India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ వ్యక్తి తాను ఎంతగానో ఇష్టపడిన ఐఫోన్‌ను కేవలం రూ.39 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేశాడు. అయితే అదనపు లాభం కోసం ఉద్దేశపూర్వకంగా ఆ ఆర్డర్‌ను ఫ్లిప్‌కార్డ్ క్యాన్సిల్ చేసింది. తన డబ్బులు రీఫండ్ అయినప్పటికీ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసినందుకు వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. అతను అనుభవించిన మానసిక క్షోభకు రూ.10000 పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశించింది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అయితే, కొనుగోలు చేసిన వస్తువులు, వారు అందించిన సర్వీస్ పట్ల అసంతృప్తిగా ఉంటే ‘నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్’లో ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం 1800-11-4000, 1915 హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. 8800001915 నంబర్‌కు SMS చేసైనా మీ సమస్యను తెలపవచ్చు. ప్రభుత్వ <
ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో హమాస్ అగ్ర కమాండర్ హతమయ్యారు. అమెరికా ఎన్ఎస్ఏ జేక్ సలివాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. సెంట్రల్ గాజాలో జరిపిన గగనతల దాడిలో హమాస్ సైన్యం డిప్యూటీ కమాండర్ ఇస్సా మరణించాడని వెల్లడించారు. మిగిలిన అగ్ర కమాండర్లు సొరంగాల్లో దాక్కున్నారని తెలిపారు. హమాస్ సంస్థ టాప్ నేతల్లో ఇస్సా కూడా ఒకరని, అతడి మరణం ఇజ్రాయెల్‌కు పెద్ద విజయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన్ను ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా అభివర్ణించారు. ‘ట్రంప్ మన ప్రాథమిక స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. నేను, జో బైడెన్ కలిసి మన హక్కుల్ని కాపాడుతాం. తుపాకీ హింస సంస్కృతికి పరిష్కారాన్ని తీసుకొస్తాం. ట్రంప్‌నకు మాకు మధ్య వ్యత్యాసం సుస్పష్టంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా MBBS, BDS తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ దరఖాస్తులో సవరణలకు రేపు రాత్రి 11.59 వరకు అవకాశం ఉంది. అప్లై చేసినప్పుడు పొరపాట్లు చేసినవారు https://neet.nta.nic.in/లో లాగిన్ అయ్యి సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు. మే 5న మ.2 నుంచి సా.5.20 వరకు పరీక్ష జరగనుంది. ఈసారి దాదాపు 21 లక్షల మంది పరీక్షకు హాజరవుతారని అంచనా.
AP: గతంలో భీమిలి నుంచే గెలిచి మంత్రి అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు ఇవ్వాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది. జనసేనలోకి చేరి అయినా భీమిలిని దక్కించుకోవాలనుకుంటున్నారట గంటా. అటు, జనసేన అభ్యర్థినన్న ధీమాతో పంచకర్ల సందీప్ ఇప్పటికే భీమిలిలో తిరుగుతున్నారు. దీంతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.
AP: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు. ఎన్నికలకు, లెక్కింపునకు మధ్య 21 రోజుల గ్యాప్ ఉందని, ఈవీఎం ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాల్ వాదనలు విన్న కోర్టు, తగిన నిర్ణయాన్ని వెలువరించాలని సూచిస్తూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.
AP: వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి(కమలాపురం మాజీ ఎమ్మెల్యే)ని బరిలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది. ఆయన పేరుతో కొన్ని రోజులుగా IVRS సర్వే చేస్తోంది. 2014లో పోటీ చేసిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఈసారి విముఖత చూపుతున్నట్లు సమాచారం. కాగా కడప ఎంపీ స్థానంలో టీడీపీ కేవలం ఒక్కసారే(1984లో నారాయణరెడ్డి) గెలిచింది. 1989 నుంచి వైఎస్ కుటుంబసభ్యులే విజయం సాధిస్తున్నారు.
ఎన్నిరకాల వంటలున్నా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొందరికైతే రోజువారీ ఆహారంలో బిర్యానీ భాగమైంది. సిటీలోని 1,700కుపైగా రెస్టారెంట్ల నుంచి ఏడాదిలో 1.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది. సెకనుకు 2.3 బిర్యానీలను కొనుగోలు చేశారని తెలిపింది. మీలో ఎంతమందికి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం?
భారతీయ రైల్వే విడుదల చేసిన 9,144 రైల్వే ఉద్యోగాలకు <
Sorry, no posts matched your criteria.