news

News March 20, 2024

రాహుల్ గాంధీపై ECకి BJP ఫిర్యాదు

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ECకి BJP ఫిర్యాదు చేసింది. ఆయన మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల ముంబైలో జోడోయాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ ‘హిందుత్వంలో శక్తి అనే పదం ఉంటుంది. అది ఎవరనేదే ఇక్కడ ప్రశ్న. మనం దాంతోనే పోరాటం చేస్తున్నాం. దాని ఆత్మ EVM, ED, CBI, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్లలో నిక్షిప్తమై ఉంది’ అని అన్నారు. దీనిపైనే BJP ఫిర్యాదు చేసింది.

News March 20, 2024

ఐపీఎల్ కోసం 50 ఫ్యాన్ పార్క్‌లు

image

ఐపీఎల్ సీజన్-17 కోసం దేశ వ్యాప్తంగా 50 ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మొదటి ఫ్యాన్ పార్క్‌ను ఈ నెల 22న మధురైలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మొదటి రెండు వారాలకు దేశంలోని 11 రాష్ట్రాలను ఫ్యాన్ పార్కులకు వేదికలుగా ఎంపిక చేయగా ఆ జాబితాలో తెలంగాణ ఉండగా, ఏపీ లేదు. మార్చి 30, 31 తేదీల్లో నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్‌ ఏర్పాటు చేయనున్నారు.

News March 20, 2024

వైసీపీని ఇంటికి సాగనంపాలి: చంద్రబాబు

image

AP: రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు పిలుపునిచ్చారు. దీని కోసం ప్రజలు ముందడుగు వేయాలన్నారు. జనం నమ్మకాన్ని జగన్ కోల్పోయారని.. ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నారని విమర్శించారు. సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలని కోరారు.

News March 20, 2024

ఇన్‌స్టాగ్రామ్ పని చేయట్లేదు

image

పలువురికి ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. యాప్ ఓపెన్ చేయగానే ఇమేజ్ లోడ్ అవ్వట్లేదని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20%కి పైగా యూజర్లు సమస్యలు ఎదురవుతున్నట్లు Xలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ సేవలు దాదాపు గంట పాటు నిలిచిపోయాయి. మరి మీకు కూడా ఈ సమస్య వస్తోందా? కామెంట్ చేయండి.

News March 20, 2024

ఈ వేగాన్ని అధిగమిస్తారా?

image

మరో రెండ్రోజుల్లో IPL-2024 స్టార్ట్ కానుండటంతో గత టోర్నీల్లోని రికార్డులు బ్రేక్ అవుతాయా? లేదా? అనేదానిపై చర్చ జరుగుతోంది. IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి రికార్డును 2011లో షాన్ టైట్ (157.71KMPH) నమోదు చేశారు. తర్వాతి స్థానాల్లో లాకీ ఫెర్గూసన్ (2022, 157.3KMPH), ఉమ్రాన్ మాలిక్ (2022, 157KMPH), అన్రిచ్ నోర్జే (2020, 156.22KMPH) ఉన్నారు. మరి ఈ ఏడాది టైట్ రికార్డ్ బ్రేక్ అవుతుందా? కామెంట్ చేయండి.

News March 20, 2024

గురుకులం 5వ తరగతి ఫలితాలు విడుదల

image

AP: రాష్ట్రంలోని డాక్టర్ B.R అంబేడ్కర్ గురుకులం 5వ తరగతి ప్రవేశ పరీక్ష-2024-25 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు <>apbragcet.apcfss.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఆధార్ నంబర్, పుట్టినతేదీ, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. త్వరలో గురుకులం ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.

News March 20, 2024

సీఏపై నారీమణుల ఆసక్తి

image

ఛార్టర్డ్ అకౌంటెంట్లుగా మహిళలు సత్తా చాటుతున్నారు. 2000 సంవత్సరంలో కేవలం 8శాతంగా ఉన్న వీరు ప్రస్తుతం 30శాతానికి పెరిగారు. ఇప్పుడు 8.63 లక్షల మంది CA విద్యార్థులుండగా వారిలో 43 శాతం ఆడవారే ఉన్నారు. కోర్సును చేసేందుకు ఉన్న సౌలభ్యం, చదివేందుకు అయ్యే ఖర్చు అందుబాటులో ఉండటం ప్రధాన ఆకర్షణలుగా మారాయి. కోర్సు పూర్తి చేసినవారికి భారీగా జీతభత్యాలు ఉండటం గమనార్హం.

News March 20, 2024

ఘోరం: వివాహితను ప్రేమించాడని..

image

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అమానవీయ ఘటన జరిగింది. వివాహితను ప్రేమించాడని ఓ యువకుడితో కొందరు యూరిన్ తాగించారు. దారుణంగా కొట్టి నాలుకతో షూస్ నాకించారు. అంతటితో ఆగకుండా యువకుడికి సగం గుండు, మీసం తీయించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన స్థానిక ఏఎస్పీ నితేశ్ భార్గవ బాధితుడి ఇంటికి వెళ్లగా అతడు అందుబాటులో లేడు. త్వరలోనే బాధితుడిని కలిసి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

News March 20, 2024

రాజ్ ఠాక్రే ఎంట్రీతో బీజేపీకి బలం చేకూరేనా?

image

400 లోక్‌సభ సీట్లే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటున్న BJP మహారాష్ట్రలో ‘ఠాక్రే’ బ్రాండ్‌పై కన్నేసింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)తో ఉన్న కూటమిలోకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (MNS)ను ఆహ్వానించింది. ఆ పార్టీ కలిస్తే BJPకి మరింత బలం చేకూరుతుందంటున్నారు విశ్లేషకులు. 2006లో విభేదాల వల్ల శివసేన నుంచి వైదొలగిన రాజ్ ఠాక్రే MNS స్థాపించారు.

News March 20, 2024

‘UBER’కు రూ.20వేల ఫైన్!

image

బుక్ చేసే సమయంలో చూపిన ఛార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేసినందుకు UBER కంపెనీకి కన్జూమర్ కోర్టు రూ.20వేల జరిమానా విధించింది. చండీగఢ్‌కు చెందిన ప్రశార్ 2021 ఆగస్టు 6న ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. 8.83కిలో మీటర్లకు రూ.359 చూపించగా.. గమ్యం చేరే సమయానికి రూ.1334కి చేరుకుంది. అతడి ఫిర్యాదును విచారించిన కోర్టు కస్టమర్ ఖాతాలో పదివేలు, లీగల్ ఎయిడ్ ఖాతాలో పదివేలు జమచేయాలని ఆదేశించింది.