news

News March 17, 2024

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభించింది: మోదీ

image

AP: ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘నిన్ననే లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. ఆ వెంటనే ఇవాళ ఏపీకి వచ్చాను. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లుగా భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి రాబోతున్నాం. ఎన్డీఏకి 400 సీట్లు దాటాలి. ఇందుకోసం మీరంతా ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.

News March 17, 2024

ఒంటిపూట బడులు.. స్కూళ్లకు కీలక సూచనలు

image

AP: ఒంటిపూట బడులు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లకు విద్యాశాఖ పలు కీలక సూచనలు చేసింది.
* స్కూల్‌లో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించవద్దు.
* ఎండల నేపథ్యంలో తగినంత తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
* మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు స్థానికుల సమన్వయంతో
మజ్జిగ అందించాలి.
* ఎవరైనా సన్ స్ట్రోక్‌కి గురైతే వైద్యారోగ్యశాఖ సమన్వయంతో చికిత్స అందించాలి.

News March 17, 2024

జగన్ ఏపీని చీకటిమయం చేశారు: చంద్రబాబు

image

AP: తన విధ్వంస పాలనతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు. జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారు. వైసీపీకి ఓటేయవద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే.. ప్రజలు అర్థం చేసుకోవాలి. పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు, ఉపాధి లేదు. రోడ్లు లేవు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారు’ అని విమర్శలు చేశారు.

News March 17, 2024

మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

image

ప్రజాగళం సభలో ప్రధాని మోదీపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ‘మోదీ ఒక వ్యక్తి కాదు. భారత దేశాన్ని విశ్వగురువుగా మార్చిన ఒక శక్తి. మోదీ అంటే అభివృద్ధి, సంస్కరణ, భవిష్యత్తు, ఆత్మగౌరవం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడాయన. పీఎం ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీగారు’ అని పేర్కొన్నారు.

News March 17, 2024

సీఎం జగన్‌కు గుణపాఠం నేర్పాలి: సత్యకుమార్

image

AP: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం నేర్పాలని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సభ.. గొడ్డలిపోటు వేసినవారికి గుండెపోటు తెప్పించాలి’ అని తెలిపారు. ‘వైసీపీ పాలన అవినీతిమయం. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది. రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పుల్లో ముంచారు. ప్రజాగళం సభ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది’ అని సోమువీర్రాజు మాట్లాడారు.

News March 17, 2024

సీఎం జగన్ దుర్మార్గుడు: చంద్రబాబు

image

AP: అమరావతిని సీఎం జగన్ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ‘కేంద్ర సహకారంలో మేము 70 శాతం పోలవరం పూర్తి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. లాండ్, శాండ్, మైన్, వైన్స్ పేరుతో దోచేశారు. జే బ్రాండ్ లిక్కర్ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి తన ఆదాయాన్ని పెంచుకున్న దుర్మార్గుడు జగన్’ అని మండిపడ్డారు.

News March 17, 2024

జెండాలు వేరైనా.. మా అజెండా ఒక్కటే: చంద్రబాబు

image

AP: జెండాలు వేరైనా.. టీడీపీ, జనసేన, బీజేపీ అజెండా ఒక్కటేనని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. ఐదేళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. ఎన్నికల్లో మీరిచ్చే తీర్పే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

News March 17, 2024

సీఎం జగన్ సారా వ్యాపారి: పవన్

image

AP: రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రావణ సంహారం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరుగుతుంది. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి. బ్లాక్ మనీ పెరిగిపోయింది. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు. కానీ అదేమీ జరగదు’ అని స్పష్టం చేశారు.

News March 17, 2024

ఇసుకలో జగన్ రూ.40వేల కోట్ల స్కామ్: పవన్

image

AP: ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40వేల కోట్లు దోచేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని ఆరోపించారు. ‘రాష్ట్రం డ్రగ్స్‌కు రాజధాని అయిపోయింది. ఇక్కడ 30వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక్కసారీ స్పందించలేదు. రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది’ అని ఆరోపించారు.

News March 17, 2024

8th ఫెయిలయ్యా.. నాన్న ఏడ్చారు: మాధవన్

image

నటుడు మాధవన్ పలు ఆసక్తికర విషయాలను ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ‘‘నేను మెరిట్ స్టూడెంట్ కాదు. 8వ తరగతిలో గణితంలో ఫెయిల్ అయ్యాను. కానీ, నేను టాటా స్టీల్స్‌లో జాబ్ కొట్టి, పెళ్లి చేసుకొని మా నాన్న ఉన్న ఇంట్లోనే ఉండాలని మా పేరెంట్స్ కోరిక. ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ నా అప్లికేషన్‌‌ను రిజెక్ట్ చేసినప్పుడు ‘నేను నీకేం తక్కువ చేశాను’ అని మా నాన్న నాతో కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు.