India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమను చూసేందుకు మైదానానికి, నెట్స్ వద్దకు వచ్చే అభిమానులకు ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ చేసేందుకు వస్తారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ విసిరేయొద్దు. దయచేసి గ్రౌండ్‌ను క్లీన్‌గా ఉంచండి. చిన్న చిన్న విషయాలే. కానీ అన్నీ కలిపితే మొత్తంగా మెరుగవుతాం. అన్నీ మనం చేయగలిగినవే’ అని తెలిపారు. ఈ నెల 24న గుజరాత్‌తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.
మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తూ కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న క్లబ్ మహీంద్రాకు వెళ్లాలనుకుంటే.. మీకు ఒక సైన్ బోర్డు ఎదురవుతుంది. దానిపై ‘గూగుల్ తప్పు.. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకు వెళ్లదు’ అని రాసి ఉంటుంది. ట్రావెలర్స్ గూగుల్ మ్యాప్స్‌లో చూస్తూ క్లబ్ మహీంద్రాకు వెళ్లబోయి దారి తప్పుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అందరికీ చెప్పడం కష్టం కావడంతో.. అక్కడి స్థానికులు ఇలా బోర్డులు ఏర్పాటు చేశారు.
ప్రపంచాన్ని తమ నిఘా నీడలోకి తెచ్చే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేసింది. అంతరిక్షంలో వందల కొద్దీ శాటిలైట్లతో నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. ఈ మేరకు స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. 1.8 బిలియన్ డాలర్ల విలువతో ఈ ఉపగ్రహ వ్యవస్థ నిర్మితమవనుంది. ఇది పూర్తైతే ప్రపంచంలో ప్రతి మూలకు అమెరికా చూడగలుగుతుంది. ఇతర దేశాల రహస్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతుంది.
AP: ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న ప్రజాగళం బహిరంగసభకు కాసేపట్లో హాజరుకానున్నారు. పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
AP: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో మొబైల్‌తో కాపీయింగ్‌కు పాల్పడుతున్న అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి మొబైల్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి బయటి వ్యక్తులకు ఫోన్ చేసి సమాధానాలు రాస్తుండగా ఇన్విజిలేటర్ గుర్తించి పోలీసులకు అప్పగించారు.
బిగ్ బాస్ OTT2(హిందీ) విన్నర్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అక్రమంగా పాము విషం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కెమెరాతో షూట్ చేసినందుకు అతడిపై భౌతికంగా దాడికి పాల్పడటంతో వార్తల్లోకి ఎక్కారు. కాగా ఎల్విష్ వైల్డ్ కార్డ్‌లో వచ్చి టైటిల్ గెలుచుకున్న మొదటి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించారు.
ముంబై వెళ్లేందుకు సీఎం రేవంత్ ఎక్కిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ముంబైలో రాహుల్ న్యాయ్ యాత్ర సభకు వెళ్లేందుకు ఆయనతో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితర అగ్రనేతలు విమానం ఎక్కారు. అయితే, ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో గంట నుంచీ అందులోనే ఉండిపోయారు. దీంతో వారి ముంబై ప్రయాణం ఆలస్యం కానుంది.
ప్రముఖ నటి జయప్రదకు భారీ ఊరట లభించింది. ESIC కేసులో ఆమెకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐసీ కింద రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. జయప్రద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. దీనిపై మెట్రోపాలిటన్ కోర్టు శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించడంతో ఆమె సుప్రీంకు వెళ్లారు.
2 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. నిన్న విడుదల చేసిన షెడ్యూల్‌లో తొలుత జూన్ 4న కౌంటింగ్ ఉండగా.. ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్త కౌంటింగ్ తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 19న ఇరు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.
AP: చిలకలూరిపేట బొప్పూడిలో జరిగే TDP-JSP-BJP సభపై వైసీపీ Xలో మండిపడింది. ‘నాడు 650 హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టోను అటకెక్కించారు. మళ్లీ ఇప్పుడు అధికార దాహం కోసం ప్రజలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. 3 పార్టీలను 2019లో ప్రజలు ఈడ్చి తన్నారు. ఇప్పుడు మభ్యపెట్టేందుకు మళ్లీ వస్తున్నారు’ అని ఓ ఫొటోను ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.