news

News March 17, 2024

ఏపీలో TDP కూటమికి ఒక్క సీటూ రాదు: విజయసాయి

image

AP: ఎంపీ ఎన్నికల్లో TDP-జనసేన-BJP కూటమికి ఒక్క సీటూ రాదని YCP MP విజయసాయిరెడ్డి అన్నారు. ‘TDP ఎంపీ సీట్లు గెలుస్తుందని BJP కూడా నమ్మడం లేదు. కమలం పార్టీ సొంతంగా 370 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. NDA టార్గెట్ 400గా ఉంది. అంటే NDAలోని శివసేన, TDP, జనసేన, NCP, JDU, RLD, LJP కలిసి 30 సీట్లు మాత్రమే గెలుస్తాయని అంచనా. కాబట్టి ఏపీలో TDP కూటమికి జీరో సీట్లు వస్తాయి’ అని ట్వీట్ చేశారు.

News March 17, 2024

అశ్విన్‌కు 500గోల్డ్ కాయిన్లు.. రూ.కోటి నజరానా

image

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఇటీవల టెస్టు క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు, 500 వికెట్ల మైలురాయి చేరుకున్నందుకు అతడికి 500 గోల్డ్ కాయిన్లు, రూ.కోటి నజరానా ప్రకటించింది.

News March 17, 2024

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తాం: CM

image

TG: ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ స్పందించారు. ‘నా పేషీలో బ్రాహ్మిణ్, ముస్లిం, దళిత్, ఓబీసీ నుంచి ఒక్కొక్కరు, ఇద్దరు రెడ్లున్నారు. నలుగురిని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే.. అందులో ముస్లిం, దళిత్, రెడ్డి, బ్రాహ్మిణ్ ఉన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలోనూ సామాజిక న్యాయం పాటించాం’ అని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలను పట్టించుకోవద్దన్నారు.

News March 17, 2024

కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు పీకేస్తున్నా: రేవంత్ రెడ్డి

image

TG: ప్రభుత్వంలో కొందరు అధికారులు కేసీఆర్ కోవర్టులుగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. అవి వాసనలు వెదజల్లుతున్నాయి. ఇప్పటికే కొన్నింటిని పీకేశాను. ఇంకా పీకాల్సినవి ఉన్నాయి. అందుకు రోజుకు 18 గంటలు పనిచేస్తా. గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తా’ అని వెల్లడించారు.

News March 17, 2024

నా భర్తంటే ఇష్టంలేదు.. అందుకే విడాకులిచ్చా: నటి

image

ఒకప్పుడు తన భర్తే తనకు శత్రువు అని హీరోయిన్ మనీషా కోయిరాలా అన్నారు. ‘నా భర్తకు నాపై ఎప్పుడూ ప్రేమ లేదు. నాకు కూడా అతనంటే ఇష్టం లేదు. పెళ్లైన కొద్ది రోజులకే నాకు శత్రువుగా మారాడు. ఓ స్త్రీ జీవితంలో ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది. అందుకే అతడికి విడాకులు ఇచ్చా’ అని చెప్పారు. కాగా 2010లో బిజినెస్ మేన్ సామ్రాట్ దహల్‌ను మనీషా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 6 నెలలకే విడాకులు తీసుకున్నారు.

News March 17, 2024

EDపై మోదీ ప్రశంసలు

image

అవినీతికి వ్యతిరేకంగా ED(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) చేస్తున్న కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన.. తమ ప్రభుత్వం అవినీతిని సహించబోదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ అవలంబిస్తున్న కఠిన వైఖరిని ఆయన మెచ్చుకున్నారు. ఈడీ వంటి సంస్థలను కేంద్రం వాడుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. అవి స్వేచ్ఛగా పని చేస్తాయని స్పష్టం చేశారు.

News March 17, 2024

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి అప్డేట్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది. తాజాగా పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోను డైరెక్టర్ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘ఊహించనిది ఆశించండి’ మార్చి 19న రాబోతోందని ట్వీట్ చేశారు. దీంతో ఈ మూవీ ప్రోమో వీడియో రాబోతోందని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో పవన్ డైలాగ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 17, 2024

టీఆర్ఎస్‌కు నకలుగానే టీఎస్ తీసుకొచ్చారు: రేవంత్

image

TG: ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్ అందుకున్నాయి. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారు. వాహన రిజిస్ట్రేషన్‌లో టీఆర్ఎస్‌కు నకలుగానే టీఎస్ తీసుకొచ్చారు’ అని ఆరోపించారు.

News March 17, 2024

100 రోజుల్లో ప్రజాపాలన అందించాం: CM

image

TG: తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ప్రజాపాలన అందించామని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలు స్వేచ్ఛ కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. గతంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని, ప్రజలు నిరసనలు చేయకుండా అడ్డుకున్నారని సీఎం దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని సీఎం అన్నారు.

News March 17, 2024

Facebook యాడ్స్ ఎక్కువగా ఇచ్చిన పార్టీ ఇదే!

image

డిజిటల్ మీడియా రాజకీయ ప్రకటనలకు వేదికగా మారుతోంది. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం.. గత 90 రోజుల్లో దేశవ్యాప్తంగా & తెలంగాణలో ఫేస్‌బుక్‌లో రాజకీయ ప్రకటనల కోసం అత్యధికంగా బీజేపీనే ఖర్చు చేసినట్లు తేలింది. ఆ తర్వాత వైసీపీ& ఏపీ ప్రభుత్వం వినియోగించిందట. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు Facebookలో యాడ్స్ ఇవ్వలేదట. 16 DEC 2023 నుంచి 14 మార్చి 2024 వరకు BJP రూ.6కోట్లు ఖర్చు చేసింది.