India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ‘అదంతా చెత్త ప్రచారం. అసలు ఇప్పటివరకు షమీని సానియా కలవనే లేదు’ అని స్పష్టం చేశారు. కాగా షోయబ్ మాలిక్-సానియా విడాకులు తీసుకోగా, భార్య హసీన్ జహాన్‌తో షమీ దూరంగా ఉంటున్నారు. దీంతో సానియా, షమీ త్వరలో ఒక్కటవ్వబోతున్నారంటూ నెట్టింట పుకార్లు మొదలయ్యాయి.
వడగాలుల ధాటికి తట్టుకోలేక ఉత్తరాది అవస్థలు పడుతున్న వేళ యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ అడ్వొకేట్ ఇంద్రుడికి లేఖ రాశాడు. కొన్నిరోజులుగా భానుడి భగభగలు తట్టుకోలేక కాన్పూర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అతుల్ సన్వారే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలతో ఊరట కల్పించాలని వరుణుడిని వేడుకున్నాడు. అయితే వడగళ్ల వానను మాత్రం కురిపించొద్దని, అలాగే రోజూ గాలి వీచేలా వాయు దేవుడిని రిక్వెస్ట్ చేయమని కోరాడు.
TG: నూతన హెల్త్ పాలసీ మీద ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో మెడికల్ ఓపీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఆరోగ్య పథకాల అమల్లో ఇబ్బందులను గుర్తిస్తాం. PHCలను బలోపేతం చేస్తాం. ప్రస్తుతం అన్ని చోట్లా ఇన్‌ఛార్జి పోస్టులే ఉన్నాయి. త్వరలో వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తాం’ అని పేర్కొన్నారు.
TG: అరెస్ట్ చేసిన BRS మాజీ MLA బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘BRS శ్రేణులు సీఎం కాన్వాయ్‌పై దాడి చేయలేదు. పోచారం ఇంటికి CM ఎందుకు వచ్చారో తెలుసుకునేందుకు వెళ్లారంతే. అంతమాత్రానికే అరెస్ట్ చేస్తారా?’ అని ప్రశ్నించారు. మరోవైపు బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరితాడు వేయడమేనని జగదీశ్ రెడ్డి అభివర్ణించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600కుపైగా పాయింట్లు కోల్పోయి కనిష్ఠంగా 76,895కు చేరింది. ప్రస్తుతం 480 పాయింట్ల నష్టంతో 77029 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం 23,390 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. 120 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం 23448 వద్ద కొనసాగుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, L&T వంటి బడా షేర్లు నష్టాలు నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.
తమిళ నటి వరలక్ష్మి శరత్‍కుమార్, తన ప్రియుడు నికోలై సచ్‌దేవ్‌ని జూలై 2వ తేదీన వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్లి థాయ్‌లాండ్‌లో జరగనున్నట్లు సినీవర్గాల సమాచారం. ఈక్రమంలో టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించేందుకు ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా ఈ జంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అల్లు అరవింద్‌ని కలిసి కుటుంబమంతా హాజరుకావాలని ఆహ్వానించింది.
ఇటీవల స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.810 పెరిగి రూ.73,250కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ.67,150గా ఉంది. అటు వెండి ధర కూడా కేజీకి రూ.1400 పెరిగింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ రూ.98,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో మరణమృదంగం మోగుతోంది. కల్తీ నాటు సారా మృతుల సంఖ్య 47కి చేరినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. కల్తీ సారా తాగి మొత్తం 165 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు పూర్తిగా కోలుకున్నారని వివరించారు. మరోవైపు మృతదేహాలను సామూహిక దహనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
AP: తొలి రోజు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు వేర్వేరు కారణాల వల్ల ఈరోజు అసెంబ్లీకి రాలేకపోయారు. సభ రేపు ఉదయం 10.30గంటలకు పున:ప్రారంభం కానుంది. మిగిలిన ముగ్గురు సభ్యులు రేపు ప్రమాణం చేసే వీలుంది.
‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అంటూ ప్రశ్నించిన నెటిజన్‌పై హీరోయిన్ శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి వివక్షలు వద్దు. మీరు మమ్మల్ని ఇడ్లీ, సాంబార్ అని అనడం మంచిది కాదు. మీరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దు’ అని ఘాటు రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ నటులు దక్షిణాది యాక్టర్లను చిన్న చూపు చూస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.