India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
FIITJEE కోచింగ్ సంస్థ తాజా ప్రకటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ సంస్థను వదిలి వేరే సంస్థలో కోచింగ్ తీసుకున్న ఓ యువతి ప్రదర్శన దిగజారిందని పేర్కొంటూ ఆమె ఫొటోను ప్రకటనలో ప్రచురించింది. ఇక వేరే సంస్థలతో తమ సంస్థను పోల్చుకుంటూ.. ఒక సంస్థ పేరు కింద దానిలో అంతా ఆత్మహత్యలే అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో FIITJEEపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడిన ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ పవర్ ప్లేలో 61 పరుగులు చేశారు. షెఫాలీ 21 బంతుల్లోనే 42*, లానింగ్ 14 బంతుల్లో 17* రన్స్‌తో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్ రేణుకా ఠాకూర్ సింగ్ 4వ ఓవర్లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నారు.
దేశంలోనే అండమాన్ & నికోబార్ ద్వీపంలో పెట్రోల్ ధరలు అత్యల్పం. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.82గా ఉంది. ఆ తర్వాత డామన్‌లో రూ.82, ఐజ్వాల్‌లో రూ.93.68, ఢిల్లీలో రూ.94గా ఉండగా.. అత్యధికంగా ఏపీలో రూ.109.87గా ఉంది. ఆ తర్వాత కేరళ(రూ.107.54), తెలంగాణ(రూ.107.39) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యధికంగా ఏపీలో లీటర్ డీజిల్ ధర రూ.97.6గా ఉండగా.. ఆ తర్వాత కేరళ రూ.96.41, తెలంగాణ రూ.95.63 ఉన్నాయి.
AP: చిలకలూరిపేటలో ఇవాళ జరిగిన TDP-జనసేన-బీజేపీ ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘ఈ సభలో ప్రధాని మోదీకి అవమానం జరిగింది. మైక్ మూగబోవడంతో ఆయన బొమ్మలా నిలబడ్డారు. సభ జరుపుకోవడం చేతకానివారు జగన్‌పై యుద్ధం అంటున్నారు. లోపాయికారి ఒప్పందం చేసుకున్న మీకు ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు.
ఒకవైపు కవిత అరెస్ట్.. మరోవైపు పార్టీ ఫిరాయింపులు BRSలో కలకలం రేపుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వరుసగా రాం.. రాం.. చెప్తుండటంతో ఎవరు ఎప్పుడు పక్కచూపులు చూస్తారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగేందుకు సిద్ధమవుతుండటం గులాబీ పార్టీని కంగారు పెడుతోంది. పార్లమెంట్ పోరుకు ముందు ఈ చేరికలతో BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాంగ్రెస్, బీజేపీ టార్గెట్‌గా తెలుస్తోంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని తమిళనాడులోని AIADMK పార్టీకి డొనేట్ చేసినట్లు ఈసీ పేర్కొంది. అలాగే CSK ఓనర్ ఎన్.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.10 కోట్ల విలువచేసే బాండ్లను కొనుగోలు చేసి DMK పార్టీకి డొనేట్ చేసింది.
తన శరీర రంగు విషయంలో చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని హీరోయిన్ భూమి శెట్టి తెలిపారు. ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘రంగుపై ఇతరుల మాటలతో ఎంతో బాధపడ్డా. ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏవైనా క్రీమ్స్ వాడాలని చెప్పేవారు. ఇప్పటికీ ఇన్‌స్టాలో ఫొటోలకు నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు వాటిని పట్టించుకోవట్లేదు. నా అందం గురించి నాకు తెలుసు’ అని పేర్కొన్నారు.
AP: ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13న జరగాల్సిన డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసినట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. కాగా 38 DyEO పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
TS: రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్ వేయనున్నారు. తనను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలున్నా, ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొననున్నారు. కవిత తరఫున కపిల్ సిబాల్, రోహత్గీ కోర్టులో వాదించనున్నారు.
WPL ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ప్లేయింగ్11
ఢిల్లీ: మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, మిన్ను మణి
ఆర్సీబీ: మంధాన, సోఫీ డివైన్, మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్, ఆశా శోభన
Sorry, no posts matched your criteria.