India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20 WCలో ఫిక్సింగ్ కలకలం రేగింది. తనను కొంతమంది బుకీలు సంప్రదించారని ఓ ఉగాండా ప్లేయర్ ICCకి ఫిర్యాదు చేశారు. కెన్యాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ పదే పదే ఫోన్లు చేసినట్లు ఆయన ఐసీసీకి సమాచారమిచ్చారు. దీనిపై ICC యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా T20 WCకు ఉగాండా అర్హత సాధించడం ఇదే తొలిసారి. నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క దాంట్లో గెలిచింది.
AP: మీరు 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివి, కానీ 2024లో ఓడిపోతే అవి చెడ్డవా అని మాజీ సీఎం జగన్‌ను మంత్రి నారా లోకేశ్ నిలదీశారు. ఈవీఎంల పనితీరుపై ప్రశ్నించే హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు. ‘ప్రజాధనంతో కొన్న ఫర్నిచర్ ఎప్పుడు తిరిగిస్తున్నారు. రూ.560 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ ఎందుకు నిర్మించారు? వీటిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం కావాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ <<13462523>>ఫలితాల్లో<<>> 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవెరిఫికేషన్‌కు ఈ నెల 20 నుంచి 24 వరకు అధికారులు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. కాగా ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
AP: రాష్ట్రంలో హింసాత్మక పాలన పోయి ప్రజాపాలన మొదలైందని CM చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్న సంతోషంలో ఉన్నారని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశా. వారి బాధలు విని, సమస్యలు తెలుసుకున్నా. కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రజాపాలన అందిస్తుంది. ఇకపై రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది’ అని ఆమె పేర్కొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు లాభపడి 77,301కు చేరగా, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,557 వద్ద ముగిసింది. పవర్‌గ్రిడ్, విప్రో, ICICI బ్యాంక్, టైటాన్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. రక్షణ రంగంలో ఎగుమతులను 2029కి ₹50వేలకోట్లకు పెంచాలని కేంద్రం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఢిఫెన్స్ స్టాక్స్ దూసుకెళ్లాయి. గరిష్ఠంగా పరాస్ ఢిఫెన్స్ 20% లాభాన్ని రికార్డ్ చేసింది.
T20WCలో అఫ్గాన్‌తో సూపర్8 మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్, కుల్దీప్ జట్టులో చేరే అవకాశం ఉంది. జైస్వాల్‌ను రోహిత్‌తో ఓపెనింగ్‌లో దింపే ఛాన్స్ ఉంది. ఓవల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే నేపథ్యంలో కుల్దీప్‌ను జట్టులోకి తీసుకొని అర్ష్‌దీప్ సింగ్‌కు రెస్ట్ ఇవ్వనున్నారట. ఓపెనర్‌గా ఇటీవల విఫలమవుతున్న కోహ్లీ వన్‌డౌన్‌లో రావొచ్చు. అయితే జైస్వాల్ కోసం అక్షర్ బెర్త్ కోల్పోవాల్సి ఉంటుందని టాక్ విన్పిస్తోంది.
TG: రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు(ATC)గా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,324 కోట్లు ఖర్చు చేయన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీ వయనాడ్ MPగా రాజీనామా చేసి, రాయ్‌బరేలీని అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఆ స్థానంలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేస్తారని ఇప్పటికే INC చీఫ్ ఖర్గే ప్రకటించారు. ఒకవేళ ఆమె గెలిస్తే గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు MPలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటికే సోనియా (రాజస్థాన్) రాజ్యసభకు, రాహుల్ (రాయ్‌బరేలీ) లోక్ సభకు ఎన్నికై ఉన్నారు.
T20 WCలో సూపర్-8 దశలో ఏదైనా ప్రత్యేకంగా చేస్తామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘జట్టులో సభ్యులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సూపర్-8 షెడ్యూల్ కొంచెం టైట్ ఉన్నా ఈస్థాయిలో అలా ఆడేందుకు అలవాటుపడి ఉన్నాం. మా నైపుణ్యాలకు మరింత పదును పెట్టడంపై దృష్టి సారించాం. ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నాం’ అని వెల్లడించారు. భారత్ ఈ నెల 20 అఫ్గాన్‌తో, 22న బంగ్లాదేశ్‌తో, 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
AP: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు తిరోగమించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ధర్మవరంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఏపీని నంబర్-1 చేస్తామని తెలిపారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.