేందుకు మాత్రమే ఉపయోగించాలని, ఇతర అవసరాలకు వాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెనాల్టీలు వేయడంతో పాటు నల్లా కనెక్షన్ తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.

News March 23, 2024

ఈ హోలీ చాలా హాట్ గురూ!

image

గతంతో పోలిస్తే ఈసారి హోలీ పండగకు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1970 నుంచి ఏటా మార్చి, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. మార్చి ఆఖరులో భానుడి భగభగలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. మార్చి ఆఖరి వారంలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటే ఛాన్స్ 1970ల్లో ఒక్క మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లోనే ఉండేదట. ఇప్పుడు ఈ జాబితాలో AP, తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు చేరాయట.

News March 23, 2024

రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న పాక్ క్రికెటర్

image

పాక్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్‌ యూటర్న్ తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు. ‘PCB అధికారులను కలిశాక నా మనసు మార్చుకున్నా. పొట్టి ఫార్మాట్‌లో నా అవసరాన్ని గుర్తించినందుకు సంతోషిస్తున్నా. జూన్‌లో జరగనున్న T20WC ఆడేందుకు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నా. పాకిస్థాన్‌కు ట్రోఫీ అందించేందుకు నా వంతు కృషి చేస్తా’ అని ఇమాద్ వసీమ్‌ ట్వీట్ చేశారు.

News March 23, 2024

టీడీపీ వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్: బొండా ఉమా

image

AP: చంద్రబాబు ఇవాళ నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ చేశారని బొండా ఉమా ఆరోపించారు. ట్యాపింగ్ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని పట్టుకున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఐజీ పంపితేనే వచ్చానని పట్టుబడిన కానిస్టేబుల్ చెప్పాడని, ఉన్నతాధికారి సీతారామాంజనేయులు నేతృత్వంలో ట్యాపింగ్ జరుగుతోందని బొండా ఉమా ఆరోపించారు.