India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వయనాడ్ MPగా రాహుల్ తప్పుకొని ప్రియాంక పోటీ చేయనుండటంపై కౌంటర్ల వర్షం కురుస్తోంది. రాహుల్ రాయ్‌బరేలీలోనూ పోటీ చేస్తారనే విషయాన్ని వయనాడ్‌లో దాచారని, ఇప్పుడు ప్రియాంక పోటీ చేస్తున్నారని బీజేపీ పేర్కొంది. ఇలా వారి ఫ్యామిలీని వయనాడ్ ప్రజలపై రుద్దడం సిగ్గుచేటంది. దానికి కాంగ్రెస్ కౌంటరిస్తూ ‘2014లో వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని మోదీ వడోదరా ప్రజల వద్ద దాచిపెట్టారా?’ అని ప్రశ్నించింది.
AP: రాష్ట్రవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులకు రాయితీతో అందించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రేట్లపై ఉన్నతాధికారులు ఇవాళ సమీక్ష నిర్వహించారు. రిటైల్ మార్కెట్‌లో సగటున కిలో <<13456744>>ధర<<>> రూ.55-65 పలుకుతున్నట్లు గుర్తించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా చిత్తూరు జిల్లాలోని మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసి, రైతు బజార్లలో అదే ధరకు విక్రయించనున్నట్లు తెలిపారు. అయితే ఏ రేటుకు అనేది వెల్లడించలేదు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. SIBకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఛైర్మన్ రవికుమార్ నుంచి హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రవికుమార్‌కు చెందిన హైదరాబాద్, బెంగళూరులోని ఇళ్లు, కార్యాలయాల్లో మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లనూ వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్‌కు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్నా ఆహార ధరలు పెరుగుతుండటంతో అది సవాల్‌గా మారుతోందని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సప్లైకు కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం ధరలపై కనిపిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ద్రవ్యోల్బణ కట్టడి సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. గత ఏడు నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం సగటు 8%గా ఉందని తెలిపారు. కాగా ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 4.75%గా ఉంది.
థాయ్‌లాండ్ ప్రభుత్వం స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్లుకు పెద్దల సభ అయిన సెనేట్‌లోనూ ఆమోదం లభించింది. 130 మంది సెనేటర్లు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు వ్యతిరేకించారు. థాయ్‌లాండ్ రాజు ఆమోదం తెలిపిన 120 రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వస్తుంది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను లీగల్ చేసిన తొలి ఆగ్నేయాసియా దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది.
దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘వ్యవసాయ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. దేశంలోని రైతులంతా మా వెంటే ఉన్నారు. ఆధునిక టెక్నాలజీని వ్యవసాయం రంగంలో సమృద్ధిగా ఉపయోగిస్తున్నాం. ఆత్మనిర్భర్ దిశగా భారత్ దూసుకెళ్తోంది. దేశ ప్రజల కలలు సాకారం చేసే దిశగా ప్రయత్నిస్తాం’ అని పీఎం పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో YCP హయాంలో పెట్టిన అన్ని ప్రభుత్వ పథకాల పేర్లను టీడీపీ ప్రభుత్వం మార్చింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు-చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి- ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన- పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, జగనన్న విదేశీ విద్యాదీవెన-అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యా నిధిగా పేర్లు మార్చింది.
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి ఎగబాకారు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో సెంచరీ బాదిన ఆమె ఇంటర్నేషనల్ కెరీర్‌లో 7,000 పరుగుల మైలురాయి చేరుకున్నారు. ఈక్రమంలో 715 పాయింట్లతో వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్‌లోనూ పైకి దూసుకెళ్లారు. ఈ జాబితాలో 772 పాయింట్లతో బ్రంట్(ఇంగ్లండ్), 768 పాయింట్లతో ఆటపట్టు(శ్రీలంక) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.
తిరుమల మాడవీధుల్లో ఎండలో నడిచేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం కలిగించేలా రోడ్డుపై కూల్ పెయింట్ వేశారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైట్ కూల్ పెయింట్ వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలోనే ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. 1999లో జరిగిన గైసల్ రైలు ప్రమాదంలో 290 మంది మరణించారని, దీనికి బాధ్యత వహిస్తూ అటల్ బిహారి వాజ్‌పేయి క్యాబినెట్‌లో రైల్వే మంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ రాజీనామా చేశారని గుర్తుచేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.