news

News March 22, 2024

పంజాబ్‌లో 120+ ఏళ్ల ఓటర్లు 205 మంది

image

సెంచరీ దాటి 20 ఏళ్లయినా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు పంజాబ్ కురువృద్ధులు. అక్కడ 120 ఏళ్లు దాటిన ఓటర్లు ఏకంగా 205 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిబిన్ వెల్లడించారు. వారిలో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. 100 నుంచి 119 ఏళ్ల వయసున్న వారు 5,004 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో పురుషులు 1,976 మంది, మహిళలు 3,028 మంది ఉన్నారన్నారు.

News March 22, 2024

బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారా?

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఖాతాల నుంచి రూ.లక్ష విత్‌డ్రా, డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది. ‘ఈ వివరాలను అన్ని బ్యాంకుల నుంచి అధికారులు తెప్పించుకోవాలి. వాటిని విశ్లేషించాలి. ఒకే బ్యాంక్ బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాలకు డబ్బుల బదిలీపై ఫిర్యాదులు వస్తున్నాయి’ అని ఈసీ పేర్కొంది.

News March 22, 2024

మనిషికి పంది కిడ్నీ మార్పిడి

image

ఓ మనిషికి వైద్యులు పంది కిడ్నీని అమర్చారు. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగింది. కిడ్నీలు ఫెయిలైన 62 ఏళ్ల రోగికి 4 గంటలపాటు సర్జరీ చేసి పంది కిడ్నీని అమర్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. కాగా ఈ ప్రయోగం మంచి ఫలితాలిస్తే ప్రపంచంలోని కిడ్నీ రోగులకు ఇది ఒక శుభవార్తేనని వైద్యులు అంటున్నారు.

News March 22, 2024

ELECTORAL BONDS: BRSకు ‘కిటెక్స్’ విరాళం

image

ఎలక్టోరల్ బాండ్స్‌లో బీఆర్ఎస్ పార్టీకి కేరళకు చెందిన టెక్స్‌టైల్ గ్రూప్ ‘కిటెక్స్’ రూ. 25 కోట్లు విరాళంగా ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ నెలలో బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు విరాళం ఇవ్వడం గమనార్హం. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలిలో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు కోసం రైతుల నుంచి సేకరించిన 187 ఎకరాల భూమిని ప్రభుత్వం కిటెక్స్‌కు కేటాయించింది.

News March 22, 2024

ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు

image

TG: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిల్‌పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించింది. బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.

News March 22, 2024

కాళేశ్వరంపై కొనసాగుతోన్న NDSA విచారణ

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాలపై NDSA బృందం విచారణ కొనసాగుతోంది. బ్యారేజీ నిర్మాణాల్లో లోపాలతో పాటు పలు అంశాలపై సంబంధిత అధికారులను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ గత 2 రోజులుగా విచారిస్తోంది. బ్యారేజీల డిజైన్లలో తేడాలెందుకు ఉన్నాయని, పనుల ప్రారంభానికి ముందు భూగర్భ పరీక్షల్లో ఏమేం గుర్తించారని ప్రశ్నించింది. ఇవాళ చివరి రోజు రాష్ట్ర డ్యామ్ కమిటీతో భేటీ కానుంది.

News March 22, 2024

TDP ఎంపీ అభ్యర్థుల జాబితా..

image

✒ శ్రీకాకుళం- రామ్మోహన్, ✒ విశాఖ- భరత్
✒ అమలాపురం- హరీశ్ ✒ ఏలూరు- మహేశ్ యాదవ్
✒ విజయవాడ కేశినేని చిన్ని ✒ గుంటూరు- పి.చంద్రశేఖర్
✒ నరసరావుపేట- లావు శ్రీకృష్ణదేవరాయలు
✒ బాపట్ల- టి.కృష్ణప్రసాద్, ✒ నెల్లూరు- వేమిరెడ్డి
✒ చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
✒ కర్నూలు- పంచలింగాల నాగరాజు
✒ నంద్యాల- బైరెడ్డి శబరి
✒ హిందూపురం- బీకే పార్థసారథి

News March 22, 2024

BREAKING: టీడీపీ మూడో జాబితా విడుదల

image

AP: ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 11 MLA, 13 MP స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పలాస- గౌతు శిరీష, పాత పట్నం- గోవిందరావు, శ్రీకాకుళం- గోండు శంకర్, Sకోట- కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ- వెంకటేశ్వరరావు, అమలాపురం-ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-కృష్ణ ప్రసాద్, నరసరావుపేట-అరవింద్‌బాబు, చీరాల- మాలకొండయ్య, సర్వేపల్లి-సోమిరెడ్డి.

News March 22, 2024

ఫిర్యాదుదారుడి వివరాలు బహిర్గతం.. ఇద్దరు సస్పెండ్

image

AP: ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేయడంతో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఏలూరు(D) ఉంగుటూరు మండలం రామచంద్రాపురంలో లైబ్రరీ, వాటర్ ప్లాంట్‌కు పార్టీ రంగులు ఉన్నాయంటూ స్థానికుడు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తెల్లరంగు వేయించారు. అయితే అతడి వివరాలు స్థానిక నాయకులకు చేరవేశారంటూ పత్రికల్లో కథనాలు రావడంతో.. కలెక్టర్ స్పందించి ఇద్దరిని సస్పెండ్ చేశారు.

News March 22, 2024

REWIND: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు

image

కొవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఆ తర్వాత క్రమంగా దాదాపు 2 నెలల పాటు లాక్‌డౌన్ కొనసాగింది. వైరస్‌ని కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని నుంచి కోలుకునేందుకు ఏడాది పట్టింది.